Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కన్నీళ్లు… సూపర్ స్టార్‌ని చిల్లర స్టార్‌ చేశారు కదరా..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 6 February 2023, 10:00 am

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కొన్ని నెలల ముందు వరకు బుల్లి తెర సూపర్ స్టార్. ఏ కార్యక్రమం చేసినా కూడా రేటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యేది. జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ యొక్క స్కిట్ కి అత్యధిక వ్యూవర్షిప్‌ దక్కేది.. అలాగే యూట్యూబ్ లో కూడా అత్యధిక వ్యూస్ లభించేవి. అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా చేస్తున్న కూడా అదే స్థాయి ఆదరణ సుధీర్ పై ప్రేక్షకులు చూపించారు. అలాంటి సుధీర్ ఇప్పుడు ఈటీవీ నుండి కనుమరుగయ్యాడు. సినిమాలతో బిజీగా ఉన్నాను అంటూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేశాడు.

Sudigali Sudheer fans very sad about his career

Sudigali Sudheer fans very sad about his career

స్టార్ మాలో ఏదో కార్యక్రమం చేయడం కోసం వెళ్ళిన సుధీర్ అక్కడ నుండి అటు ఇటు తిరుగుతూ దిక్కు తోచని వాడిలా బిక్కుబిక్కుమంటున్నాడు. సుధీర్ పరిస్థితి చూసి అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో సుధీర్ తో ఆ కార్యక్రమ నిర్వాహకులు చిల్లర వేషం వేయించారు. సూపర్‌ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుధీర్ ని ఇప్పుడు చిల్లర స్టార్ గా వారు చేయడం అభిమానులకు బాధించింది, ప్రస్తుతం సుధీర్ ఉన్న పరిస్థితిలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేస్తూ పోవాలి. అందుకే చిల్లర వేశాలైనా..

Sudigali Sudheer to ETV anniversary and insulted him

Sudigali Sudheer to ETV anniversary and insulted him

చిల్లర స్టార్ గా చూపించిన ఎలాగైనా కూడా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో తిరిగి ప్రవేశించేందుకు సుధీర్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారట. కానీ ఏ ఒక్క ప్రయత్నం కూడా సఫలం కాలేదు. అందుకే బయట చానల్స్ లో సాధ్యమైనంత వరకు ఎక్కువ కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అవి చిన్నవైనా పెద్దవైన కూడా కెరియర్ ని నెట్టుకొస్తున్నాడు. ముందు ముందు సుడిగాలి సుధీర్ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి