Janaki Kalaganaledu 2 June Today Episode : రామా, జానకి వంటల పోటీలకు లైన్ క్లియర్.. ఒప్పుకున్న జ్ఞానాంబ.. ఇంతలో భారీ ట్విస్ట్
Janaki Kalaganaledu 2 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 314 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబకు ఏమీ కాదు అని డాక్టర్ చెప్పడంతో రామా, జానకి కుదుటపడతారు. మరోవైపు మీకు హైదరాబాద్ వెళ్లే సమయం మించిపోతోంది. బస్సు కూడా వెళ్లిపోయి ఉంటుంది. మీరు త్వరగా ఆ పనులు చూడండి. వెళ్లి మీ అమ్మకు ప్రయాణం గురించి చెప్పండి అంటాడు గోవిందరాజు. దీంతో అమ్మను ఇలా చూస్తూ నేను వెళ్లలేను అంటాడు రామా. మీ అమ్మకు బాగానే ఉంటుంది కానీ.. చివరి దాకా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అంటాడు గోవిందరాజు. మీ అమ్మతో నేను మాట్లాడుతాను పదా.. వెళ్దాం పదా అంటాడు గోవిందరాజు.
వీళ్ల మాటలతో పోలేరమ్మను ఎలాగైనా ఒప్పిస్తారు అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు రామా, జానకి, గోవిందరాజు ముగ్గురూ జ్ఞానాంబ దగ్గరికి వెళ్తారు. తను నిద్రపోతూ ఉంటుంది. రామాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో జ్ఞానాంబ నిద్రలేస్తుంది. నీ కళ్లలో ఆ నీళ్లు ఏంటి నాన్న. నాకేం కాలేదు కదా.. నువ్వేం బాధపడకు అంటుంది జ్ఞానాంబ. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండగా అంటూ గోవిందరాజు ఏదో చెప్పబోతుండగా మల్లిక, విష్ణు వస్తారు. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండగా వీళ్ల ప్రయాణం గురించి మాట్లాడటం సబబు కాదు కానీ.. శుభమా అంటూ బయలుదేరి ఆగిపోవడం అపశకునం అవుతుంది అంటాడు గోవిందరాజు. దీంతో అవును నాన్న.. అలా ఆగిపోకూడదు. నాకేం పర్వాలేదు. మీరు బయలుదేరండి అంటుంది జ్ఞానాంబ.
దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో తన చేయి పట్టుకొని అమ్మ నన్ను క్షమించమ్మా అంటాడు రామా. దీంతో రామా అయినా నువ్వేం తప్పు చేశావు నిన్ను క్షమించడానికి అంటుంది జ్ఞానాంబ. నువ్వేమంటున్నావో నాకు ఏం అర్థం కావడం లేదు అంటుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 2 June Today Episode : రామా వెళ్లేది పెళ్లికి కాదు.. హైదరాబాద్ వంటల పోటీలకు అని చెప్పిన గోవిందరాజు
దీంతో రామా వాళ్లు వెళ్లేది వైజాగ్ కాదు.. హైదరాబాద్ వంటల పోటీలకు అని అసలు నిజం జ్ఞానాంబకు చెప్పేస్తాడు గోవిందరాజు. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. నిజానికి నేనే ఇది చెప్పాను. నీ అనుమతి లేకుండా వాళ్లు వెళ్లమని చెప్పారు.
కానీ.. నేను నా మీద ఒట్టు పెట్టుకొని వెళ్లి తీరాల్సిందే అని చెప్పాను అంటాడు గోవిందరాజు. నా బిడ్డ ఏనాడూ ఈ ఊరు దాటి వెళ్లలేదు. పైగా లోక జ్ఞానం తెలియని వాడు.. అంతమంది చదువుకున్న వాళ్ల మధ్య వాడు అవమానపడితే అంటుంది జ్ఞానాంబ.
నీ కొడుకు గురించి నీకు తెలియదా జ్ఞానం అంటాడు గోవిందరాజు. దీంతో అక్కడ వాడికి ఏదైనా అవమానం జరిగితే వాడు తట్టుకోలేడు అనే భయం కూడా ఉంది అంటుంది జ్ఞానాంబ. నీ బాధలో అర్థం ఉంది కానీ.. నీ భయంలో అర్థం లేదు. పిల్లలు పడిపోతారేమోనని ఎప్పుడూ చేయి పట్టుకొని నడిపిస్తే.. వాళ్లు జీవితాంతం నడవలేనివారు అవుతారు.. అంటాడు గోవిందరాజు.
ఓడిపోతారనే భయంతో గుమ్మం దాటనీయకపోతే.. ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటారు అని జ్ఞానాంబకు మోటివేట్ చేస్తాడు గోవిందరాజు. నేను గెలుపు ఓటముల గురించి ఆలోచించడం లేదు అంటుంది జ్ఞానాంబ. రామాను చిన్నచూపు చూసే అవమానం కంటే.. అది పెద్ద అవమానమా అంటాడు గోవిందరాజు.
నా భర్తను ఎలాగైనా గెలిపించి తీరాలని కంకణం కట్టుకున్నాను అని జానకి కూడా చెబుతుంది. మీరు భయపడినట్టు ఆయనకు ఏదైనా అవమానం జరిగితే నేను ఇంకోసారి మీ మాటను కాదనను అంటుంది జానకి. వాళ్లను ఆశీర్వదించి ఆనందంగా పంపించు అంటాడు గోవిందరాజు.
దీంతో వాళ్లను పంపించేందుకు జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ఒక తెలియని కంగారు వాడిని ఎప్పుడూ వెంటాడుతుంది. ఆ కంగారుకు కారణం.. చిన్నప్పుడు బడిలో పరుగుపోటీలో ఓ పిల్లాడు కాలు అడ్డు పెట్టడంతో కిందపడ్డాడు. ఆరోజు రాత్రి అంతా వాడు నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు అంటుంది జ్ఞానాంబ.
మరోసారి అలాగే పోటీల్లో పాల్గొన్నాడు. పోటీ మొదలవ్వగానే అంతకుముందు జరిగిన విషయం గుర్తొచ్చి భయంతో అడుగు ముందుకు వెయ్యలేకపోయాడు. కంగారుతో అక్కడే కూలబడిపోయాడు. కొన్నిరోజుల పాటు అన్నీ మరిచిపోయాడు. వాడిని అలా చూసి నా గుండె పగిలిపోయింది అంటుంది జ్ఞానాంబ.
ఇప్పుడు వెళ్తున్న పోటీల్లో కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే నేను తట్టుకొని బతకగలనా అంటుంది జ్ఞానాంబ. కానీ.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ భయాన్ని.. నా మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని దూరం చేస్తాను అని అంటుంది జానకి.
తర్వాత.. జ్ఞానాంబ దగ్గరుండి రామా, జానకిని వంటల పోటీలకు పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.