Janaki Kalaganaledu 16 Dec Today Episode : ఎవరినో లవ్ చేసి జ్ఞానాంబకు షాక్ ఇచ్చిన వెన్నెల.. మరోవైపు కేకు తయారు చేసి మల్లిక షాక్ అయ్యేలా చేసిన జానకి
Janaki Kalaganaledu 16 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 194 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేకు పోటీలు ప్రారంభం అవుతాయి. ఇంతలో అనౌన్స్ చేస్తాడు. కార్పొరేటర్ సునంద కూడా వస్తున్నట్టు చెబుతారు. మరోవైపు కార్పొరేటర్ సునంద, తన కొడుకు ఇద్దరూ కారులో వస్తుంటారు. మరోవైపు వెన్నెల ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక యువకుడు బైక్ మీద వస్తాడు. ఏంటి దిలీప్.. ఇంత లేటు.. ఎంత సేపు వెయిట్ చేయాలి అంటాడు. దీంతో సారీ వెన్నెల అంటాడు దిలీప్. నువ్వు ఇలా నాకు సారీ చెబుతూ కూర్చో.. ఇంతలో నాకు పెళ్లి అయిపోతుంది అంటుంది వెన్నెల. అదేంటి.. ఇంతకుముందు అసలు పెళ్లి ప్రస్తావన కూడా తీసుకురాలేదు కదా. ఇప్పుడు సడెన్ గా పెళ్లి ఏంటి అంటాడు. ఏమో నాకు తెలియదు.. అంటుంది. మరి మీ ఇంట్లో ఈ విషయం చెప్పొచ్చు కదా అంటాడు దిలీప్. వామ్మో.. అమ్మ దగ్గరికి వెళ్లి షాపింగ్ కు వెళ్తా అని చెప్పాలంటేనే దడుసుకుంటాను. పెళ్లి విషయం చెబుతానా అంటుంది.
ఇంతలో సునంద కారు అక్కడి నుంచి వెళ్తుంది. సునంద కొడుకు వెన్నెలను చూసి కారు ఆపి.. వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు. వెంటనే తన ఫోన్ లో వాళ్లిద్దరూ మాట్లాడుకునేది రికార్డు చేస్తాడు. తర్వాత కేకుల పోటీ వద్దకు వస్తారు. అక్కడ జ్ఞానాంబను చూస్తుంది సునంద. అప్పుడు తన బర్త్ డే రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది సునంద. జ్ఞానాంబ ఎలా ఉన్నావు అంటుంది. బాగున్నాను కార్పొరేటర్ గారు అంటుంది. మీరెలా ఉన్నారు అంటుంది. ఏంటి జ్ఞానాంబ నువ్వు… ఎప్పుడూ పేరు పెట్టి సునంద అని పిలుస్తుంటావు కదా.. ఇలా కార్పొరేటర్ అని పదవి పేరుతో పిలుస్తున్నావు ఏంటి అంటుంది. ఇంట్లో అయినా బయట అయినా.. 24 గంటలు మీరు కార్పొరేటర్ పదవిలోనే ఉంటారు కదా.. అందుకే అలా పిలిచాను అంటుంది. ఇంతలో పోటీలు ప్రారంభిద్దాం అంటారు.
అందరూ లైన్ లో వెళ్లి నిలుచుంటారు. సునంద దేవి గారు మీరు దగ్గరుండి పోటీలు ప్రారంభించండి అంటారు. దీంతో అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతుంది సునంద. తర్వాత స్టేజ్ మీదకు వచ్చి కూర్చుంటుంది. పోటీ మొదలవబోతుంది. వన్, టూ, థ్రీ అనగానే అందరూ కేక్ తయారు చేయడం ప్రారంభిస్తారు. జానకి ఈరోజుతో నీ పని ఫినిష్ అని అనుకుంటుంది మల్లిక.
Janaki Kalaganaledu 16 Dec Today Episode : పక్క వాళ్లు ఎలా తయారు చేస్తున్నారో చూసి కేకు తయారు చేసిన జానకి
అందరూ కేకులు చేయడం ప్రారంభించినా.. జానకి మాత్రం అలాగే చూస్తూ నిలుచుంటుంది. దీంతో జ్ఞానాంబకు భయం వేస్తుంది. ఏంటి.. జానకి ఇంకా కేకు తయారు చేయడం మొదలు పెట్టలేదు అని గోవిందరాజుతో అంటుంది జ్ఞానాంబ. అదేం కాదులే.. పోటీ కదా.. కొంచెం భయం ఉంటుందిలే జ్ఞానం అంటాడు గోవిందరాజు.
అయితే.. పక్కన వాళ్లు ఎలా కేకు తయారు చేస్తున్నారో చూసి వాళ్లలాగే జానకి కూడా కేకు తయారు చేయడం ప్రారంభిస్తుంది. జానకి కేకు తయారు చేయడం చూసి షాక్ అవుతుంది మల్లిక. ఇంతలో సునంద కొడుకు తనకు ఫోన్ చేసి.. అమ్మ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జానకి గెలవడానికి వీలులేదు.. మొన్న మనింట్లో ఆ జ్ఞానాంబ చేసిన రచ్చకు ప్రతీకారంగా తనను గెలిపించొద్దు అంటాడు. సరే నేను చూసుకుంటాను అంటుంది సునంద.
ఇంకా 20 నిమిషాలే మిగిలి ఉంది. త్వరగా ఫాస్ట్ అంటారు. లవ్ షేప్ లో కట్ చేసి.. కేకును తయారు చేస్తుంటుంది జానకి. ఇంకో 10 నిమిషాలే అంటాడు. ఇంతలో కేకు తయారు చేయడం పూర్తి చేస్తుంది జానకి. కార్పొరేటర్ సునంద, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి గారు కేకులను రుచి చూసి.. ఈ పోటీలో విజేతలెవరో తెలియజేస్తారు అంటారు.
దీంతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంది సునంద. అందరి దగ్గర కేకు టేస్ట్ చేస్తుంది. అందరికీ మార్కులు వేశాక.. స్టేజ్ మీదికి వస్తుంది సునంద. పోటీలో పాల్గొన్న వాళ్లందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు అని చెబుతుంది. అందరూ కేక్ ను చాలా అద్భుతంగా తయారు చేశారు. కానీ.. ఇది పోటీ కాబట్టి.. ఒకరు మాత్రమే గెలుస్తారు కాబట్టి.. ఒకరిని మాత్రమే ఎంపిక చేశాం.
అంతమాత్రం చేత మిగితా వాళ్లు ఓడిపోయినట్టు కాదు. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా అందరూ స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఇక ఈనాటి కేకుల పోటీ విజయ ఎవరంటే.. అంటూ సస్పెన్స్ లో పెడుతుంది. అప్పటికే సీరియల్ అవుతుంది. విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే తరువాయిభాగం వరకు వెయిట్ చేయాల్సిందే.