Getup Srinu : ప్రేయసిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ బాబు.. పరువుతీసిన గెటప్ శ్రీను
Getup Srinu : జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతో మంది కమెడియన్లు పుట్టుకొచ్చారు. మొదట్లో వీళ్లేం కమెడియన్లు అనుకున్న వారే ఇప్పుడు హాస్యాన్ని పండిస్తున్నారు. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసిన వాళ్లలో బాబు కూడా ఒకడు. సరైన గుర్తింపు కోసం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. ఆ టీం ఈ టీం అని తేడాలేకుండా అన్ని టీంలలో కనిపిస్తుంటాడు. ఇక ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తున్నాడు.
తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో బాబు తన లవర్‌ని పరిచయం చేశాడు. ఐదేళ్ల నుంచి వీరి ప్రేమ కథ నడుస్తోందంట. ఆమె పేరు అమూల్య అని చెప్పుకొచ్చాడు. అమ్ము గారు అని పిలుస్తాడట. ఇక అమూల్య సైతం బాబు కోసం కొన్ని గిఫ్ట్‌లు తీసుకొచ్చింది. బాబు రాసిన మొదటి ప్రేమ లేఖను రాసి చదివి పరువుతీశారు.

Jabardasth Comedian Babu Introduces His Lover Amulya In Getup Srinu comments Sridevi Drama Company
Jabardasth Comedian Babu : బాబుపై గెటప్ శ్రీను కౌంటర్లు
బాబు గారు అని అమూల్య పిలుస్తుందట. అమ్ము గారు అని బాబు పిలుస్తాడట. ఇదేంట్రా ఇంట్లో పని మనుషుల్లా బాబు గారు, అమ్మగారు అని పిలుచుకోవడం అంటూ గెటప్ శ్రీను పరువుతీసేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి బాబు మాత్రం తన ప్రేయసిని ఇలా స్టేజ్ మీదే అందరికీ పరిచయం చేసేశాడు.
