Janaki Kalaganaledu 30 Oct Today Episode : నోర్మూయ్.. మల్లికపై జానకి సీరియస్.. జానకి మాటలు విన్న జ్ఞానాంబ.. తనను ఇంట్లో నుంచి వెళ్లగొడుతుందా?
Janaki Kalaganaledu 30 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ 1 నవంబర్ 2021, సోమవారం 161 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని అప్పుడే రామా భవిష్యత్తు బాగుంటుందని మల్లిక ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది. నీలావతి కూడా అదే విషయం చెబుతుంది. దీంతో జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది సస్పెన్స్ గా మారింది.
janaki kalaganaledu 30 october 2021 full episode
మరోవైపు రామా మాత్రం కొట్టులో ఏమాత్రం దృష్టి పెట్టలేకపోతున్నాడు. సరిగ్గా కస్టమర్లతో మాట్లాడలేకపోతున్నాడు. ఓ కస్టమర్ వచ్చి రేపు 50 కిలోల పూతరేకులు కావాలి.. రేపు ఉదయం 10 గంటల వరకు కావాలి అని చెబుతాడు. అతడు చెప్పిన ప్రతి విషయానికి తల ఊపుతాడు రామా. కానీ.. అసలు పూతరేకుల తయారీ గురించే పట్టించకోడు. డెలివరీ గురించే పట్టించుకోడు. ఎప్పుడు చూసినా పరధ్యానంలో ఉంటుండటంతో కొట్టు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది.
చివరకు కన్నబాబు దగ్గర కూడా తిట్లు తింటాడు రామా. కన్నబాబు బాద్ షా అడిగిలే కాజా ఇస్తాడు రామా. దీంతో కన్నబాబు సీరియస్ అవుతాడు. పిచ్చి వేషాలు వేస్తున్నవా? నీ కొట్టు మూసుకొని వెళ్లి ఇంట్లో కూర్చో అంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కన్నబాబు.
రాత్రి ఇంటికి వచ్చి కూడా పరధ్యానంలోనే ఉంటాడు రామా. జానకి భోజనానికి పిలిచినా రాడు. మా అమ్మ నాకు మాత్రమే శిక్ష వేయలేదు.. తను కూడా వేసుకుంది అని చెబుతాడు. ఈ విషయాలు అన్నీ జ్ఞానాంబ వింటుంది. తను కూడా బాధపడుతుంది.
Janaki Kalaganaledu 30 Oct Today Episode : జానకిని వంట చేయనీయని మల్లిక
కట్ చేస్తే.. జానకి వంట చేయడానికి వస్తుంది. కానీ అప్పటికే మల్లిక వండుతూ ఉంటుంది. మల్లిక నేను వంట చేస్తాను అని జానకి చెబుతుంది. కానీ.. మల్లిక వినదు. ఈరోజు నుంచి నేనే వంట చేస్తాను. నువ్వు చేయడానికి వీలు లేదు అంటుంది మల్లిక.
janaki kalaganaledu 30 october 2021 full episode
నువ్వు చదువుకున్నావనే అహంకారాన్ని, పొగరును చూపించి బావ గారిని గ్యారెంటీగా అవమానిస్తావని.. ఆ అవమాన భారంతో కొడుకు ఏమైపోతాడో అని అత్తయ్య గారు భయపడుతున్నారు.. అంటూ మల్లిక చెప్పబోయేసరికి.. జానకి సీరియస్ అవుతుంది. మల్లిక నోర్మూయ్.. అని అంటుంది జానకి. ఆ విషయం జ్ఞానాంబ వింటుంది.
పిచ్చిగానీ పట్టిందా నీకు. ఇంత ఉదయాన్నే అలా అశుభాలు మాట్లాడుతున్నావు. పదే పదే ఇలా మాట్లాడకూడదు అనే బుద్ధి, జ్ఞానం లేవా నీకు.. అని మల్లికపై జానకి సీరియస్ అవ్వగానే.. నిన్ను అంటూ మల్లిక.. జానకిని ఏదో అనబోతుంది. అప్పుడే జ్ఞానాంబ ఇవన్నీ వినడం చూస్తుంది. వెంటనే ప్లేట్ మారుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.