Jabardasth Comedians : జబర్దస్త్ కంటే ముందు హైపర్ ఆది.. నూకరాజు ఇంతలా కష్టపడ్డారా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Jabardasth Comedians : నవ్వించే ప్రతి ఒక్కరి లైఫ్ హ్యాప్పీగా ఉంటుందని చెప్పలేము. ప్రస్తుతం నవ్వుతున్నారంటే ఆ నవ్వు వెనక ఎన్నో కష్టాలను చూసి ఉంటారు. ఇక నటీనటులు కూడా ఎన్నో సందర్భాల్లో తమకు గుర్తింపు రాకముందుకు అవకావాలు లేనప్పుడు తమ లైఫ్ ఎలా ఉండేదో చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. ఎంతో మంది పస్తులుంటూ అవకాశాల కోసం స్టూడియోల వెంబడి తిరిగారు. ఒకే రూమ్ లో ఉంటూ ఒకే పూట తిని కష్టపడి పైకి వచ్చిన నటీనటులూ ఉన్నారు. అయితే బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న జబర్దస్ట్ కామెడీ షో ద్వారా ఎంతో మందికి మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ఈ ఫేమ్ తో సినిమాల్లో ఇతర షోలలో నటిస్తున్నారు. అయితే ఈ షోకి రాకముందు వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు.. గుర్తింపు తెచ్చుకోవడానికి పడిన కష్టాలు ఓ షో ద్వారా చెప్పుకొచ్చారు.

hyper aadi comments on cameras in ammamma gari ooru promo
వారు ఎవరు.. ఏ పరిస్థితుల్లో ఇండస్ట్రీకి వచ్చారు.. అవకాశాలు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం…అయితే హైపర్ ఆది ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బుల్లితెర, సినిమాల్లో అవకావాలతో బిజీగా ఉన్నాడు. కానీ.. గతం చూసుకున్నట్లైతే.. బీటెక్ పూర్తి చేసిన హైపర్ ఆది సాఫ్ట్ వేర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయి చివరికి జాబ్ చేయగలిగాడు. కానీ నటనపై ఆసక్తితో జాబ్ మానేసి ఆ తర్వాత జబర్దస్త్ లో అదిరే అభి టీమ్ కి స్క్రిప్ట్ అందించాడు. దాని తర్వాత అదే టీమ్ లో చేరి టైమింగ్ పంచులతో టీమ్ లీడర్ స్ఠాయికి ఎదిగాడు. ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ తోపాటు పలు సినిమాల్లో, షోలలో చేస్తున్నాడు. అలాగే మరో నటుడు అలాగే నూకరాజు.. వెటకారం పంచులతో తనదైన స్టైల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Jabardasth Comedians Was Hyper Aadi Nookaraju so hard before Jabardasth
Jabardasth Comedians : రూమ్ అద్దె కట్టడానికి తాపీ పనికి..
అయితే నూకరాజు పేరెంట్స్ కూలీ పని చేసి మరీ అతన్ని చదివించారు. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగం వస్తే దాని వదులుకుని హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే తన జోక్స్ తో ఫ్రెండ్స్ ని నవ్వించేవాడు.. వాళ్లు కూడా ఎంకరేజ్ చేసి సినిమాల్లో ట్రై చేయమని చెప్పడంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి నగరానికి వచ్చాడు. వెంటనే అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తెచ్చుకున్న మనీ ఖర్చై పోయి ఏం చేయాలో తోచలేదు. రూమ్ రెంట్ కట్టడానికి కుడా మనీ లేక తాపీ పనికి వెళ్లాడు. పది అంతస్తుల బిల్డింగ్‌కి ఇసుక, సిమెంట్, ఇటుకలు భుజంపై మోసుకుని వెళ్లే వాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇలా ఎంతో మంది నిజ జీవితంలో కష్టపడి పైకొచ్చి ప్రస్తుతం ఆర్థికంగా కాస్తా కుదుటపడి సెటిలయ్యారు.