Auto Ram Prasad : ఒంటరిని అయ్యాను.. స్టేజ్ మీద జబర్దస్త్ ఆటో రాం ప్రసాద్ కన్నీరు
Auto Ram Prasad : జబర్దస్త్ ప్రయాణం గురించి ఒక్కసారి ఆలోచిస్తే.. ఎంతో మంది గుర్తొస్తారు. మధ్యలో ఎంతో మంది వచ్చారు. మధ్యలోనే పోయారు. కొందరు మాత్రం మొదటి నుంచి చివరి వరకున్నారు. ఇంకొంత మంది మధ్యలో వచ్చినా చివరి వరకున్నారు. అలా జబర్దస్త్ ప్రయాణం ముందుకు పోతూనే ఉంది. కంటెస్టెంట్లు, టీం లీడర్లు, జడ్జ్‌లు ఇలా ఎవ్వరూ మారినా కూడా షో తాలుకూ మార్క్ మాత్రం మిస్ అవ్వలేదు. జబర్దస్త్ అంటే ముఖ్యంగా సుడిగాలి సుధీర్ బ్యాచ్ అందరికీ గుర్తుకు వస్తుంటుంది. అందులో సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ ఈ ముగ్గురూ మరీ ముఖ్యంగా గుర్తుకు వస్తుంటారు.
సన్నీ ఉన్నా కూడా అంతగా ఫేమస్ అవ్వలేదు. సుధీర్, శ్రీను, రాం ప్రసాద్‌ల స్నేహం భిన్నమైంది. బుల్లితెరపై మొదలైన వీరి స్నేహం వెండితెర వరకు వెళ్లింది. త్రీ మంకీస్ అనే సినిమాలోనూ ఈ ముగ్గురే నటించారు. అయితే ఆ సినిమా అంతగా వర్కవుట్ అవ్వలేదు. అసలు ఈ ముగ్గురికీ వెండితెర అంతగా అచ్చిరాలేదు. బుల్లితెరపైనే వీరు స్టార్లు. అయినా కూడా సిల్వర్ స్క్రీన్ మీద ఆశ మాత్రం పోవడం లేదు.
ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షోను వదిలేసి వెళ్లిపోయారు. గెటప్ శ్రీను, సుధీర్ ఇద్దరూ హీరోలుగా ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇక వారిద్దరూ లేకపోయినా తనకేంటి రైటర్‌ని రాసేసి స్కిట్ చేద్దామని అనుకున్నాడట. కానీ తాను ఒంటరిని అయ్యాను అని ఎక్కడో అనిపించేసిందట.. అని చెబుతూ స్టేజ్ మీదే రాం ప్రసాద్ కన్నీరు పెట్టేసుకుని అందరినీ కంటతడి చేసేశాడు.