Anchor Suma : హేయ్ సుమ అని సెట్‌లో అరిచిన జబర్దస్త్ కమెడియన్.. దెబ్బకు షాకైన యాంకర్
Anchor Suma : సుమ క్యాష్ షోలో కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి. ఎందుకంటే అందులో తెరపై కనిపించని వాళ్లను కూడా తీసుకొస్తుంటుంది. కమెడియన్స్‌నే కాకుండా వారి వారి ఫ్యామిలీ మెంబర్లను కూడా తీసుకొస్తుంటుంది. అలా వచ్చే వారం క్యాష్ ఎపిసోడ్‌లో జబర్దస్త్ కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్లను తీసుకొచ్చింది. ఆనంద్ మంజుల, సత్తిపండు నాగమాంబ, కొమరంతో పాటు అతని భార్య, శాంతి కుమార్ సుమ జంటలు వచ్చాయి. అయితే వారి వారి భార్యలతో కమెడియన్లు చేసిన సందడి మాత్రం అంతా ఇంతా కాదు. శుభలగ్నం సినిమాలో మాదిరి సుమ అందరినీ ఓ ప్రశ్న అడిగింది. వంద కోట్లు ఇస్తానంటే.. మీ భర్తను అమ్మేస్తారా? అని అందరినీ అడుగుతుంది సుమ.
సత్తి పండు భార్య ఇవ్వను అంటుంది.. కొమరం భార్య కూడా ఇవ్వనంటుంది. అయితే ఇంతలో ఆనంద్ కౌంటర్ వేస్తాడు. ఇప్పుడు ఫుల్ డిమాండ్‌లో ఉన్నాడు కదా? ఇవ్వదు.. ఒకవేళ్ల ఆరేళ్ల క్రితం అయితే ఇచ్చేసేదేమో అని అంటాడు. అవును ఆరేళ్ల క్రితమో, ఆరేళ్ల తరువాత అయితే ఇస్తుందేమో అని అంటాడు కొమరం. ఇక శాంతి కుమార్ తన భార్య సుమ మీద కౌంటర్ వేస్తాడు. ఆ ఆఫర్ కోసం వెయింటింగ్ కానీ.. ఎవ్వరూ ముందుకు రావడం లేదు అని తన భార్య మీద సెటైర్ వేస్తాడు శాంతి కుమార్. ఇక మరో రౌండ్‌లో తమ భార్యలతో సపర్యలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా కొమరం తన భార్యతో కాళ్లు పట్టించుకుంటాడు. పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా కాళ్లు పట్టలేదు..

Jabardasth Shanthi Kumar And His Wife Suma In Anchor Suma Cash Show
సుమ పుణ్యమా అంటూ ఆ చాన్స్ దొరికింది అని కొమరం హ్యాపీగా ఫీలవుతాడు. నేను కూడా చేయించుకుంటాను అని ఆనంద్ అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. ఒసేయ్ అని తన భార్యను పిలుస్తాడు. అమ్మో మళ్లీ అనంతపూర్ వెళ్లి వాళ్లింట్లో చెబుతుందేమో అని భయపడి.. తన భార్య కాళ్లను పట్టుకుంటాడు ఆనంద్. ఇక శాంతి కుమార్ రంగంలోకి దిగుతాడు. అసలు డామినేషన్ అంటే ఎలా ఉండాలో నేను చూపిస్తా అని ఏయ్ సుమ అని గట్టిగా పిలుస్తాడు. ఎవడ్రా అది అన్నట్టుగా యాంకర్ సుమ చూస్తుంది. అయ్యో మిమ్మల్ని కాదండి నా భార్య సుమను పిలిచాను అంటాడు. ఈ సెట్‌లో నన్ను అంత ధైర్యంగా పిలిచేవాడు ఎవరా అని చూస్తున్నా అని సుమ కౌంటర్ వేస్తుంది.
