Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సండే స్పెషల్ స్టోరీ.. జానకి పయనం ఎటు వైపు..!?
Janaki Kalaganaledu : స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు కూడా ఒకటి.. ఈ సీరియల్ రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచుకుంటుంది.. ఐపీఎస్ అవ్వాలని జానకి తన అత్తగారింట్లో ఎవరికీ తెలియ కుండా చదువుకుంటుంది.. తాజాగా విడుదలైన టిఆర్పి రేటింగ్స్ లో జానకి కలగనలేదు 7.08 రేటింగ్ ను సొంతం చేసుకుంది.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది..ఐపీఎస్ కావాలని జానకి చేస్తున్న ప్రయత్నాలకు తన భర్త రామ అండగా నిలవడం హైలెట్. ఒక తండ్రి ఆశయం భర్తగా తను నెరవేరుస్తున్నందుకు రామ సంతోషిస్తాడు
చదువుకున్న అమ్మాయి కోడలుగా రావడం ఇష్టం లేని జ్ఞానంబను ఎదుర్కొని ఆ క్లిష్ట పరిస్థితులను దాటి జానకి తన ఐపీఎస్ కలను నెరవేర్చుకుంది అనే అంశం ఉత్కంఠభరితంగా మారుతుంది. జ్ఞానాంబ అ జానకి పద్దతిలో మార్పులను చూసి రామను తనకు దూరం చేయాలని అనూహ్య పరిణామాలను తన ముందు ఉంచుతుంది. వాటన్నింటినీ జానకి చిరునవ్వుతో భరిస్తుంది.. జానకి చదువు కోసం రామ ప్రామిసరి నోటు మీద సంతకం పెట్టి డబ్బులు తెస్తాడు ఆ ప్రామిసరీ నోటు అడ్డంపెట్టుకుని రామాను ఆట అడించనున్ననాడు తన శత్రువు.రామ ను జానకి అర్ధరాత్రి బయటకు తీసుకువెళ్ళిందన్న కోపంతో జ్ఞానాంబ.. అటు షాపులో ఇటు ఇంట్లోనూ కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన రామని..

Janaki Kalaganaledu Serial Next Week Overview
ఆ అర్ధరాత్రి ఈ టైంలో బయటకు ఎందుకు తీసుకెళ్తున్నావు.. వాడిని ప్రశాంతంగా నిద్ర పోనివ్వవా.. అలా అయితే వారి ఆరోగ్యం ఏమవుతుంది.. అసలు ఆ టైంలో వాడిని బయటకు ఎందుకు తీసుకెళ్లావు అని జ్ఞానాంబ అడుగుతుంది జానకిని.. ఒక్కటి గుర్తు పెట్టుకో నేను ఎంత మంచి దానినో.. అంత మొండి దానిని నా పెద్దకొడుకు నా పంచ ప్రాణాలు.. ఇంకొకసారి అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా వారిని బయటకు తీసుకువెళ్ళావ్ అనుకో .. నా కొడుకు మీద ఉన్న ప్రేమని చూపించడం మరో లాగా ఉంటుంది.. ఆ పరిస్థితులను అంత దూరం వరకు తెచ్చుకోవద్దు.. అని జ్ఞానాంబ జానకి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఇక జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..