Janaki Kalaganaledu 16 Sep Today Episode : కాసేపు జ్ఞానాంబను టెన్షన్ పెట్టిన వైజయంతి.. జానకి చదువు విషయం తెలిసి.. జానకిని వైజయంతి బ్లాక్ మెయిల్ చేస్తోందా?
Janaki Kalaganaledu 16 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 16 సెప్టెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 129 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి చదువు విషయం తెలుసుకున్న వైజయంతి.. వినాయక చవితి పూజ కోసం జ్ఞానాంబ ఇంటికి వైజయంతి వస్తుంది. వినాయక చవితి పూజలో కూర్చొంటుంది. మరోవైపు జానకి, రామా తెగ టెన్షన్ పడుతుంటారు. వైజయంతి ఎక్కడ తమ గురించి చెబుతుందోనని భయపడతారు.

Janaki Kalaganaledu 16 september 2021 thursday episode 129 highlights
ఇంతలో వెన్నెల, అఖిల్ పుస్తకాలను గణపతి ముందు పెట్టమంటూ చెబుతుంది జ్ఞానాంబ. దీంతో అఖిల్, వెన్నెల పుస్తకాలను రామా తీసుకుంటాడు. తన వెనుకే ఉన్న జానకి సివిల్స్ పుస్తకాన్ని కూడా తీసి వాళ్ల పుస్తకాలలో కలిపేస్తాడు. జానకి పుస్తకంలో కూడా ఓం రాసి వినాయకుడి ముందు పెడతాడు రామా. రామా చేసిన పని చూసి.. చాలా సంతోషిస్తుంది జానకి.

Janaki Kalaganaledu 16 september 2021 thursday episode 129 highlights
ఇక.. మల్లిక చూపు మొత్తం జానకి, రామా మీదనే ఉంటుంది. రామా చేసిన పని చూసి షాక్ అవుతుంది కానీ.. ఇప్పటికే చాలా సార్లు బుక్కయ్యా.. మళ్లీ ఎందుకు బుక్ అవడం అని అనుకుంటుంది మల్లిక. పుస్తకాలను జ్ఞానాంబకు ఇస్తాడు రామా. వాటిని వినాయకుడి ముందు జ్ఞానాంబ పెట్టేసరికి జానకి ఫుల్ ఖుషీ అవుతుంది. జై బోలో గణేశ్ మహారాజ్ కు అంటూ జ్ఞానాంబ చెబుతుంది.
వినాయక రాబోయే సంవత్సరం నుంచి నువ్వు కాపాడాలి. నా భర్తకు నా కారణంగా వాళ్ల అమ్మ దగ్గర ఎలాంటి మాటలు రాకుండా చూడు స్వామీ అంటూ వేడుకుంటుంది జానకి.
పూజ పూర్తయ్యాక.. వైజయంతికి వాయనం ఇస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అందరినీ ఆశీర్వాదం తీసుకోమ్మని కోరుతుంది జ్ఞానాంబ. ముందు జానకి, రామా వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత మల్లిక, విష్ణు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వెన్నెల, అఖిల్ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు.
Janaki Kalaganaledu 16 Sep Today Episode : జానకికి సంస్కారం ఎక్కువ, పద్ధతి ఎక్కువ అని జ్ఞానాంబకు చెప్పిన వైజయంతి
జ్ఞానాంబ మీ పెద్ద కోడలు రావడంతో మీ ఇంటికి ఒక కొత్త కళ వచ్చేసిందనుకో.. అని వైజయంతి జ్ఞానాంబతో అంటుంది. దీంతో.. అవును వైజయంతి అందరూ ఇదే మాట అంటారు. సాక్షాత్తూ లక్ష్మీ దేవి మా పెద్ద కోడలు రూపంలో మా ఇంట్లో అడుగు పెట్టింది అని. మీ పెద్ద కోడలు లక్ష్మీ దేవి కాదు జ్ఞానాంబ నిలువెత్తు సరస్వతీ దేవి.. అంటుంది వైజయంతి. దీంతో అందరూ షాక్ అవుతారు.

Janaki Kalaganaledu 16 september 2021 thursday episode 129 highlights
జ్ఞానాంబకు ఏం అర్థం కాదు. జానకి చదువు గురించి ఈవిడకు కూడా తెలిసిపోయిందన్నమాట.. అని అనుకుంటుంది మల్లిక. ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. అని అంటుంది జ్ఞానాంబ. లేదు లేదు జ్ఞానాంబ.. నీ కోడలు చదువుకుంది ఐదో తరగతి కాదు. చాలా చాలా చదువుకుంది.. అంటుంది.
ఆ రోజు మీ ఫంక్షన్ కు వచ్చినప్పుడే చెప్పాను. నా కొడుకు కంటే తక్కువ చదువుకున్న అమ్మాయినే నేను పెళ్లి చేశాను అని. అయినా కూడా మళ్లీ చదువు గురించి చెబుతున్నావేంటి అంటుంది. దీంతో నీ కోడలు చదువు గురించి నీకు తెలియదు జ్ఞానాంబ అంటుంది వైజయంతి. నాకు తెలుసు.. నీ కోడలు ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడే నాకు తెలిసింది. తను ఏం చదువుకుందో.. అని అంటుంది వైజయంతి.

Janaki Kalaganaledu 16 september 2021 thursday episode 129 highlights
తను ఏం చదువుకుంది.. అని అడుగుతుంది జ్ఞానాంబ. ఏం చదువుకుందంటే.. సంస్కారం, మర్యాద అంటుంది వైజయంతి. దీంతో జానకి కుదుటపడుతుంది. పద్ధతులు, పెద్దలంటే గౌరవం.. వీటన్నింటినీ ఏదో బడిలోకి వెళ్లి చదువుకున్నంత బాగా చదువుకుంది.. అని అంటుంది వైజయంతి. దీంతో అందరూ సంతోషపడతారు. మా పెద్దలు సంస్కారానికి, పద్ధతికి పెట్టింది పేరు.. అని అంటాడు జ్ఞానాంబ భర్త కూడా.
అందరూ భోజనాల ఏర్పాట్ల కోసం వెళ్లగానే.. వైజయంతి.. జానకి దగ్గరికి వెళ్లి నీ చదువు గురించి మీ అత్తయ్యకు చెప్పేస్తా అనుకున్నావా. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? మీ అత్తయ్య నన్ను పండక్కి పిలిచింది. సంతోషంగా పండుగ చేసుకుంటోంది. నేనొచ్చి ఏడిపించడం, గొడవ పెట్టడం ఎందుకని ఆగిపోయాను. ప్రస్తుతానికి మాత్రమే నిజం చెప్పకుండా ఆగిపోయాను. పర్మినెంట్ గా మాత్రం కాదు. నువ్వొకసారి సాయంత్రం మా ఇంటికి రా.. నీతో మాట్లాడాలి.. అంటుంది వైజయంతి.. వెళ్లొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వైజయంతి.

Janaki Kalaganaledu 16 september 2021 thursday episode 129 highlights
కట్ చేస్తే.. తెల్లారుతుంది. జానకి, రామా ఇద్దరూ తెగ టెన్షన్ పడుతుంటారు. ఎంత ఆలోచించినా ఏం అర్థం కావడం లేదండి. ఒకవేళ ఆ వైజయంతి మీతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడే మాట్లాడొచ్చు కదా. మాట్లాడటానికి మిమ్మల్ని వాళ్లింటికి రమ్మనడం ఏంటి.. అని తెగ ఆలోచిస్తుంటారు. కారణం తెలియక జానకి కూడా సతమతమవుతుంది. నేను వెళ్తాను.. ఆవిడ ఏం చెబుతుందో విని అత్తయ్యకు నా చదువు గురించి చెప్పకుండా ఉండేలా బతిమిలాడుతాను అని అంటుంది జానకి. నేను వెళ్లి మాట్లాడేసి వస్తాను.. అని రామాకు చెబుతుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? జానకి.. వైజయంతితో ఏం మాట్లాడుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.