Jabardasth Avinash : జానకి కలగనలేదు నటితో వింత ప్రవర్తన.. అవినాష్ అతి తగ్గడం లేదు
Jabardasth Avinash : బుల్లితెరపై అవినాష్ చేసే అతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనే అవినాష్ పేరు కాస్త అతినాష్‌గా మారింది. తనను తాను ఎంటర్టైనర్ అని ప్రకటించుకోవడం, కాస్త ఓవర్ చేయడం అందరికీ తెలిసిందే. ఇక అవినాష్ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక కూడా అదే భ్రమలో ఉండిపోయాడు.బయటకు వచ్చిన అవినాష్‌కు ఏ షో కూడా లేకుండా పోయింది. జబర్దస్త్ అగ్రిమెంట్‌ను పూర్తి చేసుకుని, అందుకోసం పది లక్షలు చెల్లించి మరీ వచ్చాడు.
అలా జబర్దస్త్ గడప తొక్కకుండా అయిపోయింది. అయితే అవినాష్ మాత్రం స్టార్ మా చానెళ్లలోనే ఫిక్స్ అయిపోయాడు. కామెడీ స్టార్స్ షోను పట్టుకుని అవినాష్ వేళ్లాడుతున్నాడు.అయితే అవినాష్ మాత్రం ప్రతీ ఈవెంట్లు కనిపిస్తూనే ఉంటాడు .ఈవెంట్ ఏదైనా, షో ఏదైనా సరే స్టార్ మాలో అవినాష్ ఎంట్రీ మాత్రం ఉండాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. ఒక్కోసారి ఈవెంట్లో అవినాష్ చేసే చేష్టలు వెగటు పుట్టించేలా ఉంటాయి. కొన్నిసార్లు అవినాస్ బార్డర్ క్రాస్ చేసేస్తుంటాడు.
jabardasth avinash fun with janaki kalaganaledhu priyanka jain in ugadi 2022 event in star maa
Jabardasth Avinash : ప్రియాంకతో అవినాష్ వేషాలు..
ఎవరితో ఎలా జోకులు వేయాలి.. ఎవరి మీద వేయాలి అనేది అవినాష్ మరిచిపోతుంటాడు. తాజాగా ఉగాది పండుగ ఈవెంట్‌లో అవినాష్ జాతకాలు చెప్పేవాడిలా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియాంక సింగ్‌తో పరాచకాలు ఆడాడు. డ్రెస్ బాగుంది కదా? అని పిలిచాడట. ఇక జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్‌తో పరాచకాలు ఆడాడు. పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయని, వరుడు ఎవరో చెప్పనా? అంటూ కౌంటర్ వేశాడు. దీంతో ప్రియాంక కాస్త సీరియస్ అయినట్టు కనిపించింది.
