Janaki Kalaganaledu 6 Jan Today Episode : వెన్నెల లవ్ మ్యాటర్ ఎలా ఇంట్లో చెప్పాలో అర్థం కాక.. జానకి ఏం చేసింది? పెళ్లి చూపులు జరగకుండా జానకి ఆపుతుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 6 January 2022, 2:00 pm

Janaki Kalaganaledu 6 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు జనవరి 6, 2022 గురువారం ఎపిసోడ్ 209 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి గారు.. చేతి మీద ముద్దు సరిపోలేదండి.. అందుకని అంటూ రామా జానకిని అంటాడు. దీంతో మీరు ముక్కుపుడక పెట్టుకొని వచ్చారనుకోండి. ముక్కు మీద ముద్దు పెడతాను అంటాడు రామా. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ముందు పదండి.. ఇంటికి. చాలా పనులు ఉన్నాయి. మీరు స్వీట్ షాపునకు వెళ్లి స్వీట్లు కూడా తీసుకురావాలి అంటుంది జానకి. దీంతో ఇద్దరూ వెంటనే బండి మీద బయలుదేరుతారు. మరోవైపు ఇంట్లో మల్లిక హడావుడి నడుస్తూనే ఉంటుంది. చికితతో డ్యాన్సులు చేయిస్తుంటుంది. జానకి వచ్చి చూసి ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతుంది జానకి. మల్లిక.. ఏంటి ఇదంతా అని అడుగుతుంది. బుద్ధుందా నీకు. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. అని అడుగుతుంది.

janaki kalaganaledu 6 january 2022 full episode

janaki kalaganaledu 6 january 2022 full episode

ఇది ఇల్లు అనుకున్నావా.. రికార్డింగ్ డ్యాన్స్ అనుకున్నావా.. అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో తప్పునంతా తన ఫ్రెండ్స్ మీద నెట్టేయబోతుంది. ఇంకోసారి.. కిట్టీ పార్టీ అంటూ ఈ ఇంటికి వచ్చావనుకో.. అస్సలు బాగోదు.. వెళ్లండి అంటూ అందరినీ పంపించేస్తుంది. అందరూ వెళ్లాక.. నువ్వేంటి.. నీ డ్రెస్ ఏంటి.. అత్తారింట్లో ఇలాగేనా ఉండేది. ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటారా.. అంటూ అడుగుతుంది జానకి. నేను వద్దన్నా కూడా నా ఫ్రెండ్సే నాతో ఈ డ్రెస్ వేయించారు అని చెబుతుంది. దీంతో కాదమ్మా.. అంతా అబద్ధం చెబుతున్నారు.. అంటూ అసలు విషయాలు మొత్తం చెబుతుంది చికిత. అత్తయ్య గారు వస్తున్నారు. వెన్నెలను చూసుకోవడానికి సాయంత్రం పెళ్లివాళ్లు వస్తున్నారు. కానీ.. నువ్వేమో ఇల్లును చెత్తకుప్పలా పెట్టావు. ఇప్పుడు అత్తయ్య గారు వస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతుంది జానకి.

జానకి ఈ విషయం గురించి నువ్వు ఏం టెన్షన్ పడకు. అత్తయ్య గారు వచ్చేలోపు చికితతో ఈ పని అంతా చేయిస్తాను.. అంటుంది. దీంతో అబ్బా.. మీరు వేసిన చెత్త నేనెందుకు శుభ్రం చేస్తాను. చేస్తే మీరే చేసుకోండి.. పెద్దమ్మ గారు వచ్చాక ఆవిడే అంతా శుభ్రం చేస్తారు అని అంటుంది చికిత.

జానకి.. ఎవరి కంట్లో ఊసు వాళ్లే తీసుకోవాలి కాబట్టి.. నేను వేసిన చెత్త నేను తీస్తాను. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం నువ్వు మరిచిపోవాలి.. అంటుంది మల్లిక. ఇదంతా మరిచిపోవాలంటే.. ముందు నువ్వు ఇల్లంతా క్లీన్ చేయాలి.. అంటుంది. నేను చేయిస్తాను అమ్మ గారు అంటుంది చికిత.

మరోవైపు డ్రెస్ మార్చుకొని వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది మల్లిక. అమ్మా.. నడుము పడిపోయిందిరా బాబు అంటుంది. ఇదిగో వెన్నెల ఇలారా..అంటుంది. మాడిపోయిన కూర, ఎండిపోయిన పేడ దేనికీ పనికిరావు అన్నట్టు మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు అని అడుగుతుంది మల్లిక.

Janaki Kalaganaledu 6 Jan Today Episode : పెళ్లి చూపులు అనగానే టెన్షన్ పడిపోయిన వెన్నెల

మీ అమ్మ  వాళ్లు నీ పెళ్లి సంబంధం గురించి వెళ్లారని ఏడుస్తున్నావా అని అంటుంది. ఇంత చిన్న విషయానికే నువ్వు ఏడుస్తుంటే.. సాయంత్రం నిన్ను చూసుకోవడానకి పెళ్లివాళ్లు వస్తున్నారు అని చెబుతుంది మల్లిక. ఏంటి వదిన నువ్వు చెప్పేది అంటూ భయపడుతుంది వెన్నెల. దీంతో నిజమే.. మీ పెద్ద వదినకు మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది అంటుంది.

దీంతో వెంటనే వెన్నెల.. జానకి దగ్గరికి వెళ్తుంది. ఏంటి వదినా.. పెళ్లి చూపులు అట కదా అంటుంది. దీంతో నువ్వేం టెన్షన్ పడకు. పెళ్లి చూపులే కదా ఇప్పుడు జరిగేది.. అని అంటుంది జానకి. ఇంతలో మల్లిక వచ్చి.. వెన్నెల పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోయాక చూసుకుంటావా అంటుంది మల్లిక వచ్చి.

మల్లిక.. తనను ఇంకా భయపెట్టకు అంటుంది జానకి. నేను చూసుకుంటాను కదా. నువ్వేం టెన్షన్ పడకు అంటుంది జానకి. వెళ్లి రెడీ అవ్వు.. అంటుంది. మరోవైపు మల్లిక.. పిచ్చిపిచ్చిగా జానకి ముందు వాగుతూ ఉంటుంది. కట్ చేస్తే.. త్వరగా రండి.. పెళ్లి వాళ్లు వచ్చే టైమ్ అయింది అని అందరినీ త్వరగా అన్ని పనులు చేయమంటుంది జ్ఞానాంబ.

పెళ్లి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది జ్ఞానాంబ. పెళ్లి వాళ్ల కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్లు వస్తారులే ఏం టెన్షన్ పడకు అంటాడు రామా. ఆడపిల్ల పెళ్లి అనేసరికి తెలియకుండానే కంగారు వస్తోంది అంటుంది జ్ఞానాంబ. అవును.. నిజమే అంటాడు గోవిందరాజు.

మరోవైపు జానకి కూడా రెడీ అవుతూ ఉంటుంది. కానీ.. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో రామా వచ్చి జానకి గారు ఏంటి ఇంకా తయారు కాలేదు అంటాడు రామా. నేను రెడీ అయ్యాను రామా గారు అంటుంది. నా దృష్టిలో తయారు అవడం అంటే.. ఈ ముక్కు పుడకను పెట్టుకోవాలి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి