Janaki Kalaganaledu 19 Nov Today Episode : ఫస్ట్ టైమ్ మైరావతి మాట వినకుండా పూజ జరిపించిన జ్ఞానాంబ.. కోపంతో రగిలిపోయిన మైరావతి షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 19 Nov Today Episode : ఫస్ట్ టైమ్ మైరావతి మాట వినకుండా పూజ జరిపించిన జ్ఞానాంబ.. కోపంతో రగిలిపోయిన మైరావతి షాకింగ్ నిర్ణయం

Janaki Kalaganaledu 19 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదల అయింది. ఈరోజు 19 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైరావతి.. పూజ వద్దు.. ఆపేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో జ్ఞానాంబ వెళ్లి రండి అత్తయ్య పూజ మధ్యలో ఆపితే మంచిది కాదు అంటుంది. జానకి కాలికి దెబ్బ తాకడం వల్ల సమయానికి పూజకు రాలేకపోయింది అంటుంది జ్ఞానాంబ. […]

 Authored By gatla | The Telugu News | Updated on :19 November 2021,3:20 pm

Janaki Kalaganaledu 19 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదల అయింది. ఈరోజు 19 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైరావతి.. పూజ వద్దు.. ఆపేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో జ్ఞానాంబ వెళ్లి రండి అత్తయ్య పూజ మధ్యలో ఆపితే మంచిది కాదు అంటుంది. జానకి కాలికి దెబ్బ తాకడం వల్ల సమయానికి పూజకు రాలేకపోయింది అంటుంది జ్ఞానాంబ. దీంతో రాను.. నేను అస్సలు రాను.. నేను ఒక్కసారి తీసుకున్న నిర్ణయం మారదు.. పూజకు రానంటే రాను అని ఖరాఖండిగా చెప్పేస్తుంది మైరావతి.

janaki kalaganaledu 19 november 2021 full episode

janaki kalaganaledu 19 november 2021 full episode

దీంతో.. ఈపూజ జరుగుతుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో అందరూ షాక్ అవుతారు. ఎట్టెట్టా.. ఈ మైరావతిని ఎదిరించి ఈ పూజ జరిపిస్తావా? నీ కోడలి కోసం ఈ అత్త మాటకే ఎదురుతిరుగుతున్నావా అంటుంది. దీంతో క్షమించండి అత్తయ్య గారు.. మీ మాట దాటి నేను ప్రవర్తించను. మీ నిర్ణయాన్ని దాటి నేను ఏనాడూ ముందుకు వెళ్లను అంటుంది. మరి.. పూజ జరుగుతుంది అని ఎలా అంటున్నావు అంటుంది. దీంతో ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతను నిర్వర్తించడం అంటుంది జ్ఞానాంబ. మనింట్లో జరగబోయే పూజ ఇది. పితృ దేవతలకు కూడా జరిపించే పూజ ఇది. మామయ్య గారి ఆత్మ శాంతి కోసం ఈ పూజ ఖచ్చితంగా చేయాల్సిందే.. అంటుంది.

అందుకే మీరు కూడా వచ్చి పూజలో కూర్చోండి అత్తయ్య అంటుంది మైరావతి. నన్ను క్షమించండి అని చెప్పి వెళ్లి రామా, జానకి వెళ్లి స్నానం చేసి రండి. వ్రతం ఆగినా శాపం పోతుంది.. అని చెబుతుంది జ్ఞానాంబ. అమ్మ మాటను కాదడనం అవసరమా? అంటాడు గోవిందరాజు. కానీ.. ఈ ఇంటి క్షేమం కోసం ఇది తప్పదు అండి అంటుంది జ్ఞానాంబ.

పూజ మొదలు అవుతుంది. మైరావతికి కోపం వస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన మాట కాదని పూజ చేస్తున్నారని బాధపడుతుంది. ఒరేయ్ రాముడు.. నువ్వంటే ఈ నానమ్మకు ప్రాణం. అందుకే మా ఆయన పేరు నీకెట్టా. చెప్పరా.. నువ్వైనా మీ అమ్మకు చెప్పు. ఈ నానమ్మ మాట దాటి ప్రవర్తించొద్దని చెప్పరా.. అని రామాతో అంటుంది మైరావతి.

Janaki Kalaganaledu 19 Nov Today Episode : మైరావతికి రామా సర్దిచెప్పినా వినని మైరావతి

నానమ్మ.. నువ్వన్నా.. నీ తాతయ్య అన్నా నాకు ప్రాణం. ఈ పూజ ఆగిపోతే మన ఇంటికి అరిష్టం అంట. ఈ పూజ ఆగిపోతే మనింటికి అరిష్టం అంట. నువ్వు కూడా వచ్చి పూజలో కూర్చో నానమ్మ అని అంటాడు రామా. అమ్మమ్మ గారు అంటూ జానకి కూడా ఏదో అనబోయే సరికి.. నువ్వు మాట్లాడకు అంటుంది మైరావతి.

పూజ అయిపోయాక.. మైరావతి ఆశీర్వాదం తీసుకోవాలని జానకి, రామాకు చెబుతుంది జ్ఞానాంబ. వద్దు.. నా దగ్గరికి రావద్దు. చివరకు నా కోడలు కూడా నాకు ఎదురు తిరుగుతుందని నిరూపించారు అని బాధపడుతుంది మైరావతి. మీరందరూ కలిసి నన్ను, నా నిర్ణయాన్ని అవమానించారు.. అంటుంది.

ఇంతలో జానకి వచ్చి అమ్మమ్మ గారు మీ కోపానికి కారణం నేను. మీరు నన్ను శిక్షించండి. మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను. అంతే కానీ.. అత్తయ్య, మామయ్య గారిని నిందించకండి.. అంటుంది జానకి. దీంతో నువ్వు మామూలు నటివి కాదు.. పైకి చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తావు కానీ.. నీలో చాలా ఉంది అంటుంది మైరావతి.

కట్ చేస్తే మైరావతి మామిడికాయ పచ్చడి తయారు చేసేందుకు మామిడికాయలు కోస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన జ్ఞానాంబను చూసి గోదారిని తిడుతుంది. మైరావతితో మాట్లాడేందుకు జ్ఞానాంబ వెళ్తుంది కానీ.. మైరావతి మాట్లాడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది