Hyper Aadi : జబర్దస్త్ లో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ కి మాత్రమే ఆ ఒక్క వెసులుబాటు
Hyper Aadi : తెలుగు బుల్లి తెర ని షేక్ చేస్తున్న జబర్దస్త్ కార్యక్రమం దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కి జబర్దస్త్ ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు పూర్తి అవ్వబోతున్న నేపథ్యంలో ఒక భారీ ఈవెంట్ ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే జబర్దస్త్ లో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి.. జబర్దస్త్ కమెడియన్స్ ని కొందరు తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది.. అక్కడ పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది ఇలా రకరకాలుగా ప్రచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీం లీడర్స్ రాసుకున్న స్కిట్ పేపర్లు ఇద్దరు ముగ్గురు చేతులు మారి ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రమంలో టీం లీడర్లకు చుక్కలు చూపిస్తారంటూ గుసగుసలు ఉన్నాయి.
పెద్ద ఎత్తున జబర్దస్త్ టీం మెంబెర్స్ స్కిట్స్ రాసుకుంటారు.. వాటిలో కొన్ని మాత్రమే ఫైనల్ దశకు చేరుకుంటాయి. కొన్ని నవ్వించలేవని పక్కకు పెట్టేస్తారు.. కొన్ని వివాదాస్పదమవుతాయని పక్కకు పెట్టేస్తారు. కానీ హైపర్ ఆది మరియు రాంప్రసాద్ లు రాసుకోచ్చిన స్కిట్స్ మాత్రం ఏ ఒక్కరూ మార్చడానికి వీలు లేదు.. అలాగే మార్పులు చెప్పడానికి అవకాశం లేదు. వారికి మల్లెమాల వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏదైనా వివాదాస్పదమైతే వాళ్లే ఎదుర్కొనేలా కూడా ముందస్తుగా ఒప్పందం ఉంది. అందుకే జబర్దస్త్ కోసం వాళ్లు ఏం రాసుకున్నా కూడా దాన్ని స్టేజిపై చూపించేందుకు ఓకే చెప్తారు. ఈ విషయాన్ని జబర్దస్త్ కు చెందిన పలువురు కమెడియన్ గతంలో చెప్పుకొచ్చారు.
ముందస్తుగా స్క్రిప్ట్ పేపర్స్ మల్లెమాల ఆఫీసులో ఇచ్చి వాటిని అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడం ఏమీ వీళ్లకు ఉండదు. హైపర్ ఆది మరియు రాంప్రసాద్ ఏదైనా ఐడియా అనుకుంటే వెంటనే దాన్ని చేసేస్తారు.. జబర్దస్త్ లో ఉన్న పదేళ్ల సీనియర్ అయినా కూడా తన స్కిట్ పేపర్ ని మల్లెమాల ఆఫీసులో ఇవ్వాల్సిందే అక్కడి నుండి అప్రూవల్ తెచ్చుకోవాల్సిందే. కానీ వీరిద్దరికి మాత్రమే అప్రూవల్ అనే ఆప్షన్ వర్తించదు, దాని నుండి మినహాయింపు ఉంటుంది అంటూ జబర్దస్త్ వాళ్ళు అంటున్నారు. అలాగే వీరిద్దరి రెమ్యునరేషన్ కి ఇతర టీం లీడర్ల అందరి రెమ్యూనరేషన్ సమానం అన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ప్రస్తుతం జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ వీరిద్దరి కారణంగానే నడుస్తుంది. కనుక వారిద్దరికీ అంత ప్రాముఖ్యత ఇవ్వడం సభబె.. అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం కూడా సభబే అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.