Janaki Kalaganaledu 17 Nov Today Episode : జానకి వల్ల ఆగిపోయిన పూజ.. మైరావతి సీరియస్.. జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టేస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 17 Nov Today Episode : జానకి వల్ల ఆగిపోయిన పూజ.. మైరావతి సీరియస్.. జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టేస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :17 November 2021,11:50 am

Janaki Kalaganaledu 17 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 నవంబర్ 2021, బుధవారం 173 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయమే జానకి స్నానం చేయడానికి రెడీ అవుతుంటుంది. ఇంతలో మైరావతి వచ్చి.. నువ్వు, నా మనవడు రామయ్య కలిసి లక్ష్మి దేవికి పూజ చేయాలి. పెళ్లయిన కొత్తలో వీలు పడలేదు కాబట్టి ఇప్పుడు చేయిస్తున్నాను. నీకోసం బట్టలు తీసుకొచ్చాను. ఈ బట్టలు కట్టుకొని పూజలో కూర్చోవాలి. నా చేతితో ఇవ్వడం ఆనవాయితీ అంటుంది మైరావతి.

janaki kalaganaledu 17 november 2021 full episode

janaki kalaganaledu 17 november 2021 full episode

పూజ సరిగ్గా ఉదయం 8.30 కే మొదలవ్వాలి. ఒక్క నిమిషం అటూ ఇటూ అవ్వకూడదు. లేట్ అయిందంటే పూజే ఆపేస్తాను అంటుంది మైరావతి. దీంతో లేదు అమ్మమ్మ గారు అస్సలు ఆలస్యం అవ్వదు. ఈలోపే వచ్చేస్తాను అంటుంది జానకి. తొందరగా తయారైరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మైరావతి. మరోవైపు జ్ఞానాంబ పూజ కోసం ఏర్పాట్లు చేస్తుంటుంది. అందరూ తలో పని చేస్తూ ఉంటారు. నువ్వు నీ పెద్ద కోడలును గమనిస్తున్నావా అని జ్ఞానాంబను అడుగుతుంది మైరావతి.

నీ పెద్ద కోడలు నా మీద పీకల్లోతు కోపం పెట్టేసుకుంది. లోలోపల బుసలు కొడుతోంది అంటే.. లేదు అత్తయ్య గారు జానకిలో నేను ఎప్పుడూ కోపాన్ని చూడలేదు అంటుంది. అబ్బో.. నీ కోడలును బాగానే వెనకేసుకొస్తున్నావు అంటుంది మైరావతి. వెనకేసుకురావడం కాదు.. ఉన్న వాస్తవమే చెబుతున్నాను అంటుంది జ్ఞానాంబ.

జానకిలో సహనం, ఓర్పు ఎక్కువ అంటుంది. పెద్దవాళ్లు ఏం చెప్పినా.. ఏం చేసినా.. పిల్లల మంచి కోసమే అని ఆలోచించి.. అర్థం చేసుకొని నడుచుకుంటుంది. అంతే తప్ప జానకి తన మనసులో ఎలాంటి కోపాన్ని కానీ.. ధ్వేషాన్ని కానీ ఉంచుకోదు.. అని చెబుతుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 17 Nov Today Episode : జానకిని ఆకాశానికి ఎత్తిన జ్ఞానాంబ

అవునా.. నువ్వు చెప్పిన గుణగణాలు తనలో ఉన్నాయో లేదో నేను తేల్చుతాను. మన రామయ్యకు తగిన పెళ్లామో కాదో.. నీ అంతట నువ్వే తెలుసుకునేలా చేస్తాను అంటుంది మైరావతి. చికిత.. పూజకు సమయం అవుతోంది పదా అని అంటుంది మల్లిక. రెడీ అయ్యాను అండి అంటుంది.

మరోవైపు మల్లిక.. మల్లిక అని పిలుస్తుంది జానకి. జాకెట్ హుక్కులు పెట్టుకోరాదు తనకు. మల్లిక కూడా వెళ్లిపోయింది ఇప్పుడు ఎలా అని హుక్కులు పెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తుంటుంది జానకి. ఓవైపు పూజకు సమయం అవుతోంది ఏం చేయాలో జానకికి అస్సలు అర్థం కాదు.

పూజకు సమయం అవుతుంది. అందరూ వస్తారు కానీ.. జానకి ఇంకా రాదు. అందరూ వచ్చేశారా అని అడుగుతుంది. నీ భార్య ఏదిరా అని అడుగుతుంది మైరావతి. స్నానం చేస్తుంది అంటాడు. ఇదేనా నీ పెళ్లాం వ్యవహారం అంటూ చిరాకు పడుతుంది మైరావతి.

హుక్కు పట్టక.. గదిలోనే ఉండిపోతుంది జానకి. ఏం చేయాలో తనకు అర్థం కాదు. వెంటనే మల్లికకు ఫోన్ చేస్తుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది మల్లిక. దీంతో రామాకు చేస్తుంది. రామా ఫోన్ వేరే చోట ఉండటంతో ఆ ఫోన్ ను తీసుకోవడానికి వెళ్లబోతుండగా.. నేను చూస్తానులే… నువ్వు కూర్చో అంటుంది మైరావతి.

అప్పటికే సమయం మించిపోవడంతో పూజను ఆపేస్తుంది మైరావతి. జానకిని తిడుతుంది. నీవల్ల పూజ ఆగిపోయింది. నీకు సంప్రదాయాలు అంటే తెలియదు అంటూ తిట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది మైరావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది