Janaki Kalaganaledu 03 August 2022 Episode : వ్రతం జరుగుతుండగా.. జ్ఞానంబా పక్కకి వచ్చి ఎందుకు బాధపడుతుంది.. జానకి
Janaki Kalaganaledu 03 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ జానకి కలగనలేదు సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సీరియల్ తాజాగా రిలీజ్ అయింది 358 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి మల్లిక దగ్గర నుండి విగ్రహాన్ని తీసుకొని పూజలో పెట్టి అలంకరణ చేస్తుంది. ఇంతలో అయ్యగారు జ్ఞానాంబను మీ పెద్ద కోడలు, పెద్ద కొడుకుని వచ్చి పీటల మీద కూర్చొని చెప్పండి అని అంటాడు. జ్ఞానాంబ మా చిన్న కోడలు, చిన్న కొడుకు ఈసారికి కూర్చుంటారు. మీరు పూజ చేయండి అని అంటుంది. అప్పుడు అయ్యగారు అది కాదండి.. పెద్ద కోడలు, పెద్ద కొడుకు ఉండగా వాళ్ళు ఎలా చేస్తారండి. అని అంటుండగా.. మల్లిక సాంప్రదాయాలు మనం పుట్టించుకునేవే కదా.. ఏమీ కాదులెండి అని గబగ వచ్చి విష్ణునీ తో కూర్చుంటుంది.
అయ్యవారు పూజ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ జానకి, రామ బాధపడుతూ ఉంటారు. కానీ మల్లికా సంతోషాలతో పొంగిపోతు ఉంటుంది.అయ్యవారు అందర్నీ కంకణాలు కట్టుకోమని చెప్తాడు. అందరూ కట్టుకుంటారు. తర్వాత అయ్యగారు, అమ్మవారు కోసం ఒక స్తోత్రాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు మల్లికా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు మా మల్లికకు పుల్లలు పెట్టడమే వచ్చు… పాట పాడటం రాదు అని చెప్పి జానకి నువ్వు పాడమ్మా అని అంటాడు. అప్పుడు జానకి అమ్మవారి కోసం పాటలు పాడుతుంది. జానకి పాటను అందరూ మెచ్చుకుంటారు. మల్లికా మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. పూజ ముగిస్తుంది. అయ్యగారు పూజ ముగిసింది. వాయినాలు ఇవ్వండి అని జ్ఞానాంబకు చెప్తాడు.
అప్పుడు జ్ఞానాంబ మల్లికా అందరికీ వాయినాలు ఇవ్వు అని చెప్తుంది. మల్లిక సంతోషంతో అందరికీ వాయినాలు ఇస్తుంది. కానీ జానకికి మాత్రం ఇవ్వదు. తర్వాత గోవిందరాజు అమ్మ జానకి నువ్వు కూడా వాయినాలు ఇవ్వు అని అంటాడు. అప్పుడు అందరికీ వాయినాలు ఇస్తుంది. జానకి. గోవిందరాజు అమ్మా జానకి సాంప్రదాయం ప్రకారంగా 9 వాయినాలు ఇవ్వాలి. నువ్వు మీ అత్తయ్య గారికి కూడా వాయనం ఇస్తే లెక్క సరిపోతుంది. మీ అత్తయ్య గారికి కూడా వాయినం ఇవ్వు అని అంటుండగా.. జ్ఞానంబ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.అప్పుడు గోవిందరాజు తన దగ్గరికి వెళ్లి ఏంటి జ్ఞానం అక్కడ వ్రతం జరుగుతుండగా నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు జ్ఞానంబ అక్కడ నా అవసరం అయిపోయింది అండి. అని అనగా.. గోవిందరాజు అలా అంటావేంటి జ్ఞానం జానకి దగ్గర వాయనం తీసుకుని వాళ్ళని ఆశీర్వదించాలి కదా.
అవసరం లేదు లెండి. తను వాళ్ళందరికీ ఇచ్చింది కదా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు.. అని అంటుంది. అప్పుడు గోవిందరాజు అదేంటి జ్ఞానం. నువ్వు జానకిని అమ్మలా దీవించాలి. అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది. అని అంటుండగా.. నేను ఎలా దీవించాలి వాళ్ళని చూస్తుంటే నాకు వాళ్లు చేసిన మోసమే గుర్తొస్తుంది. అప్పుడు గోవిందరాజు పెద్దమనసు చేసుకొని క్షమించు జ్ఞానం. నీ కొడుకు, కోడలు నువ్వు మాట్లాడకుండా ఉండేసరికి వాళ్లు కుమిలిపోతున్నారు. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది. వాళ్ళని ఇకనైనా క్షమించు. అని అంటాడు గోవిందరాజు. నేను ఎలా క్షమిస్తాను వాళ్లు చేసిన మోసం నన్ను లోపల కుంగిలిపోయేలా చేస్తుంది. ప్రతిక్షణం నేను దానిని అనుభవిస్తున్నాను. అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే.. రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.