Janaki Kalaganaledu 12 Oct Today Episode : జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోయాక రామా ఏం చేశాడు? రామా భవిష్యత్తు కోసం జ్ఞానాంబ తీసుకున్న నిర్ణయం ఏంటి?
Janaki Kalaganaledu 12 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 12 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది.. అని రామాను జానకి అడుగుతుంది. దీంతో అది కేవలం తన తమ్ముడి కోసమే జ్ఞానాంబ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రామా చెబుతాడు. ఆ తర్వాత జానకి టెన్షన్ పడుతుంది. తిరిగి ఇంటికి వెళ్తుంటారు జానకి, రామా. చదువు విషయంలో మీరు నన్ను ఏనాడూ అలా చూడలేదు. అందుకే మీరు అంటే నాకు అంత ఇష్టం.. అని తన మనసులో అనుకుంటాడు రామా.

janaki kalaganaledu 12 october 2021 full episode
ఇంతలో ఇల్లు వస్తుంది. బైక్ దిగి లోపలికి వద్దామని అనుకోగానే.. జ్ఞానాంబ ఆగండి.. అని అంటుంది. జానకి వెళ్లిపో అంటుంది జ్ఞానాంబ. అమ్మ.. ఏమైంది అని రామా అన్నా కూడా వినకుండా.. జానకి వెళ్లిపో. నా ఇంట్లో నువ్వు ఉండటానికి వీలులేదు. ఇంకొక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలులేదు.. అంటుంది జ్ఞానాంబ. రామా నువ్వు ఇటురా అంటుంది. జానకిని వదిలేసి నువ్వు ఇటురా అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా.. జానకిని వదిలేసి జ్ఞానాంబ వద్దకు వచ్చేస్తాడు.
అప్పటికే ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ బయటికి వస్తారు. వెళ్లిపో.. నా ఇంట్లో నుంచి.. నా కొడుకు జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లిపో.. అంటుంది జ్ఞానాంబ. నా కుటుంబం నీడ గానీ.. నా కొడుకు నీడ గానీ నీ మీద పడకూడదు అంటుంది జ్ఞానాంబ. ఇంతలో తన భర్త కలుగజేసుకొని ఏమైందని తనను అలా అంటున్నావు. తను ఏం తప్పు చేసింది అని అడుగుతాడు. దీంతో తను చేసింది తప్పు కాదు.. మోసం అంటుంది.జానకి చదివింది 5వ తరగతి కాదు.. డిగ్రీ.. అని జ్ఞానాంబ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. డిగ్రీ చదివిన విషయాన్ని దాచిపెట్టి మనల్ని మోసం చేశారు అని అంటుంది జ్ఞానాంబ. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది అని తన భర్త అంటే.. తన సర్టిఫికెట్లను చూపిస్తుంది జ్ఞానాంబ. దీంతో అందరూ షాక్ అవుతారు.
Janaki Kalaganaledu 12 Oct Today Episode : జానకి మార్కుల లిస్టు చూసి అందరూ షాక్
అఖిల్.. ఆ మార్కుల లిస్టు చూసి నిజమే.. ఇవి జానకి వదిన మార్కుల లిస్టే అని చెబుతాడు. వదిన.. డిగ్రీలో 95 శాతం మార్కులతో పాస్ అయింది అంటాడు అఖిల్. నాకు తెలిసి కోడలు అబద్ధం చెప్పదు.. అలాగని దీన్ని కొట్టిపారేయలేం అంటాడు. ఇంతలో మల్లిక కలగజేసుకుంటుంది. ఎందుకు మామయ్య గారు అన్నీ తెలిశాక కూడా జానకి మీద అంత పక్షపాతం చూపిస్తున్నారు అని అగ్నికి ఆజ్యం పోస్తుంది.
అత్తయ్య గారు నా చదువు గురించి మీ దగ్గర విషయం దాచినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థం అవుతుంది అంటుంది జానకి. దీంతో బాధ కాదు భయం అంటుంది జ్ఞానాంబ. తన తమ్ముడి గురించి చెబుతుంది జ్ఞానాంబ. తను ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందో కూడా చెబుతుంది.

janaki kalaganaledu 12 october 2021 full episode
అత్తయ్య గారు మీకు ఈ నిజం ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు కానీ.. మోసం చేద్దామని కాదు అంటుంది జానకి. నువ్వు అస్సలు మాట్లాడకు. నువ్వు అబద్ధాలు చెప్పినందుకు దానికి నా కొడుకు ప్రాణాన్ని పణంగా పెట్టాలా? అంటుంది జ్ఞానాంబ. అమ్మ.. జానకి గారు చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు కదా అమ్మా అంటుంది జ్ఞానాంబ. వినను.. విన్నా నమ్మను.. అంటుంది. నువ్వు మాకు ఎవ్వరికీ కనిపించనంత.. వినిపించనంత దూరం వెళ్లిపో అంటుంది జానకి. అత్తయ్య గారు అత్తయ్య గారు అంటే ఏదో చెప్పబోతుంది జానకి.
దీంతో ఏంటి ఇంకా నువ్వు చెప్పేది అని మల్లిక జానకిని తోసేస్తుంది. దీంతో జానకి కిందపడబోతుంది. వెంటనే రామా జానకిని పడిపోకుండా పట్టుకుంటాడు. ఇంతలో జ్ఞానాంబ.. రామా చేయిని పట్టుకొని లోపలికి పదా రామా అని తీసుకెళ్తుంది. దీంతో రామా.. జానకి చేయిని వదిలేసి ఇంట్లోకి వెళ్లిపోతాడు. మల్లిక.. వెంటనే తలుపులు వేసేస్తుంది. జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.