Jabardasth Naresh : రెచ్చిపోతోన్న పూర్ణ.. స్టేజ్ మీదే జబర్దస్త్ నరేష్ రొమాన్స్
Jabardasth Naresh : బుల్లితెరపై పూర్ణ చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ఓవర్ యాక్షన్‌కు నెటిజన్లకు చిర్రెత్తుకొస్తుంటుంది. ఢీ షోలో అందరి బుగ్గలు కొరకడం, ముద్దులు పెట్టడం చేసి నానా రచ్చ క్రియేట్ చేసింది. మొత్తానికి పూర్ణ ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కూడా కనిపించనుందేమో. తాజాగా వదిలిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఇంద్రజతో పాటుగా పూర్ణ కూడా కనిపించింది. మనో ఏదైనా షూటింగ్‌లో బిజీగా ఉండటం మూలనా ఆ స్థానంలో పూర్ణ వచ్చినట్టుందని కొంత మంది అనుకుంటున్నారు.అయితే అలా వచ్చిన పూర్ణ ఇలా రొమాంటిక్ ట్రాక్‌తో రెచ్చిపోతోంది.
పొట్టి నరేష్ చేసే అతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందరితో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ మధ్య షబీనాతో అయితే నానా హంగామా చేశాడు. ప్రేమలో ఉన్నట్టు ఫీలయ్యాడు. నరేష్ ఇప్పుడు పూర్ణతో ట్రాక్ నడిపించేందుకు ఏకంగా ఓ సపరేట్ స్కిట్టే వేసేశాడు. ఇందులో పూర్ణ, నరేష్ రొమాంటిక్ పోస్టర్లను చూపించాడు. రాధే శ్యామ్, బాహుబలి గ్రాఫిక్స్ పోస్టర్లతో తెరపై అందరినీ ఆశ్చర్యపరిచాడు.రాధే శ్యామ్ ట్రైన్ పోస్టర్లో పూర్ణ, నరేష్ కనిపించారు. దీంతో రష్మీ సెటైర్ వేసింది. నువ్ పూర్ణ బరువు మోస్తావా? అంటే.. హా మోసేస్తా అని నరేష్ రెచ్చిపోతాడు.

Jabardasth Naresh Romance With Poorna In Extra Jabardasth
ఇక మరో పోస్టర్‌లో అనుష్క, ప్రభాస్ స్థానంలో పూర్ణ, నరేష్ కనిపిస్తారు. పూర్ణ బలి అంటూ నరేష్ కౌంటర్లు వేశాడు. ఇక ఇదంతా చూసిన పూర్ణ తెగ నవ్వుకుంది. చివరకు తన బాయ్ ఫ్రెండ్ (నరేష్)తో ఓ డ్యాన్స్ స్టెప్ వేయాలనుందంటూ స్టేజ్ దిగి వచ్చింది. నరేష్‌తో కలిసి పూర్ణ రొమాంటిక్ స్టెప్పులు వేసింది. ఇక నరేష్ కూడా ఏ మాత్రం తగ్గలేదు.పూర్ణను హగ్ చేసుకోవడం, బుగ్గ గిల్లడం వంటివి చేశాడు నరేష్. ఇక పూర్ణ సైతం నరేష్ బుగ్గను కొరికేందుకు దగ్గరగా వచ్చింది. మొత్తానికి వీళ్లు చేసిన అతి మాత్రం మామూలుగా లేదని జనాలు అనుకుంటున్నారు. కానీ పూర్ణ అందాన్ని మాత్రం అందరూ పొగిడేస్తున్నారు.