Janaki Kalaganaledu 12 Sep 2022 Episode : అఖిల్ ప్రేమ విషయాన్ని జ్ఞానాంబకి చెప్పిన జానకి… నాకు జెస్సి ప్రెగ్నెంట్ కి సంబంధం లేదు అంటున్న అఖిల్…
Janaki Kalaganaledu 12 Sep 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగడం లేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 386 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోవడంతో ఇంటికి వచ్చిన పెద్దవాళ్లు నానా మాటలు అంటూ ఉంటారు. అప్పుడు గోవిందరాజు మీరు పూజకు వచ్చారా మా ఇంట్లో ప్రశాంతతని లేకుండా చేయడానికి వచ్చారా అని వాళ్లపై రివర్స్ అయితు ఉంటాడు. అప్పుడు జ్ఞానంబ కూడా వాళ్లపై మండిపడుతూ ఉంటుంది. నా పెద్ద కోడలు నిజానికి నిలువుటద్దం తన గురించి అనవసరంగా నోరు పారేసుకోకండి అని అంటూ ఉంటుంది. ఇక జానకి జెసిని తీసుకొని జ్ఞానాంబ వాళ్ళ ముందుకి వస్తుంది. అప్పుడు ఆశ్చర్యంగా జేసీను చూస్తూ జ్ఞానాంబ నువ్వు పూజని వదిలేసి ఆ అమ్మాయిని తీసుకు రావడానికి వెళ్ళావా? ఆ అమ్మాయిని ముందు పంపించు నాకళ్ళ ముందు కనిపించవద్దు.. అని అంటూ ఉంటుంది.
అప్పుడు జానకి అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. అవన్నీ తర్వాత ముందు పూజ కానివ్వు అని అంటుంది. అప్పుడు అది కాదు అత్తయ్య గారు ఈ అమ్మాయి గురించి మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు సరే చెప్పు అని అంటుంది. అప్పుడు ఇక్కడ చెప్పేదికాదు ఇంట్లోకి వెళ్లి మాట్లాడదాము అని అనగానే సరే మాట్లాడదాం కాని ముందు పూజ కానివ్వు. అందరి వెళ్లిపోయిన తర్వాత మాట్లాడదాం అని అంటుంది. అప్పుడు జానకి సరే అని పూజలో కూర్చొని పూజ అంతా కంప్లీట్ చేస్తూ.. జెసి గురించి మొక్కుతూ ఉంటుంది. ఇక మల్లిక ఈ అమ్మాయి ఎవరు అని ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పూజ కంప్లీట్ అవుతుంది. జ్ఞానాంబ, జానకి చేత పుస్తకాలు పిల్లలకి ఇప్పిస్తుంది. ఇక పూజ అవ్వడంతో అందరూ ఇంటికి వెళ్లి పోతారు. ఇక జ్ఞానాంబ ఏదో మాట్లాడాలి అన్నావు కదా రా అని పిలవగానే జెసి ని తీసుకొని వస్తూ ఉండగా జానకి. అప్పుడు జ్ఞానాంబ ఏదో చాటుగా మాట్లాడాలి అని మళ్లీ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నావ్ నువ్వు మాత్రమే రా అని అనగానే అప్పుడు జానకి వెళ్లితుండగా..
మల్లిక చాటుగా వినడానికి వెళ్తుంది. ఇక అప్పుడు చెప్పు జానకి అనగానే అప్పుడు జానకి నేను పూజ కార్యక్రమాన్ని వదిలేసి వెళ్ళింది.. ఆ అమ్మాయి కోసమే ఆ అమ్మాయి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అత్తయ్య గారు. నేను ఎన్నిసార్లు విషయం చెప్పాలని చాలా ట్రై చేశాను. కానీ అఖిల్ మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నాకు అడ్డం వచ్చేలా చేసేయ్.. నేను రామతో కూడా చెప్పించాలని చూశాను అలా కూడా చెప్పలేకపోయాను అని అంటుంది. అప్పుడు ఇన్ని రోజులు ట్రై చేసావు సరే ఇప్పుడు చెప్పు అనగానే.. ఆ అమ్మాయి, అఖిల్ గాఢంగా ప్రేమించుకున్నారు. అని అనగానే జ్ఞానంభ, కుటుంబం మొత్తం ఆశ్చర్యానికి గురై చూస్తూ.. జ్ఞానం బా అఖిల్ పిలిచి ఏంటి అఖిల్ వదిన చెప్పేది నిజమేనా అని అనగానే అదంతా ఉట్టిదే అమ్మ ఎందుకు వదిన నా మీద కక్ష కట్టారు.. అని కట్టు కథలు చెబుతూ ఉంటాడు.
ఇక జానకి ఎందుకు అఖిల్ అలా చెప్తున్నావు నీవల్ల కడుపుతో ఉన్న అమ్మాయి అన్యాయం అయిపోతుంది అనగానే.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానం నా మీద ఒట్టేసి చెప్పు అనగానే అఖిల్ ఒట్టు వేసి కూడా అబద్ధమే చెప్తాడు. అప్పుడు జానకి ఈరోజు అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెపుతున్నావు, జెసిని మోసం చేస్తున్నావ్ నా దగ్గర ఫోటోలో ఉన్నాయి అని తీసుకు రావడానికి వెళ్తూ ఉండగా.. అవసరంలేదు వదిన జెస్సి గుట్టంతా నా ఫోన్లో కూడా ఉంది. అని జెసి వేరే వాళ్ళతో క్లోజ్ గా అన్న ఫొటోస్ ని అందరికీ చూపిస్తాడు. అప్పుడు జ్ఞానాంబ నా కొడుకు నన్ను ఎప్పుడు మోసం చేయడు. తను నా కొంగు చాటు బిడ్డ అంటూ అఖిల్ పొగుడుతూ.. జెసి గురించి నాకు ఆనాడు తెలుసు అంటూ జెస్సిని తిడుతూ ఉంటుంది. జ్ఞానంబ ఇక జానకి భయపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లు చూడాల్సింది…