Janaki Kalaganaledu 22 Sep Today Episode : సివిల్స్ కోచింగ్ కు లక్ష ఫీజు కట్టాలని రామాకు చెప్పిన జానకి.. లక్ష ఫీజు కోసం రామా తన ఇంట్లోనే దొంగతనం చేస్తాడా?

janaki kalaganaledu 22 sep 2021 episode 133 wednesday highlights
Janaki Kalaganaledu 22 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 22 సెప్టెంబర్ 2021, బుధవారం తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడడ్ 133 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వైజయంతి కూతురు చనిపోకుండా ప్రాణాలకు తెగించి జానకి కాపాడిందని తెలుసుకున్న వైజయంతి.. జ్ఞానాంబకు అసలు విషయం చెప్పదు. తనకు ఇవ్వాల్సిన డబ్బులలో 2 లక్షలు ఇచ్చి ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తుంది.

janaki kalaganaledu 22 sep 2021 episode 133 wednesday highlights
తర్వాత కొట్టు దగ్గరికి వెళ్లిన జ్ఞానాంబ.. వైజయంతి కూతురును కాపాడినందుకు చాలా సంతోషిస్తుంది. తర్వాత వైజయంతి కూడా జానకికి ఫోన్ చేసి నా కూతురు జీవితాన్న కాపాడావు. అందుకే నీ కాపురాన్ని నిలబెట్టాను అని చెబుతుంది వైజయంతి. నువ్వు బాగుండాలమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వైజయంతి.
జానకి గారు మంచివాళ్లకు ఆ దేవుడు ఎలాగోలా మంచే చేస్తాడు అనే మాట ఇప్పుడు అక్షరాలా రుజువు అయింది రామా.. జానకికి ధైర్యం చెబుతాడు.
కట్ చేస్తే మల్లిక ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఎవరూ లేరు అని చెప్పి టాబ్లెట్లు వేసుకుంటుంది. ఇంతకీ అవి ఏ టాబ్లెట్లో తెలియదు. అయితే మల్లిక టాబ్లెట్ వేసుకుంటుండగా విష్ణు చూస్తాడు. ఏం టాబ్లెట్ ఇది అని అడిగే సరికి ఒక కట్టుకథ అల్లుతుంది మల్లిక. నాకు క్యాన్సర్ ఉంది అని చెబుతుంది. మిమ్మల్ని బాధపెట్టకూడదని ఇన్ని రోజులు చెప్పలేదండి అంటుంది మల్లిక. తర్వాత అసలు విషయం తెలుసుకున్న విష్ణు తనను తిడుతాడు.

janaki kalaganaledu 22 sep 2021 episode 133 wednesday highlights
ఇక జానకి సివిల్స్ ఫీజు ఎలా కట్టాలా అని తెగ ఆలోచిస్తుంటుంది. ఇంతలో రామా వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. రేపు కోచింగ్ సెంటర్ లో ఫీజ్ కట్టాలి అని అడుగుతుంది జానకి. ఎన్ని వేలో చెప్పండి కట్టేద్దాం అంటాడు రామా. లక్ష రూపాయలు కట్టాలి అని చెబుతుంది జానకి. దీంతో లక్ష రూపాయాలా అని షాక్ అవుతాడు రామా.
నా డిగ్రీ సర్టిఫికెట్స్ బ్యాంక్ లో షూరిటీ పెడితే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఆ లోన్ తో ఫీజు కట్టేద్దాం అని అంటుంది జానకి. మీరు ఇప్పుడు శివప్రసాద్ కూతురు కాదు.. రామా భార్య. మీరు సర్టిఫికెట్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.. అంటాడు రామా. ఎలాగోలా డబ్బులు సర్దుదాం అంటాడు. ఫీజు విషయం గురించి మరిచిపోండి. రేపు ఉదయం కల్లా డబ్బులు నేను సర్దుతాను. ఉదయం వెళ్లాలి కదా మీరు పడుకోండి అని చెప్పి జానకిని పడుకోబెడతాడు రామా.

janaki kalaganaledu 22 sep 2021 episode 133 wednesday highlights
Janaki Kalaganaledu 22 Sep Today Episode : జ్ఞానాంబ తన కోసం చేయించిన బ్రాస్ లెట్ ను తాకట్టు పెట్టనున్న రామా
తెల్లారేసరికల్లా లక్ష రూపాయలు ఎలా సమకూర్చాలని టెన్షన్ పడుతుంటాడు రామా. ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు. వెంటనే షర్ట్ వేసుకుంటాడు. బయటికి వెళ్లి ఆలోచిస్తుంటాడు. డబ్బులు ఎలా తేవాలి.. ఎవరిని తేవాలని తనలో తానే బాధపడుతుంటాడు. అంత డబ్బు అమ్మను అడిగితే ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు మళ్లీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఎవరి దగ్గరైనా అప్పు తెద్దామంటే వాళ్లు అమ్మకు చెప్పే ప్రమాదం ఉంది. కొట్టులో డబ్బులు తక్కువగా వచ్చాయని చెబితే.. బిల్లులు ఇచ్చేవాళ్లు ఎగ్గొట్టారని చెబితే.. వద్దు వద్దు.. అమ్మను మోసం చేయొద్దు.. అని అనుకుంటాడు రామా.

janaki kalaganaledu 22 sep 2021 episode 133 wednesday highlights
ప్రస్తుతానికి అదే కరెక్ట్ అనిపిస్తోంది. అంతకంటే మరో దారి కనిపించడం లేదు.. అని అనుకుంటాడు రామా. వెంటనే ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న కొన్ని నగలను తీసి చూస్తాడు. తన తల్లి తనకు చేయించిన బ్రేస్ లెట్ అది. ఆ తర్వాత ఈరోజు నుంచి జానకి గారు రాజమండ్రి వెళ్తున్నారని రామా.. ఇంట్లో వాళ్లకు చెబుతాడు. మీ ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంది అని చెబుతాడు రామా. దీంతో పక్కనే ఉన్న మల్లిక.. ఏంటి జానకి.. ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడానికి వెళ్తున్నావా.. ఏంటి అని అడుగుతుంది మల్లిక. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

janaki kalaganaledu 22 sep 2021 episode 133 wednesday highlights