Janaki Kalaganaledu 11 Nov Today Episode : జానకికి పెద్ద శిక్ష వేసిన మైరావతి.. అది నచ్చని జ్ఞానాంబ ఏం చేసింది? మైరావతితో విభేదిస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 11 Nov Today Episode : జానకికి పెద్ద శిక్ష వేసిన మైరావతి.. అది నచ్చని జ్ఞానాంబ ఏం చేసింది? మైరావతితో విభేదిస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :11 November 2021,11:03 am

Janaki Kalaganaledu 11 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 నవంబర్, 2021 గురువారం ఎపిసోడ్ 169 తాజాగా విడుదలైంది. మల్లిక పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య గారు అత్తయ్య గారు అని అరుస్తుంది. కొంపలు అంటుకుపోతున్నాయి అంటుంది. మీ పాట గౌరవం అన్నీ మట్టిపాలు అయిపోయాయి అండి అంటుంది మల్లిక. ఈ నోము అయ్యేదాక భార్యాభర్తలు ఒకే గదిలో ఉండకూడదు అని చెప్పారు కదా.. ఆ ఆచారాన్ని మీ మాటను గోదాట్లో కలిపేశారు అమ్మమ్మ గారు అంటుంది మల్లిక.

janaki kalaganaledu 11 november 2021 full episode

janaki kalaganaledu 11 november 2021 full episode

ఎవరి గురించి నువ్వు చెబుతున్నది అంటుంది మైరావతి. జానకి గురించే. జానకి బావ గారి గదిలోకి వెళ్లింది. ఇప్పటి వరకు రాలేదు.. అంటుంది. చాల్లే ఆపు అంటూ జ్ఞానాంబ మల్లికపై సీరియస్ అవుతుంది. నువ్వు ఇదివరకు పూజ చేసినప్పుడు చికెన్ తినలేదా? అంటూ జ్ఞానాంబ రివర్స్ లో అడుగుతుంది. ఏంటి.. చికెన్ తిన్నావా అని మైరావతి మల్లికపై సీరియస్ అవుతున్న సమయంలో.. అమ్మమ్మ గారు నా విషయం పక్కన పెట్టండి. ముందు జానకి సంగతి చూడండి అని చెబుతుంది మల్లిక.

దీంతో మైరావతి, జ్ఞానాంబ, మల్లిక, గోవిందరాజు.. అందరూ కలిసి రామా రూమ్ దగ్గరికి వెళ్తారు. మిమ్మల్ని ఎలాగైనా పంపిస్తాను.. మీరు ఇక్కడుండే సమస్య అవుతుందని చెప్పి ఎలాగోలా జానకిని రూమ్ నుంచి బయటికి పంపించాలని రామా ప్రయత్నిస్తాడు. దాని కోసం జానకిని స్టూల్ ఎక్కిస్తాడు. కానీ.. ఆ స్టూల్ కిందపడిపోతుంది.

దీంతో ఇద్దరూ దగ్గరవుతారు. ఇద్దరూ కలిసి మంచం మీద పడతారు. దీంతో వాళ్ల మధ్య లేనిపోని కోరికలు కలుగుతాయి. ఇంతలో మైరావతి వచ్చి డోర్ తీస్తుంది. అంతలోనే రామ.. జానకికి ముద్దు పెట్టబోతాడు. అది చూసి జ్ఞానాంబ, మైరావతి షాక్ అవుతుంది. దీంతో జానకి, రామాకు ఏం చేయాలో అర్థం కాదు.

Janaki Kalaganaledu 11 Nov Today Episode : రామా, జానకిని అడ్డంగా పట్టుకున్న మైరావతి

అమ్మమ్మ గారు అసలు జరిగింది ఏంటంటే.. అని చెప్పబోతుంది జానకి. కానీ.. మైరావతి వినదు. నోర్మూయ్ అంటుంది. ఈ నోములు అయిపోయేదాకా.. భార్యాభర్తలు ఒకే గదిలో ఉండటానికి వీలు లేదు. వేరే గదిలో ఉండాలని చెప్పాను కదా. అయినా కూడా నువ్వు ఎందుకు నీ మొగుడి రూమ్ లోకి వచ్చావు. నేనంటే లెక్కలేదా.. లేక నా ఆచారాలంటే లెక్కలేదా అంటుంది మైరావతి.

నోరెత్తావంటే బాగుండదు. ఈ ఇంటికి ఉన్న కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలంటే ఏమనుకున్నావు. ఏవైనా పూజలు, నోములు జరిపించేటప్పుడు ఈ ఇంట్లో ఎంత నిష్టగా ఉంటామో.. నీ అత్తను అడుగు. ఆచార సంప్రదాయాలకు ఈ ఇల్లు పెట్టింది పేరు. అంత పవిత్రంగా ఉన్న మా ఇంటి సంప్రదాయాలను నువ్వు మంటల్లో కలిపావు అంటుంది మైరావతి.

అమ్మమ్మ గారు మీరు అడిగే దాంట్లో అర్థం ఉంది. కానీ.. నేను మీరు అనుకున్నట్టు మీ ఆచార సంప్రదాయాలను మంటకలపలేదు అంటుంది జానకి. అవునా.. వద్దన్నా నీ మొగుడి గదికి రావడాన్ని ఏమంటారు అంటుంది మైరావతి. అవును నానమ్మా.. జానకి గారు ఇక్కడికి రావడానికి ఓ కారణం ఉంది అంటాడు రామా కూడా.

నీ భార్యను నువ్వు కూడా బాగానే వెనకేసుకొస్తున్నావురా. 6 నెలలకే ఇలా నిన్ను కొంగున కట్టేసుకుందంటే.. వామ్మో… భవిష్యత్తులో ఇంకా అందరినీ నువ్వు ఎలా కొంగున కట్టేసుకుంటావో అర్థం అవుతోంది అంటుంది మైరావతి. జానకి అసలు నిజం చెప్పినా కూడా మైరావతి వినదు.

దీంతో జానకిని శిక్షించడానికి మైరావతి తనను బయటికి తీసుకొస్తుంది. తెల్లారే వరకు ఇక్కడే ఉండాలంటే శిక్షిస్తుంది. బయటే చలిలో ఉండాలంటూ చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. రామా కూడా షాక్ అవుతాడు. అందరూ లోపలికి పదండి. నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది మైరావతి. దీంతో జానకి.. ఇంటి బయట కూర్చుంటుంది.

మరోవైపు జ్ఞానాంబ జానకి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మైరావతి వచ్చి ఏం జ్ఞానాంబ.. నీ అభిప్రాయం తెలుసుకోకుండా.. నీ కోడలును బయట నిలబెట్టానని నా మీద కోపంగా ఉందా? అంటుంది మైరావతి. లేదు అత్తయ్య గారు అంటుంది జ్ఞానాంబ. అర్థం అయింది కదా. నువ్వే కళ్లారా చూశావు కదా. అది నీ కోడలు వ్యక్తిత్వం అంటూ ఏదో ఏదో చెబుతుంది కానీ.. జ్ఞానాంబ మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోదు.

ఇక.. జానకి చేసేదేమి లేక.. చలిలోనే ఇంటి ముందు పడుకుంటుంది. ఇంట్లో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో డోర్ తీసి జానకి కోసం దుప్పటి తీసుకొని వస్తుంది జ్ఞానాంబ. రామా కూడా జానకి కోసం దుప్పటి తీసుకెళ్తాడు. ఇంతలో జ్ఞానాంబ.. జానకికి దుప్పటి కప్పడం చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది