Jabardasth Babu : టిక్ టాక్‌లో పట్టేశాడా?.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వెరైటీగా ఉందే
Jabardasth Babu : జబర్దస్త్ షోలో కమెడియన్స్ ఎంతో మంది ఉన్నారు.అయితే అందరూ ఒకే సమయంలో ఫేమస్ కాలేరు. కొంత మంది ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ షోలో ఉన్నా కూడా వెలుగులోకి రాలేదు. అయితే అందులో ఈ మధ్య కొందరు బాగానే తెరపైకి వస్తున్నారు. అందులో బాబు ఒకడు. ఇతను కమెడియనా? కాదా? అన్నది పక్కన పెట్టేయాలి.
ఎందుకంటే బాబు మీద జబర్దస్త్ ఆర్టిస్టులే పంచులు వేస్తుంటాడు. నటన రాదు, కమెడియన్ కాదు అని అంటుంటారు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. తాజాగా ఆయన లవ్ స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో వేదికగా బాబు తన ప్రేమకథను చెప్పేశాడు. తన పేరు అమూల్య అని, అమ్ము గారు అని పిలుస్తాను అంటూ స్టేజ్ మీదకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాడు.

Jabardasth Babu Love Story With Amulya In SRidevi Drama Company
Jabardasth Babu : బాబు అమూల్య జోడి..
బాగా ఫేమస్ అయిన తన డైలాగ్స్‌ను అమూల్య టిక్ టాక్‌లో చెప్పిందని, తాను కూడా కలిసి చేశాను, తరువాత మెల్లిగా నంబర్ తీసుకున్నాను.. మొదట్లో తిట్టిందని, ఆ తరువాత లాక్డౌన్ అయిన ఏడాది తరువాత మళ్లీ ఎలాగోలా మాటలు కలిపి సెట్ చేసుకున్నాను అంటూ బాబు తన ప్రేమ కథ గురించి అందరి ముందే స్టేజ్ మీద చెప్పేశాడు.
