Janaki Kalaganaledu 30 Aug Monday Episode Highlights : జానకి చదువుకుందని జ్ఞానాంబ ముందు నోరుజారిన రామా.. జానకి చదువు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ ఏం చేసింది?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 28 August 2021, 1:31 pm
Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 Aug Monday Episode Highlights : స్టార్ మా లో ప్రసారం అయ్యే జానకి కలగనలేదు సీరియల్ ప్రతిరోజు ప్రసారం కాదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. శనివారం, ఆదివారం ప్రసారం కాదు. అందుకే.. సోమవారం, 30 ఆగస్టు 2021 రోజు ఎపిసోడ్ కు సంబంధించిన హైలైట్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. స్వీట్ల ఆర్డర్ ను ఎలాగైనా పూర్తి చేయాలని.. మనిషికి మూడు వేలు ఇస్తాను అని చెప్పి వేరే పని వాళ్లను రమ్మంటుంది జానకి. కానీ.. వాళ్లు టైమ్ అవుతున్నా కూడా రాకపోయేసరికి తనకు అనుమానం వస్తుంది.

Janaki Kalaganaledu 30 Aug Monday Episode Highlights : పనివాళ్లను రానీయకుండా అడ్డుకున్న మల్లిక

వాళ్లకు రాకుండా.. మల్లిక అడ్డుకుందనే విషయం ఎవ్వరికీ తెలియదు. జానకి ఇస్తానన్న మూడు వేలను.. 10 మందికి కలిపి.. ముప్పై వేల రూపాయలను మల్లిక.. వాళ్లకు ఇచ్చేసి.. పనికి రావద్దని చెప్పి.. అక్కడి నుంచి అటే ఊరికి పంపిచేస్తుంది. దీంతో.. వాళ్లు ఆ డబ్బులు తీసుకొని వెనుతిరుగుతారు.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

ఓవైపు సమయం సమీపిస్తుండటంతో…. పనివాళ్లు ఏరి.. అంటూ.. జ్ఞానాంబ.. జానకిని నిలదీస్తుంది. దీంతో జానకి కంగారు పడుతుంది. నా పరువు పోగొడుతున్నావు. 25 ఏళ్ల నుంచి ఉన్న నమ్మకాన్ని పోగొట్టావు. ఇప్పుడు సమయానికి స్వీట్లు అందించకపోతే ఎలా? అందరి ముందు నా పరువు ఏమౌతుంది. వాళ్ల ముందు నేను తలదించుకోవాలా? నేను చెబితే వినకుండా.. నేను స్వీట్లు చేస్తాను.. సమయానికి అందిస్తాను.. అన్నావు. నిన్ను నమ్మడం నా బుద్ధి తక్కువ. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.. అంటూ జ్ఞానాంబ.. జానకిని తిడుతుంది.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 Aug Monday Episode Highlights : పనివాళ్ల కోసం రంగయ్య దగ్గరికి వెళ్లిన మల్లిక

దీంతో.. జానకి చాల బాధపడి.. నేను ఇప్పుడు వస్తాను.. అత్తయ్య అని చెప్పి ఊళ్లోకి వెళ్తుంది. కానీ.. ఆ పనివాళ్ల ఇండ్లు తనకు తెలియదు. ఫోన్ చేస్తే అందరివీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించి.. అప్పుడు రంగయ్య ఇంటికి వెళ్తుంది. రంగయ్య.. నువ్వు స్వీట్ షాపులో పనిచేస్తావు కదా. మీ స్వీట్ షాపులో పనిచేసే పనివాళ్లు ఉంటే పంపించు.. స్వీట్లు చేయాలి.. అని జానకి కోరడంతో వెంటనే… 10 మంది కుర్రాళ్లను అక్కడికి పంపిస్తాడు రంగయ్య.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

దీంతో స్వీట్ల తయారీకి సంబంధించిన సమస్య పోతుంది. ఈ విషయం తెలిసి.. మల్లిక తెగ బాధపడుతుంది. 30 వేలు పెట్టినా కూడా స్వీట్ల ఆర్డర్ ను క్యాన్సిల్ చేయించలేకపోయాను అని తెగ బాధపడుతుంది మల్లిక.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 Aug Monday Episode Highlights : జానకిని చూసి మురిసిపోయిన జ్ఞానాంబ

కట్ చేస్తే జానకిని చూసి జ్ఞానాంబ మురిసిపోతుంది. నువ్వు ఈ పని చేయగలవు అని నాకు తెలుసు. కానీ.. సమయానికి స్వీట్లు అందుతాయో.. అందయో అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఇక నుంచి నాకు ఎటువంటి టెన్షన్ లేదు. నీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. నీ తెలివి తేటలతో ఈ ఇంటిని నడిపించగలవు.. అనే నమ్మకం నాకు వచ్చేసింది జానకి.. అని అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 Aug Monday Episode Highlights : జానకి చదువుకుందని జ్ఞానాంబ ముందు నోరుజారిన రామా

అక్కడే ఉన్న రామా.. అవును అమ్మ.. జానకి గారు చాలా తెలివికల వారు. తను చాలా తెలివైన వారు. ఎందుకంటే.. అంత బాగా చదువుకున్నారు కదా.. అని నోరుజారుతాడు రామా.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

దీంతో అక్కడున్నవాళ్లంతా షాక్ అవుతారు. ఏంటి.. జానకి చదువుకుందా? ఏం చదువుకుంది.. అని అడుగుతుంది అడుగుతుంది జ్ఞానాంబ. మల్లిక కూడా షాక్ అవుతుంది. అయ్యో.. ఈయన ఏంటి.. ఇలా చెప్పాడు అని జానకి కూడా షాక్ అవుతుంది.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

చెప్పు.. తను ఏం చదువుకుంది.. అని జ్ఞానాంబ అడగడంతో రామాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Janaki Kalaganaledu 30 august 2021 monday episode 116 highlights

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి