Rashmi Gautam : రష్మీ ముందు మోకాళ్ల మీద నిల్చున్నాడు.. జబర్దస్త్ కమెడియన్ ఫాదర్ మామూలోడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : రష్మీ ముందు మోకాళ్ల మీద నిల్చున్నాడు.. జబర్దస్త్ కమెడియన్ ఫాదర్ మామూలోడు కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :20 June 2022,3:30 pm

Rashmi Gautam : శ్రీదేవీ డ్రామా కంపెనీ షో చాలా కొత్త దారిలో నడుస్తోన్న సంగతి తెలిసిందే. కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్లతో స్కిట్లు వేయిస్తుంటుంది. ఇక స్పెషల్ డేస్ అంటూ కొత్త కొత్త కాన్సెప్టులతో వస్తోంది. ఆదివారం నాటి ఫాదర్స్ డే సందర్భంగా కమెడియనర్ల ఫాదర్లను పిలిపించారు. వారితో స్కిట్లు వేయించారు. అలా మొత్తానికి నూకరాజు తండ్రి, బుల్లెట్ భాస్కర్ నాన్న, బాబీ తండ్రి, సుజాత ఫాదర్ ఇలా అందరూ స్టేజ్ మీదకు ఎక్కారు. తమ తమ స్టైల్లో దండి పడేశారు. ఇక శాంతి కుమార్ కూతురు, నవీన్ కొడుకు కూడా బాగానే నవ్వించారు. ఇందులో జబర్దస్త్ బాబీ తండ్రి మాత్రం రష్మీ మీద కన్నేసినట్టు కనిపించింది.

ఎందుకొచ్చావ్ అని అంటే.. రష్మీ ఉంది కదా? అని అనేశాడు. రష్మీతో మాట్లాడొచ్చు అని వచ్చానని అంటాడు. ఇక రష్మీ ఫోన్ నంబర్ ఇస్తుందేమో అని ఆశపడ్డాడట. అందుకే తన నంబర్‌ను రెండు చీటిల్లో రాసుకొచ్చాడట. రెండు చీటిల్లో ఎందుకు రాసుకొచ్చావ్ అని అడిగితే.. పూర్ణ కూడా ఉంది కదా? ఆమెకి కూడా ఇద్దామని అంటాడు. ఇక ఇలానే ఉంటే ఇంకా రెచ్చిపోతాడు అని తన తండ్రిని స్టేజ్ మీద నుంచి తీసుకెళ్దామని బాబీ అనుకుంటాడు. కానీ అతను మాత్రం వచ్చేందుకు ఒప్పుకోడు. ఇంకో పని ఉంది ఆగు అని రష్మీ వద్దకు వెళ్తాడు. నేను చచ్చిపోతే నువ్ ఏడుస్తావో లేదో గానీ..

Jabardasth Comedian Bobby Father Proposes Rashmi Gautam In Sridevi Drama Company

Jabardasth Comedian Bobby Father Proposes Rashmi Gautam In Sridevi Drama Company

నువ్ ఏడిస్తే మాత్రం నేను బాధపడతాను అంటూ రష్మీ ముందు మోకాళ్ల మీద నిల్చుని చెప్పేశాడు బాబీ తండ్రి. మొత్తానికి అలా ప్రపోజ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. రష్మీ సుధీర్ ప్రపోజల్, ఆ డైలాగ్స్ అంతగా ఫేమస్ అయ్యాయన్నమాట. మొత్తానికి ఇలా తండ్రులు వేసిన స్కిట్ మాత్రం అదిరిపోయింది. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా పర్ఫామెన్స్ ఇచ్చారు. శాంతి కుమార్ అయితే మొదటి సారిగా తన కూతురిని తీసుకొచ్చాడు. నవీన్ తన కొడకుని పట్టుకొచ్చాడు. వీళ్లిద్దరూ కూడా తమ తండ్రుల పరువుతీసేశారు. సెటైర్లతో ఆడేసుకున్నారు. అలా స్కిట్ మొత్తం నవ్వుల వర్షం, పంచ్‌ల ప్రవాహం జరిగింది. ఇక వచ్చే వారం ఏ కాన్సెప్ట్‌తో వస్తారో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది