Jabardasth Shanthi Swaroop : జబర్దస్త్ లో ఇంతకు ముందు చాలా కాలం పాటు కొనసాగుతున్న వారు టీమ్ లీడర్ లు గా మారుతున్నారు. కొందరు వేరే ఛానల్స్ కు వెళ్తున్నారు. కాని ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి.. అలాగే కొత్త గా టీమ్ లీడర్ గా అయ్యే పరిస్థితి లేదు. దాంతో చాలా మంది సీనియర్ కమెడియన్స్ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కమెడియన్స్ ఎంతో మంది ఉన్నారు.వారిలో లేడీ గెటప్స్ తో అలరించే శాంతి స్వరూప్ ఒకరు.
సుదీర్ఘ కాలం గా శాంతి లేడీ గెటప్ తో జబర్దస్త్ లో ఆకట్టుకుంటూ ఉన్నాడు. దాంతో ఆయనకు మంచి ఇమేజ్ దక్కింది. కాని ఆయనకు వచ్చే పారితోషికం మాత్రం షెడ్యూల్ కు కేవలం పది వేలు మాత్రమే. అదే జబర్దస్త్ లో చేసే కొందరికి పాతిక వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుందట. జబర్దస్త్ నుండి శాంతికి వచ్చే పారితోషికం చాలా చాలా తక్కువ ఉంటుందని సమాచారం అందుతోంది.అయితే శాంతి బయట ఈవెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దాంతో ఈవెంట్ లకు పాతిక వేల రూపాయల వరకు వస్తాయట. తద్వారా జబర్దస్త్ లో తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా గుర్తింపు కోసం కొనసాగుతున్నాడు.

ఇప్పుడు మల్లెమాల వారికి ఇదే అలుసుగా మారింది. చాలా మంది కమెడియన్స్ తక్కువ పారితోషికం ఇస్తున్నా మరో మార్గం లేక ఉంటున్నారు. వారు ఎలాగూ వీడి పోరు అనే ఉద్దేశ్యంతో మల్లెమాల వారు శ్రమ దోపిడి చేస్తున్నారు. ఇటీవల హైపర్ ఆది జబర్దస్త్ ను వీడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కారనం పారితోషికం అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఎంతో మంది శాంతి స్వరూప్ వంటి వారి శ్రమ దోపిడి చేస్తూ మల్లెమాల వారు రేటింగ్ దక్కించుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.