Janaki Kalaganaledu 18 Oct Tomorrow Episode : తన తమ్ముడికి జరిగిందే రామాకు కూడా జరుగుతుందని భయపడ్డ జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుంది?
Janaki Kalaganaledu 18 Oct Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గత శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. జానకి తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. కాలేజీకి వెళ్లిన జ్ఞానాంబకు జానకి చదువు విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిసి జ్ఞానాంబ సీరియస్ గా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవ్వరితో మాట్లాడదు. మల్లిక కూడా తన సర్టిఫికెట్లను చూపించడంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు.
ఇదివరకు తన తమ్ముడి విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు నా కొడుకు విషయంలో ఇలాగే జరుగుతుంది. నా తమ్ముడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. నా తమ్ముడికి జరిగింది.. ఇంకెవరికీ జరగకూడదని నేను నాకొడుకుల కన్నా తక్కువ చదువుకున్న వాళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేశాను కానీ.. ఇప్పుడు జానకి 5వ తరగతి చదువుకోలేదు.. తను డిగ్రీ చేసింది అంటే ఏంటి అర్థం. నా కొడుకు రామా పరిస్థితి ఏంటి అని తనలో తానే ఆలోచిస్తుంది జ్ఞానాంబ.
తన పుట్టిన రోజు సందర్భంగా.. జ్ఞానాంబకు జానకి చీర కొని.. తన పుట్టిన రోజు వేడుకల సమయంలో ఆ చీర కట్టుకోవాలని చెబుతుంది జానకి. జానకి పుట్టిన రోజు వేడుకలకు అందరూ హాజరు అవుతారు కానీ.. జ్ఞానాంబ మాత్రం రాదు. దీంతో జ్ఞానాంబను పిలవడానికి అందరూ తన గది వద్దకు వెళ్తారు. ఎంత పిలిచినా జ్ఞానాంబ పలకదు. చివరకు జానకి తెచ్చిన చీరను కట్టుకొని డోర్ తీస్తుంది జ్ఞానాంబ.
జానకి పుట్టిన రోజు వేడుకల్లో కూడా జ్ఞానాంబ ముభావంగా ఉంటుంది. జానకి కేక్ తినిపించినా తినదు. అసలు.. రామచంద్రాపురం వెళ్లి వచ్చినప్పటి నుంచి జ్ఞానాంబ ఏదోలా ఉంటోందని గోవిందరాజు గ్రహిస్తాడు. అక్కడ ఏదో జరిగిందని అనుకుంటాడు. ఉదయం పూట జానకి వచ్చి గోవిందరాజుకు మంచినీళ్లు ఇస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకోవాలని సూచిస్తుంది. దీంతో గోవిందరాజు.. తనను పొగుడుతాడు.
Janaki Kalaganaledu 18 Oct Tomorrow Episode : కిచెన్ లో రామా, జానకి సరసాలు
మరోవైపు టీ చేసి తీసుకొస్తా అని గోవిందరాజుకు జానకి చెబుతుంది. ఇంతలో రామా కొట్టుకు వెళ్లబోతాడు. రామాను చూసిన గోవిందరాజు అరేయ్.. కోడలు పిల్ల టీ పెడుతోంది.. తాగి వెళ్లు అంటాడు. దీంతో సరే నాన్న అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి జానకితో కాసేపు సరదాగా గడుపుతాడు రామా.
ఆ తర్వాత జ్ఞానాంబ తన అంతరాత్మలతో మాట్లాడుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కదా. నూరేళ్ల జీవితం. అన్నింటికి మించి పెద్దకొడుకు అంటే పంచప్రాణాలు అని జ్ఞానాంబ అంతరాత్మ చెబుతుంది. భయపడటంలో కూడా అర్థం ఉంది. భయపడినట్టు జరుగుతుంది అని అనుకోవడంలో మాత్రం అర్థం లేదు. ఒకసారి సొంత తమ్ముడి విషయంలో ఎదురు దెబ్బ తగిలాక కూడా భయపడకపోతే.. జాగ్రత్త పడకపోతే అర్థం లేదు అని అంటుంది జ్ఞానాంబ. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని.. ఎప్పుడూ అలాగే జరుగుతుందా? అని జ్ఞానాంబ అంతరాత్మ అనుకుంటుంది. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.