Janaki Kalaganaledu 19 Sep Today Episode : అఖిల్, జెస్సీ కడుపులోని బిడ్డకు జానకి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తుందా? ఈ విషయం తెలిసి అఖిల్ సూసైడ్ చేసుకుంటాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 19 Sep Today Episode : అఖిల్, జెస్సీ కడుపులోని బిడ్డకు జానకి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తుందా? ఈ విషయం తెలిసి అఖిల్ సూసైడ్ చేసుకుంటాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :19 September 2022,10:00 am

Janaki Kalaganaledu 19 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 391 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెస్సీ ప్రాణాలు తీసుకునేదాకా వెళ్లింది. మరోవైపు అఖిల్ మాత్రం నాటకాలు ఆడుతున్నాడు. ఎలా.. ఇంటి సమస్యలనే చక్కదిద్దలేకపోతే.. రేపు ఐపీఎస్ ఆఫీసర్ గా సమాజానికి ఏం ఉపయోగపడతాను అని బాధపడుతూ ఉంటుంది జానకి. ఇంతలో రామా అక్కడికి వచ్చి నీటి బిందువు అంత సమస్య కోసం మీరు ఇంతగా టెన్షన్ పడుతున్నారు అంటాడు రామా. నేను ఐపీఎస్ ఆఫీసర్ గా పనికిరానేమో అని అంటుంది జానకి. కాదు.. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆలోచించండి. ఒక కోడలుగా కాదు. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అని తనను మోటివేట్ చేస్తాడు రామా. దాని కోసం ఏం చేయాలో ఆలోచించండి అంటాడు రామా. దీంతో ఆ కోణంలో ఆలోచించడం మొదలు పెడుతుంది జానకి. ఇంతలో తనకు ఒక ఐడియా వస్తుంది. డీఎన్ ఏ టెస్ట్ చేయిస్తే అసలు విషయం బయటపడుతుంది అంటుంది జానకి. అంటే ఏంటండి అంటాడు రామా. దీంతో రక్త సంబంధం గురించి తెలియడం కోసం వాళ్ల రక్తం తీసుకొని టెస్ట్ చేస్తారు అని చెబుతుంది.

janaki kalaganaledu 19 september 2022 full episode

janaki kalaganaledu 19 september 2022 full episode

కానీ.. అఖిల్ రక్తం ఇస్తాడా అంటుంది జానకి. దీంతో నేను ఎలాగైనా అమ్మను ఒప్పించి అఖిల్ రక్తం ఇచ్చేలా చేస్తా. మీరు సిద్ధంగా ఉండండి అంటాడు రామా. మరోవైపు జ్ఞానాంబ.. జానకి గురించి గోవిందరాజుకు చెబుతుంది. నేను తన కోసం ఇంతలా తపిస్తుంటే తను మాత్రం ఎందుకు ఇలా చేస్తోంది. ఎన్నిరకాలుగా చెప్పినా మొండిపట్టుతో ఆ అమ్మాయి సమస్యను ఇంటిదాకా తీసుకొచ్చి మనందరినీ ఇబ్బంది పెడుతోంది అని అంటుంది జ్ఞానాంబ. దీంతో ఎంత సేపు జానకి నీ మాట వినకుండా మొండిగా ఉంటుందని అంటున్నావు కానీ.. తన వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అంటాడు గోవిందరాజు. పెళ్లయిన ఇన్ని రోజుల్లో జానకి ఏనాడైనా మనల్ని కాదని ఏ పని అయినా చేసిందా. ఏ విషయంలో అయినా తను బాధపడింది తప్ప మనల్ని కష్టపెట్టలేదు అని అంటాడు గోవిందరాజు. ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి అఖిల్ ఆత్మహత్య చేసుకుంటానని తలుపు వేసుకున్నాడు అత్తయ్య గారు. త్వరగా రండి అంటుంది. మరోవైపు అఖిల్ విషం బాటిల్ ను తీసుకొని తాగబోతాడు. ఇంతలో అఖిల్ తలుపు తీయి అంటారు.

దీంతో నేను బతకను. నేను చేయని తప్పుకు నన్ను దోషిగా చూస్తున్నారు. నేను బతకను అంటాడు అఖిల్. ఇంతలో రామా, జానకి కూడా వస్తారు. రేయ్ అఖిల్ తలుపు తీయరా అంటారు. కానీ.. అఖిల్ తలుపు తీయడు. ఏదైనా ఉంటే మనం బయటికొచ్చాక మాట్లాడుకుందాం అంటుంది జానకి.

దీంతో వద్దు.. నాకు ఈ జీవితం వద్దు. నేను ఏ తప్పు చేయకున్నా నన్ను అనుమానిస్తున్నారు.. అని విషం బాటిల్ ను తాగబోతాడు అఖిల్. ఇంతలో రామా డోర్ పగులగొట్టి లోపలికి వచ్చి ఆ విషం బాటిల్ ను కింద పడేస్తాడు. అందరూ అఖిల్ ను ఓదార్చుతారు.

Janaki Kalaganaledu 19 Sep Today Episode : జానకి, రామాపై నింద మోపిన అఖిల్

నీ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. నీ మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటే నువ్వేంటి ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు అని అంటుంది జ్ఞానాంబ. ఇంకేం చేస్తాడు పాపం. నేను తప్పు చేయలేదు. నాకు, జెస్సీకి సంబంధం లేదని ఒకటికి రెండు సార్లు చెప్పినా కూడా వినడం లేదు కదా అని అంటుంది  మల్లిక.

నన్ను నమ్మకుండా డీఎన్ఏ టెస్ట్ చేయించుకో అంటున్నారు. వదినకు అంటే తెలియదు కానీ.. నా అన్నయ్య కూడా ఇదే మాట మాట్లాడితే నేను ఇక ఎందుకు బతకాలి అమ్మ. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను. నా వాళ్లు నన్ను అవమానిస్తుంటే బతకడం కంటే చావే మేలు అనుకుంటున్నానమ్మా.

డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే తప్ప నేను ఎలాంటి వాడినో తెలియదు అని అన్నయ్య అంటుంటే నేను ఇక ఎందుకు బతకాలి అమ్మ అంటాడు అఖిల్. దీంతో జ్ఞానాంబకు కోపం వస్తుంది. అఖిల్ కు డీఎన్ఏ పరీక్ష చేయించాలనుకున్నావా లేదా అని జానకిని జ్ఞానాంబ అడుగుతుంది.

దీంతో అవును అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో ఇంకేం మాట్లాడకు జానకి అంటుంది జ్ఞానాంబ. నీ పోలీసు బుద్ధితో సమస్యను పరిష్కరించాలని చూస్తున్నావా? అది తట్టుకోలేకే అఖిల్ చనిపోవాలనుకున్నాడు అని అంటుంది జ్ఞానాంబ. దీంతో నేను నిజంగా అలా అనుకోలేదు అత్తయ్య గారు అంటుంది జానకి.

ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడటం కోసమే నేను అలా చేశాను అంటుంది జానకి. నిజంగా మీ మనసులో అలాంటి ఆలోచనే ఉంటే మీ తమ్ముడికి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని ఆలోచించరు. ఆ అమ్మాయికి ఇచ్చిన విలువలో జానకి నాకు కనీసం విలువ కూడా ఇవ్వలేదు.

బయటికి మాత్రమే పోలీస్ ఉద్యోగం.. ఇంట్లో కేవలం కోడలువే అని చెప్పినా కూడా నువ్వు మళ్లీ అలాగే ప్రవర్తించావు జానకి. నిన్ను ఇలాగే వదిలేస్తే ఆ తప్పులు పెరిగిపోయి అవి ఎంతటికైనా దారి తీస్తాయి.. అని అంటుంది జ్ఞానాంబ. అఖిల్ ఏదో ఆవేశపడ్డాడు జ్ఞానాంబ అని గోవిందరాజు అన్నా జ్ఞానాంబ వినదు.

ఇప్పటికే నేను ఇచ్చిన ఐదు తప్పుల్లో ఒకటి జరిగిపోయింది అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక ఖుషీ అవుతుంది. వెళ్లి గోడ మీద రాసిన ఒకటి అనే అంకె మీద గీత గీస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది