Janaki Kalaganaledu 23 Nov Today Episode : జ్ఞానాంబ చెప్పకముందే.. ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన జానకి.. పిచ్చోడయిన రామా
Janaki Kalaganaledu 23 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 177 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెద్దల మాటంటే విలువ లేని ఈ పిల్ల నీ చేతిలో ఉండదు. వదిలేయ్.. కాదు వదిలించుకో అని జ్ఞానాంబకు చెబుతుంది మైరావతి. నా మనవడు అమాయకుడు. ఈ పిల్లతో వేగలేడు అంటుంది. ఈ పిల్లను ఇంట్లో పెట్టుకోవడం అంటే తెలిసి తెలిసి కొరివిని ఇంట్లో పెట్టుకున్నట్టే. వెంటనే ఈ పిల్లను వదిలించుకో. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటుంది మైరావతి.

janaki kalaganaledu 23 november 2021 tuesday episode highlights
నేను తొందరలోనే మీ ఇంటికి వస్తాను. నేను వచ్చేలోపు ఆ పిల్ల ఇంట్లో ఉండేందుకు వీలు లేదు. పంపించేయండి. విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి పంపించేయండి. నేను నా మనవడికి తగ్గ పిల్లను వెతికి పెళ్లి చేస్తా.. అని మైరావతి అంటుంది. దీంతో రామా ఏదో చెప్పబోతాడు. ఇది మైరావతి ఆన అంటుంది. నేను తొందరలోనే ఇంటికి వస్తా. నేను ఇంటికి వచ్చేసరికి.. ఈ పిల్ల ఇంట్లో ఉండకూడదు. అలా జరగకపోతే మీరెవరో.. నేనెవరో అంటుంది మైరావతి. దీంతో మైరావతికి నమస్కరించి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆశీర్వదించు అని అందరూ ఒకరి తర్వాత ఒకరు మైరావతి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు.
రామా కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు కానీ.. జానకి ఆశీర్వాదం తీసుకోబోయేసరికి.. అడ్డుకుంటుంది మైరావతి. వద్దు అంటుంది. దీంతో జానకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. అందరూ జ్ఞానాంబ నిర్ణయం కోసం వేచి చూస్తుంటారు.
కానీ జ్ఞానాంబ ఏం మాట్లాడకుండానే వెళ్లిపోతుంది. దీంతో అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లిపోతారు. రూమ్ లోకి వెళ్లాక జానకి.. రామాను పట్టుకొని ఏడుస్తుంది. మీ జీవితంలోకి నేను రావడం అదృష్టం అనుకున్నాను కానీ.. ఆ దేవుడు నాకు వరం ఇచ్చాడు తప్పా జీవితాంతం మీతో కలిసి బతికే అదృష్టం ఇవ్వలేదు.
Janaki Kalaganaledu 23 Nov Today Episode : ఇదే మన చివరి రోజు అని రామాతో చెప్పిన జానకి
అత్తయ్య గారు పెట్టిన 15 రోజుల పరీక్షలో నేను ఓడిపోయాను. మన ప్రేమ బంధానికి, పెళ్లి ప్రయాణానికి.. ఇదే మన చివరి రోజు. తెల్లారితే ఇక ఎప్పుడూ కలుసుకోలేనంత దూరం అవుతాం. ఇక శాశ్వతంగా దూరం అయిపోతాం. ఆ ఆలోచన వస్తేనే నాకు ఏడుపు వస్తోంది అంటుంది జానకి.
జానకి గారు ఒక వైపు భయం ఉంది. అలాగే బోలెడంత నమ్మకం కూడా ఉంది. మనిద్దరిది దేవుడు కలిపిన జంట. ఆయన వేసిన బంధం. అది అంత త్వరగా విడిపోదు. ఆ జానకిరాముడిలాగే.. ఈ జానకిరాములు కూడా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఎప్పటికీ దూరం అవ్వం అంటాడు రామా.
మరోవైపు జానకిని ఎప్పుడు జ్ఞానాంబ బయటికి పంపిస్తుందా అని తెగ ఆరాట పడుతుంది. జ్ఞానాంబ వినేలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది మల్లిక. మైరావతి గారు చెప్పిన ఆర్డర్ ప్రకారం మీ అమ్మ గారు ఇవాళ పంపించేస్తారు అంటూ ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది మల్లిక.
మరోవైపు తన అన్నకు ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్లమని చెబుతుంది జానకి. దీంతో తన అన్నయ్య ఇంటికి వస్తాడు. జానకిని తీసుకెళ్తున్నా అంటాడు. ఇంతలో జానకి.. బ్యాగు సర్దుకొని బయటికి వచ్చేస్తుంది. మీ అందరి జీవితాల్లో నుంచి వెళ్లిపోతున్నాను అని అందరికీ షాక్ ఇస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.