Janaki Kalaganaledu 6 May Today Episode : కన్నబాబు వలలో చిక్కిన రామా.. డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని జ్ఞానాంబకు రామా గురించి చెబుతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 6 May Today Episode : కన్నబాబు వలలో చిక్కిన రామా.. డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని జ్ఞానాంబకు రామా గురించి చెబుతాడా?

Janaki Kalaganaledu 6 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 295 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కొడుకు ఎప్పుడూ ఇంతలా బాధపడలేదు. అగ్ని పర్వతం అంత దుఖాన్ని వాడు మనసులో మోస్తున్నాడు. నా కొడుకుకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం.. నువ్వు, నీ చదువు, మీ అన్నయ్య అహంకారం అని జానకికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది […]

 Authored By gatla | The Telugu News | Updated on :6 May 2022,10:30 am

Janaki Kalaganaledu 6 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 295 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కొడుకు ఎప్పుడూ ఇంతలా బాధపడలేదు. అగ్ని పర్వతం అంత దుఖాన్ని వాడు మనసులో మోస్తున్నాడు. నా కొడుకుకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం.. నువ్వు, నీ చదువు, మీ అన్నయ్య అహంకారం అని జానకికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. మరోవైపు మల్లిక, విష్ణు.. ఇద్దరూ గిన్నెలు కొనడానికి షాపునకు వెళ్తారు. ఇంతలో రామా.. ఒక ఫైనాన్స్ షాపునకు వెళ్లడం చూస్తుంది మల్లిక. ఏమండి.. మీ అన్నయ్య, మీ అన్నయ్య అటు అంటుంది. ఇంత చిన్న విషయానికే అంతలా అరవాలా అంటాడు విష్ణు.

janaki kalaganaledu 6 may 2022 full episode

janaki kalaganaledu 6 may 2022 full episode

మీ అన్నయ్య ఫైనాన్స్ షాపునకు వెళ్తున్నాడు అని చెబితే నీకు వినిపించడం లేదా అంటుంది. అయితే మాత్రం ఏంటి అంటాడు విష్ణు. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా. మనమే కాదు.. మీ అన్నయ్య కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టున్నాడు. మీ అన్నయ్యకు వడ్డీ వ్యాపారంలో వాటా ఉన్నట్టుంది అంటుంది. దీంతో మా అన్నయ్య నిజాయితీకి మారు పేరు అంటాడు. దీంతో మరి.. ఫైనాన్స్ షాపునకు వెళ్లడం ఎందుకు అంటుంది మల్లిక. మరోవైపు ఫైనాన్స్ షాపులోకి వెళ్లిన రామచంద్ర.. ఒక లక్ష రూపాయలు కావాలని అడుగుతాడు. దీంతో మీ అమ్మతో ఒక్క మాట చెప్పించండి.. ఇస్తాను అంటాడు ప్రకాశ్. దీంతో మా అమ్మతో ఎందుకు అంటాడు. సరే.. నేను సాయంత్రం వచ్చి మాట్లాడుతాను అంటాడు రామా.

ఇంతలో బయటికి వస్తాడు రామా. ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే జ్ఞానాంబ ఏదో పనిలో ఉంటుంది. ఇంటికి వచ్చిన మల్లిక ఇదే సరైన అవకాశం.. కరెక్ట్ టైమ్ కు ఈ పోలేరమ్మ సరిగ్గా కనిపించింది కదా అనుకొని.. తన ప్లాన్ ను అమలు చేస్తుంది. మనకెందుకండి.. నోర్మూసుకోండి.. పదండి అంటుంది.

అదే బావ గారికి ఏదో ముఖ్యమైన పని ఉండి అక్కడికి వెళ్లి ఉంటారు. మీ బాధ నాకు అర్థం అవుతోంది అండి. మీరు చూసిన విషయాన్ని ఒక కొడుకుగా మీ అమ్మగారికి చెప్పకుండా ఉండటం ధర్మం కాదు కానీ.. అవన్నీ డబ్బుల విషయాలు.. ఎవరి పర్సనల్స్ వాళ్లకు ఉంటాయండి అంటుంది మల్లిక.

అరె చెబితే అర్థం కాదా మీకు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయాలండి. చెప్పడం సంస్కారం కాదు.. ఇక మనం చెప్పిన విషయాలు మరిచిపోయి లోపలికి వెళ్దాం పదండి అంటూ మల్లిక వెళ్లబోతుండగా.. జ్ఞానాంబ మల్లికను పిలుస్తుంది.

రామా ఎక్కడికో వెళ్లాడంటున్నావు.. ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతుంది జ్ఞానాంబ. చిరాకు తెప్పించకుండా విషయం ఏంటో చెప్పు అంటుంది. దీంతో బావ గారు ఫైనాన్స్ షాపునకు వెళ్లారు అత్తయ్య గారు అంటుంది మల్లిక. అక్కడే ఉన్న జానకి కూడా షాక్ అవుతుంది.

ఏంటి అంటుంది జ్ఞానాంబ. బావ గారు ఫైనాన్స్ షాపులోకి వెళ్లి చాలా సేపు మాట్లాడారు. ఆయన అప్పు తీసుకుంటున్నారో లేక ఫైనాన్స్ వ్యాపారం నడిపిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. మీరు కళ్లారా చూసిన నిజాన్ని.. మీ అమ్మ గారికే చెప్పండి అంటుంది మల్లిక.

మీరు చూసిన విషయం చెప్పండి అంటుంది మల్లిక. అవును అమ్మ.. అన్నయ్య ఫైనాన్స్ షాపునకు వెళ్లాడు అని అంటాడు విష్ణు. ఇంతలో రామా వస్తాడు. రామా ఇలారా అంటుంది జ్ఞానాంబ. వాళ్లు చెప్పేది నిజమా. నువ్వు ఫైనాన్స్ కొట్టుకు వెళ్లావా అని అడుగుతుంది.

Janaki Kalaganaledu 6 May Today Episode : మల్లికకు షాకిచ్చిన జ్ఞానాంబ

దీంతో అమ్మ వెళ్లాను అంటాడు రామా. అక్కడికి ఎందుకు వెళ్లావు అంటుంది. దీంతో డబ్బుల కోసం వెళ్లావా అంటుంది. అడుగుతుంది నిన్నే అప్పు కోసం వెళ్లావా అంటుంది. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నువ్వు ఫైనాన్స్ కొట్టుకు వెళ్లింది అప్పు కోసమా కాదా అంటుంది.

దీంతో అవునమ్మా డబ్బుల కోసమే అంటాడు రామా. దీంతో ఇవి లాకర్ తాళాలు తీసుకో అంటుంది జ్ఞానాంబ. లాకర్ తాళాలు నాకెందుకు ఇస్తున్నావు అమ్మా అంటాడు. నాకు 10 రూపాయలు కావాలన్నా ఈ అమ్మను అడుగుతావు. అలాంటిది నాకు తెలియకుండా ఫైనాన్స్ కొట్టుకు వెళ్లావు. ఒకవేళ నీకు డబ్బులు అవసరం అయితే నాకు చెప్పకుండా నువ్వు ఫైనాన్స్ కొట్టుకు ఎందుకు వెళ్లావో నాకు అర్థం కావడం లేదు అంటుంది జ్ఞానాంబ.

నీకు ఎంత అవసరం అయినా తీసుకో. ఎందుకు కారణం ఏంటి అని నేను అడగను అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా షాక్ అవుతాడు. తీసుకో వెళ్లు అంటుంది. దీంతో ఏంటమ్మా అలా అంటావు. నాకు నిజంగా డబ్బు అవసరం అయితే నిన్ను అడగనా.. మా అమ్మను డబ్బులు అడగడానికి నాకు మొహమాటం ఏంటి అంటాడు.

మరి అయితే నువ్వు ఫైనాన్స్ కొట్టుకు ఎందుకు వెళ్లావు అంటుంది. అంటే.. నా ఫ్రెండ్ ఒకడు డబ్బులు కావాలని అడిగితే మాట సాయం చేయడానికి వెళ్లాను అంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా రామా అంటుంది. దీంతో అవును అమ్మ. ఒకవేళ నాకు అంత అవసరం అయితే నిన్ను అడుగుతా కదా అంటాడు రామా.

నీకు ఏ అవసరం వచ్చినా ఈ అమ్మను అడుగు. అంతే కానీ.. అప్పులు చేసి ఇబ్బందులు పడకు సరే వెళ్లి భోం చేయి అంటుంది జ్ఞానాంబ. ఏయ్ అంటూ మల్లికను పిలిచి.. నిజానిజాలు తెలుసుకోకుండా ఇంకోసారి ఇలాంటి చాడీలు చెప్పావనుకో అంటూ మల్లికకు వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ.

మరోవైపు తన రూమ్ కు వస్తాడు రామా. మీరు ఫైనాన్స్ ఆఫీసుకు వెళ్లింది అప్పు కోసమే కదా అని అడుగుతుంది జానకి. దీంతో రామాకు ఏం చెప్పాలో అర్థం కాదు. నా ఫీజు కట్టడం కోసం మీరు అప్పులు చేస్తున్నారు. దాని కోసం ఇబ్బందులు పడుతున్నారు అంటుంది.

నాకు ఐపీఎస్ చదువు వద్దు.. ఏది వద్దు. దయచేసి ఫీజు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు మీరు ఆపేయండి అంటుంది. మీరు వాళ్లను వీళ్లను అడుగుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటుంది జానకి. అప్పు కోసం ఎవరో ముందు చేయి చాచడం.. ఇంట్లో వాళ్ల ముందు దోషిగా నిలబడటం.. నా కారణంగా నా భర్త ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నాకు ఎలా ఉంటుంది అంటుంది జానకి.

నా భర్తను ఇబ్బందుల పాలు చేసే నా కల వద్దని చెబుతున్నాను కదా అంటుంది జానకి. దీంతో వద్దని వదిలేసుకోవడానికి అది వస్తువు కాదు జానకి గారు. ప్రాణానికి ప్రాణమైన మీ కల. మన ఊపిరితో పాటు అది కూడా మనతో పాటు సాగిపోతూ ఉంటుంది అంటాడు రామా.

లక్ష్యం యుద్ధం లాంటిది. యుద్ధం గెలవాంటే ఇలాంటి కష్టాలు సహజం అంటాడు రామా. అందుకని ఈ డబ్బుల గురించి ఎక్కువగా కంగారు పడటం మానేసి.. మీరు చదువు మీదనే దృష్టి పెట్టండి అని అంటాడు రామా. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు.

నర్సింహరావు గారు మీకు ఫోన్ చేశారు. మీకు అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలన్నారట కదా. కాకపోతే మా దగ్గర వడ్డీ ఎక్కువ అంటాడు అప్పు ఇచ్చే వ్యక్తి. దీంతో పర్లేదండి రెండు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా అంటాడు రామా. డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించుకుంటాడు అతడు.

ఆ తర్వాత డబ్బులు ఇస్తాడు. దీరేంద్ర గారు చాలా థాంక్స్ అంటాడు. డబ్బు తీసుకొని వెళ్తాడు రామా. ఇంతలో అక్కడికి కన్నబాబు వస్తాడు. రామా సంతకం పెట్టిన డాక్యుమెంట్లను తీసుకుంటాడు కన్నబాబు. ఇదంతా కన్నబాబు ప్లాన్ అన్నమాట.

ముందు నుంచి పొడిస్తే యుద్ధం.. వెనుక నుంచి పొడిస్తే మోసం.. ఏం చేసినా సరే.. శత్రువు మీద గెలవడం నాకు ముఖ్యం. పులి పంజా విసిరి మీద పడితే ఎలా ఉంటుందో.. సునామీ పొటెత్తి ముంచితే ఎలా ఉంటుందో ఆ రామా గాడికి త్వరలోనే చూపిస్తాను అని అనుకుంటాడు కన్నబాబు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే. ఇప్పుడు ఇంగ్లీష్‌లో కూడా ఇంటింటి గృహలక్ష్మి చ‌ద‌వండి..

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది