Janaki Kalaganaledu 02 August 2022 Episode : జ్ఞానంబ రామని క్షమిస్తుందా.. ముత్తైదువులు జ్ఞానాంబ ను ఏం అడుగుతారు.. రామకి ఏం జరుగుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 02 August 2022 Episode : జ్ఞానంబ రామని క్షమిస్తుందా.. ముత్తైదువులు జ్ఞానాంబ ను ఏం అడుగుతారు.. రామకి ఏం జరుగుతుంది..!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,10:30 am

Janaki Kalaganaledu 02 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ జానకి కలగలేదు, ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. ఈరోజు సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. 357 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. గోవిందరాజు మల్లికను తిడుతుండగా… జ్ఞానంభ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు గోవిందరాజు నువ్వు మల్లిక కు బాధ్యత అప్ప చెప్పావు అంట కదా… తను మాకు పనులు ఎలా చేయాలో నేర్పిస్తుంది. మేము వింటున్నాం. అంతేగా అమ్మ మల్లికా అని అంటాడు. ఆ అంతే మావయ్య గారు మీరు ఏది చెప్తే అదే అని అంటుంది మల్లికా.. జ్ఞానాంబ మల్లికకు విగ్రహం ఇచ్చి దీన్ని శుద్ధి చేసుకుని తీసుకురా.. అని అంటుంది. అప్పుడు మల్లికా సరే అత్తయ్య గారు మీరు ఎలా చెప్తే అలాగే అని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రామ వ్రతానికి నైవేద్యం చేస్తూ ఉండగా తన చేతి మీద నూనె ఒలుకుతుంది. అప్పుడు అక్కడ జ్ఞానం ఉంటుంది. కానీ తన దగ్గరికి వెళ్ళదు..

రామ అమ్మ అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు. కానీ తనలో ఎటువంటి చలనం ఉండదు. అప్పుడు జానకి అక్కడికి వస్తుంది. ఏమైంది అండి అని బాధపడుతూ ఉంటుంది. పదండి మందు రాస్తా.. అని అంటుండగా… రామ నాకు వద్దండి అని అంటాడు. అదేంటి రామ గారు ఇంత నొప్పిని ఇలా భరిస్తారు. అని అంటుంది జానకి. అప్పుడు రామ ఈ నొప్పి కన్నా మా అమ్మ నా దగ్గరికి రాలేదు అన్న బాదే నా ప్రాణం పోతున్నట్లుగా ఉందండి. అని అంటాడు. అయ్యో మీరు బాధపడకండి. రండి అని జానకి ఇంట్లోకి తీసుకెళ్లి వెన్న పెడుతుంది. అదంతా చూస్తూ జ్ఞానాంబ ఏడుస్తూ ఉంటుంది. రామ మా అమ్మ నాకు చిన్నప్పుడు జ్వరం వస్తే మా అమ్మ ప్రాణాలకి తెగించి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అండి నాకు ఏమైనా అయితే తన గుండె పగిలిపోతుందండి. మా అమ్మకి నేనంటే ఎంతో ప్రేమ అలాంటిది ఆ ప్రేమ అంత ఇప్పుడు ఎటు పోయింది. జానకి గారు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జానకి ఊరుకోండి అని అంటుంది.

Janaki Kalaganaledu 02 August 2022 Full Episode

Janaki Kalaganaledu 02 August 2022 Full Episode

జ్ఞానాంబ పక్కకు వెళ్లి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ముత్తైదువులు వ్రతం కోసం వస్తారు. అందులో ఒక ఆవిడ జ్ఞానాంబ ను ఇల్లు అంత కళకళలాడిపోతుంది. నువ్వు మాత్రం చాలా బాధగా కనిపిస్తున్నావు ఏంటి.? ఏమైనా గొడవలు జరిగాయా అని అంటుంది… అప్పుడు జ్ఞానాంబ నీకు ఎప్పుడు మా ఇంట్లో గొడవలు జరగాలి అని అనుకుంటావా ఏంటి.. అలాంటిది ఏమీ లేదు కానీ పదండి వ్రతం దగ్గరికి వెళ్దాం అని వాళ్ళని తీసుకెళ్తుంది. జ్ఞానాంబ మల్లికను పిలిచి ఆ విగ్రహాన్ని పీట మీద పెట్టు అని అంటుండగా ముత్తైదులో ఒక ఆవిడ అదేంటి పెద్ద కోడలితో కదా చేయించేది మీ చిన్న కోడలితో ఎందుకు చేపిస్తున్నావు.. అని అడుగుతుంది. అప్పుడు జ్ఞానంబా పోయిన సంవత్సరం మా పెద్ద కోడలు చేసింది. ఇప్పుడు మా చిన్న కోడలు తో చేపిస్తున్నాము. అని అంటుంది. అదేంటి జ్ఞానాంబ ఇదేమైనా కూర అనుకున్నావా, అప్పుడు పెద్ద కోడలు చేసింది.

ఇప్పుడు చిన్న కోడలు చేయాలి అనడానికి. అని అంటూ గోడ వైపు చూసి మీ కోడలు కొడుకు ఫోటో అక్కడ లేదేంటి అని అడుగుతుంది. అప్పుడు జ్ఞానాంబ అది పగిలిపోయింది. ఒక్కసారి పగిలితే మళ్ళీ అతగడానికి చాలా కష్టం అవుతుంది కదా.. తీసి పక్కన పెట్టాము అని అంటుంది. అదేంటి జ్ఞానంబ అని అంటుండగా… అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మీరు వ్రతానికి వచ్చారా… ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా… అని అంటారు. అప్పుడు గోవిందరాజు మల్లికను ఆ విగ్రహం జానకి ఇచ్చేయ్ … అమ్మ జానకి నువ్వు వెళ్లి తీసుకొని ఆ పీట మీద పెట్టమ్మా అని గోవిందరాజు జానకికి చెప్తాడు. జానకి కొద్దిసేపు ఆలోచిస్తూ అలాగే ఉంటుంది. తరువాత రామ వైపు చూస్తుంది రామ వెళ్ళు అని సైగ చేస్తాడు అప్పుడు తను వెళ్లి తీసుకొని పీట మీద పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది