Rocket Raghava : అందరి ముందే కొడుకు అలా అనేశాడు.. జబర్దస్త్ రాఘవ పరువుపాయే
Rocket Raghava : జబర్దస్త్ షోలో టీమ్ లీడర్‌గా ఉన్న రాఘవ చాలా డిసెంట్‌గా ఉంటాడు. చాలా వరకు తన స్కిట్స్‌లో ఎక్కువగా బూతు పదాలు లేకుండా చూసుకుంటాడు. జబర్దస్త్ ప్రారంభమైనప్పటికీ నుంచి ఇప్పటివరకు ఒక్క వారం కూడా రాఘవ స్కిట్ లేకుండా లేదు. అది అతని కమిట్‌మెంట్. అయితే జబర్దస్త్‌తో బాగానే వెనక వేసుకన్న రాఘవ.. కొద్ది రోజుల క్రితమే తన కొడుకును అప్పుడప్పుడు స్టేజీ మీదకు తీసుకురావడం మొదలుపెట్టాడు.

jabardasth rocket raghava son murari excellent dialogue
మల్లెమాల స్పెషల్ ఈవెంట్స్‌లో, శ్రీదేవి డ్రామా కంపెనీలో పలు సందర్బాల్లో రాఘవ కొడుకు మురారి కనిపించిన సంగతి తెలిసింది. అయితే రాఘవ సైలెంట్ కాగా.. మురారి మాత్రం నాటు బాంబు. ఎందుకంటే స్టేజ్ మీద మురారి చేసే సందడి అంతా ఇంతా కాదు. ఓ షోలో జబర్దస్త్ నరేష్‌ను ఫుల్‌గా ఆడేసుకున్నాడు మురారి. ఆది స్కిట్‌లో కనినిపించి కూడా ఫుల్‌గా రెచ్చిపోయాడు. తన తండ్రి రాఘవ మీదే మురారి పంచులు వేశాడు. దీంతో అందరూ పగల బడి నవ్వేశారు.
Rocket Raghava : తండ్రి పరువు తీసిన మురారి..

jabardasth rocket raghava son murari excellent dialogue
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ.. చిల్ట్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్‌కు వచ్చిన మురారి మరోసారి ఫుల్‌గా రెచ్చిపోయాడు. రాఘవ.. అరేయ్ మురారి ఏం చేస్తున్నావురా ఇక్కడ.. ఇంటికి వెళ్లు అని అంటాడు. దానికి మురారి.. యాక్షన్‌లు అన్ని ఇక్కడ కాదు జబర్దస్త్‌లో చేయ్ అంటాడు. అందరి ముందే మురారి అలా అనడంతో.. అక్కడ ఉన్న వాళ్లంతా ఫుల్‌గా నవ్వేశారు. అంతేకాకుండా ఓ చిన్నారితో డ్యాన్స్ చేసిన మురారి.. తనకు ఇలాంటివి నచ్చవండి.. నీ కోసం చేస్తున్నా అని అంటాడు. ప్రోమోలోనే మురారి డైలాగ్‌లు ఈ విధంగా ఉంటే.. ఏపిసోడ్‌లో ఏ లెవల్‌లో ఉంటాయో అని నెటిజన్లు అనుకుంటున్నారు.
