Hyper Aadi : జబర్దస్త్ లో మాయం అయిన హైపర్ ఆది అక్కడ కనిపించబోతున్నాడా?
Hyper Aadi : జబర్దస్త్ నుండి హైపర్ ఆది మళ్లీ కనిపించకుండా పోయాడు. ఆయన ఈటీవీలో ప్రసారమవుతున్న ఇతర షోస్ లో కనిపిస్తున్నాడు. కానీ జబర్దస్త్ లో మాత్రం కనిపించలేదు. పైగా ఆయన స్థానంలో కొత్త టీమ్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. హైపర్ ఆది ప్లేస్ ని పటాస్ సద్దాం మరియు యాదమరాజు లతో భర్తీ చేసేందుకు జబర్దస్త్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ వారికి అంత సీన్ లేదని హైపర్ ఆది ప్లేస్ నీ భర్తీ చేయడం ఏ ఒక్కరి వల్ల కాదు అంటూ అంతా భావించారు. కానీ అనూహ్యంగా మల్లెమాల వారు కాస్ట్ కట్టింగ్ పేరుతో జబర్దస్త్ నుండి హైపర్ ఆది ని తొలగించారట.
హైపర్ ఆదిని మల్లెమాల వారు తొలగించారు అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. మరికొందరు మాత్రం గతంలో మాదిరిగా హైపర్ ఆది మళ్లీ వస్తాడని ఆయన కోసం జబర్దస్త్ ప్రేక్షకులు ఎదురు చూడవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ లో హైపర్ ఆది లేకపోతే ప్రేక్షకులు కనీసం యూట్యూబ్ లో కూడా చూసేందుకు ఆసక్తి చూపించరు. అలాంటిది జబర్దస్త్ ఈ సమయంలో హైపర్ ఆదిని కోల్పోవడం విచారకరం అంటూ బుల్లితెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హైపర్ ఆది జబర్దస్త్ ని వీడి పోవడం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. మరి హైపర్ ఆది సమాధానం ఏంటి అనేది చూడాలి.
ఇక మల్లెమాల వారు మాత్రం ఈ విషయం గురించి నోరు మెదపడం లేదు. ఇతర షో ల్లో ఆది కనిపించడం వల్ల జబర్దస్త్ లో రీ ఎంట్రీ కే ఎక్కువ స్కోప్ ఉందనే వార్తలు వస్తున్నాయి. గతంతో పోల్చితే జబర్దస్త్ యొక్క రేటింగ్ దారుణంగా పడిపోయింది. అందుకే ఆది వంటి వారిని ఎక్కువ పారితోషికం ఇవ్వలేక పంపిచేస్తున్నారేమో అనేది కొద్ది మంది అభిప్రాయం. జబర్దస్త్ నుండి కనిపించకుండా పోయిన హైపర్ ఆది ఇతర షో ల్లో కనిపించడంతో పాటు స్టార్ మా లో మరోసారి ప్రసారం కాబోతున్న కామెడీ స్టార్స్ లో సందడి చేసే అవకాశాలు ఉన్నాయని.. అంతే కాకుండా సినిమాల్లో కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.