Jabardasth Rakesh : సూది పొడిపించుకునేందుకు భయపడే రాకేష్.. సుజాత కోసం ఆ పని చేసేశాడే

Authored By aruna | The Telugu News | Published on: August 11, 2023, 3:00 pm

Jabardasth Rakesh : బుల్లితెరపై ఓ రీల్ జంట రియల్ జంటగా మారింది. జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో జంటలు వచ్చాయి.. వెళ్లాయి.. ఇంకా ఎన్నో జంటలు రహస్య బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ జబర్దస్త్ స్టేజ్ మీద రాకేష్, సుజాత రీల్‌ నుంచి రియల్ జంటగా మారిపోయారు. ఎన్నో స్కిట్లలో కలిసి కనిపించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. మొదట్లో రాకేష్ రోహిణి కాంబోకి మంచి డిమాండ్ వచ్చింది. కానీ సుజాత రాకతో అంతా మారిపోయింది. సుజాత రాకేష్ కొద్ది కాలంలోనే ఒక్కటయ్యారు.

వీరిద్దరి మీద రకరకాల రూమర్లు వచ్చాయి. సుజాత ఎప్పుడూ రాకేష్ ఇంట్లోనే కనిపించేది. రాకేష్ ఇంట్లో ఏ పండుగ జరిగినా కూడా సుజాత కనిపించేది. దీంతో వీరిద్దరి ప్రేమ కథ మీద లెక్కలేనన్ని రూమర్లు వచ్చేవి. వాటికి తగ్గట్టే వీరిద్దరూ కూడా స్కిట్లు చేసేవారు. మొత్తానికి బుల్లితెర పెద్దల సమక్షం, కుటుంబ పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హాయిగా ఇద్దరూ కలిసి ఈవెంట్లు చేస్తున్నారు. స్కిట్లో అదరగొట్టేస్తున్నారు.తాజాగా శ్రావణ మాసంకు సంబంధించిన ఈటీవీ ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అందులోనూ సుజాత, రాకేష్‌లు జంటగా కనిపించారు. శ్రావణ సంతోషాలు అంటూ ఈటీవీ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌ను 20వ తేదీని ప్రసారం చేయబోతోన్నారు.

jabardasth Rakesh Tattoo Fot Sujatha in Sravana Santhoshalu Latest Promo

jabardasth Rakesh Tattoo Fot Sujatha in Sravana Santhoshalu Latest Promo

ఇందులో రియల్ జంటలు, రీల్ జంటలు పాల్గొన్నాయి. ఈ ఈవెంట్‌లోనే రాకేష్ ఓ సాహసం చేసుకున్నాడు. సుజాత పేరుని టాటూగా వేయించుకున్నట్టుగా ఉన్నాడు. ఇక టాటూని పొడుస్తూ ఉంటే.. రాకేష్ కన్నీరు పెట్టేసుకున్నాడు. మామూలుగానే హాస్పిటల్‌కు వెళ్తే సూది కూడా వేయించుకోలేడు.. అలాంటి ఇంత నొప్పిని భరిస్తూ వేయించుకుంటున్నాడు అంటూ సుజాత కంటతడి పెట్టేసింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp