Janaki Kalaganaledu 15 Sep Today Episode : జానకి చదువుకున్న విషయం తెలుసుకొని జ్ఞానాంబకు చెప్పిన వైజయంతి.. జానకి చదువు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ.. జానకికి ఏ శిక్ష విధించింది?

0
Advertisement

Janaki Kalaganaledu 15 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 15 సెప్టెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ 128 హైలైట్స్ ఏంటో చూద్దాం. వైజయంతి.. తన కూతురు గ్రాడ్యుయేషన్ ఫోటోలను  చూస్తుంటుంది. తన కూతురు అప్పుడే బయటికి వెళ్తుంది. ఇంతలో జానకి.. వినాయక చవితి పూజ కోసం ఇంటికి పిలవడానికి జానకి.. వైజయంతి ఇంటికి వస్తుంది. ఇంతలో తను ఆ ఫోటోలను చూస్తుంది.  వినాయక చవితి పూజ కోసం రావాలంటూ అత్తయ్య గారు పిలిచారు.. అని చెబుతుంది. మీ ఇంటికి వద్దామనే బయలు దేరాను.. అని చెబుతుంది వైజయంతి. మంచినీళ్లు తెస్తాను.. ముందు కూర్చో.. అని చెప్పి వెళ్తుంది.

Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights
Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights

ఇంతలో జానకి.. టేబుల్ మీద పెట్టి ఉన్న ఫోటోను చూస్తుంది. అక్కడ తన ఫోటో కూడా కనిపిస్తుంది. దీంతో ఆ ఫోటోను తీసి చూస్తుంది. షాక్ అవుతుంది. తన ఫోటోను చూసి.. నా ఫోటోను వైజయంతి గారు చూశారా.. అని అనుకుంటుంది. ఇంతలో జానకి.. అంటూ వైజయంతి పిలుస్తుంది. దీంతో షాక్ అవుతుంది జానకి. ఏంటమ్మాయి కూర్చోకుండా నిలబడి ఉన్నావు..  అంటుంది. ఏం లేదండి అంటుంది. మంచినీళ్లు తాగు.. అంటుంది. ఎందుకు ఈ అమ్మాయి ఇంతలా కంగారు పడుతోంది అని అనుకుంటుంది. జానకి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు.. అంటే ఏం లేదండి.. మామూలుగానే ఉన్నాను.. అంటుంది. వెళ్లొస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది.

Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights
Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights

Janaki Kalaganaledu 15 Sep Today Episode : జానకి చదువుకున్న విషయం ఫోటో చూసి తెలుసుకున్న వైజయంతి

ఆవిడ నా ఫోటో చూసి కూడా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు ఏంటి. ఈ విషయాన్ని డైరెక్ట్ గా అత్తయ్య గారితో మాట్లాడుతారా? అని అనుకుంటుంది. మళ్లీ ఆ ఫోటోలను తీసి చూస్తుంటుంది. ఇంతలో అప్పుడు జానకి ఫోటోను చూస్తుంది. ముందు కాదు కానీ..  తర్వాత ఆ ఫోటోను చూసి షాక్ అవుతుంది. జానకిలా ఉండటం ఏంటి.. జానకినే అని అనుకుంటుంది. పెద్ద కోడలు పెద్దగా చదువుకోలేదని జ్ఞానాంబ ఆరోజు చెప్పింది కదా.. మరి జానకి డిగ్రీ పట్టా తీసుకోవడం ఏంటి.. అని అనుకుంటుంది వైజయంతి.

జానకి సడెన్ గా టెన్షన్ పడటానికి కారణం.. ఈ ఫోటో అన్నమాట. తన అత్తయ్య దగ్గర జానకి తన చదువు విషయం గురించి అబద్ధం చెప్పిందన్నమాట. ఇప్పుడు ఎలాగూ జ్ఞానాంబ ఇంటికి వెళ్తున్నాను కదా. కోడలి చదువు వెనుక ఉన్న బండారాన్ని బయటపెడతాను.. అని అనుకుంటుంది వైజయంతి.

 

Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights
Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights

ఇంతలో జానకి ఇంటికి వచ్చి.. ముభావంగా ఉంటుంది. ఎవ్వరితో సరిగ్గా మాట్లాడదు. తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. తనను చూసిన రామా.. ఏమైంది అని అడుగుతాడు రామా. దీంతో వైజయంతి ఇంటికి వెళ్లిన విషయాన్ని చెబుతుంది. తను ఫోటోలో చూసి ఉంటారు. తను నాతో ఏం మాట్లాడలేదు. అత్తయ్య గారికి ఈ విషయం డైరెక్ట్ గా చెబుతారేమో.. అని అంటుంది. నేను వాళ్ల ఇంటికి వెళ్లి తనను రాకుండా ఆపుతాను.. అని రామా అనేసరికి.. వద్దండి.. వద్దు.. అంటుంది. ఇంతలోనే వైజయంతి జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. వైజయంతిని చూసి జానకి, రామా షాక్ అవుతారు. బాగున్నావా.. అని జ్ఞానాంబతో మాట్లాడుతుంది వైజయంతి. దీంతో జానకి భయపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అండి.. అని రామాను అడుగుతుంది. అత్తయ్య గారికి ఇప్పుడెలా సంజాయిషీ చెప్పుకోవాలి.. మీ అమ్మ గారు నిన్ను కూడా ధ్వేషిస్తే.. మీరు అందరి ముందు తల దించుకుంటే.. నేను చూసి తట్టుకోలేను. నా కారణంగా మీ గొప్ప తల్లికొడుకుల మధ్య అనుబంధం దూరం అయితే అంతకంటే బాధ నాకు ఇంకోటి ఉండదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.. అంటుంది జానకి.

 

Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights
Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights

జానకి గారు.. పూజకు సమయం అవుతోంది.. రెడీ అవ్వండి.. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అమ్మకు తెలుస్తుంది. అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో మనం ముందే ఊహించాం. ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. అని జానకికి చెబుతుండగానే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఓవైపు పూజ మొదలవబోతుంటే.. మీరేంటి ఇంకా రెడీ కాకుండా ఉన్నారు. అంత టెన్షన్ గా ఉన్నారు ఏంటి.. అని అడుగుతుంది జ్ఞానాంబ. అవును రామా.. ఇందాకేంటి.. దేవుడి మీద భారం వేసి అంటున్నావు.. ఏమైంది అని అడుగుతుంది జ్ఞానాంబ. అదేం లేదమ్మా.. పూజ బాగా జరగాలని దేవుడి మీద భారం వేద్దాం అన్నా.. అంతే అంటాడు రామా.

Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights
Janaki kalaganaledu 15 september 2021 wednesday 128 episode highlights

ఇంతలో పూజ మొదలవుతుంది. అందరూ భక్తిశ్రద్ధలతో పూజ చేస్తుంటారు. వైజయంతి రామా, జానకినే తదేకంగా చూస్తుంటుంది. మల్లిక కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. పూజ తర్వాత మీ పెద్ద కోడలు రావడంతో మీ ఇంటికి కొత్త కళ వచ్చింది.. అని జ్ఞానాంబతో అంటుంది. అవును.. వైజయంతి.. అందరూ ఇదే మాట అంటారు. సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఇంట్లో అడుగు పెట్టింది అంటారు.. అని అంటుంది జ్ఞానాంబ. మీ పెద్ద కోడలు లక్ష్మీ దేవి కాదు జ్ఞానాంబ.. నిలువెత్తు సరస్వతీ దేవి.. అంటుంది. ఇంతలో సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.

 

 

Advertisement