Jabardasth Shanthi Swaroop : నన్ను వాడుకుని వదిలేశాడు.. శాంతి స్వరూప్ కామెంట్స్ వైరల్
జబర్దస్త్ స్టేజ్ మీద లేడీ గెటప్‌లు బాగానే ఫేమస్. అందులోంచి కొందరు నిజంగానే అమ్మాయిలా మారిపోయారు. ఇంకొందరు మాత్రం అలానే లేడీ గెటప్పులనే కంటిన్యూ చేస్తూ వచ్చారు. మొత్తానికి శాంతి స్వరూప్ మాత్రం జబర్దస్త్ స్టేజ్ మీద లేడీ గెటప్పులతో కొనసాగుతున్నాడు. హైపర్ ఆది టీంలో పర్మనెంట్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోన్నాడు.
శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఇతర షోలు, ఈవెంట్లలోనూ శాంతి స్వరూప్ రచ్చ చేస్తున్నాడు. తాజాగా ఉగాది ఈవెంట్‌కు సంబంధించిన మూడో ప్రోమో వచ్చింది. ఇందులో శాంతి స్వరూప్ రెచ్చిపోయాడు. డాక్టర్ బాబుగా ఫేమస్ అయిన నిరుపమ్ గురించి కామెంట్లు చేశాడు. అది షో వరకే అయినా కూడా శాంతి స్వరూప్ చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు.

Jabardasth Shanthi Swaroop Satires On Nirupam Paritala In Angaranga Vaibhavanga
Jabardasth Shanthi Swaroop : రెచ్చిపోయిన శాంతి స్వరూప్
నన్ను ఇది వరకు వాడుకుని వదిలేసిన బాయ్ ఫ్రెండ్ నిరుపమ్ అని శాంతి స్వరూప్ అంటాడు. ఇక ఆది రెచ్చిపోయి పంచులు వేస్తాడు. డాక్టర్ బాబు మీరు వంటలక్కనే కాకుండా ఈ గంటలక్కని కూడా తగులుకున్నారా? అంటూ కామెడీ చేస్తాడు. ఇక శాంతి స్వరూప్ అయితే నిరుపమ్ ఒళ్లో కూర్చుంటాడు. నిరుపమ్ తలకు ముద్దు కూడా పెట్టేస్తాడు.
