Janaki Kalaganaledu : శ్రీరామనవమి వేడుకలకు రామా, జానకిని తీసుకెళ్లకుండా వెళ్లిన జ్ఞానాంబ.. దీంతో రామా షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu : శ్రీరామనవమి వేడుకలకు రామా, జానకిని తీసుకెళ్లకుండా వెళ్లిన జ్ఞానాంబ.. దీంతో రామా షాకింగ్ నిర్ణయం

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 18 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 281 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. త్వరలోనే మీ అమ్మ గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని రామాకు భరోసా ఇస్తుంది జానకి. మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకండి. హాయిగా పడుకోండి అని చెబుతుంది జానకి. దీంతో రామా తన ఒడిలో అలాగే నిద్రపోతాడు. జానకి కూడా రామా, […]

 Authored By gatla | The Telugu News | Updated on :16 April 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 18 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 281 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. త్వరలోనే మీ అమ్మ గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని రామాకు భరోసా ఇస్తుంది జానకి. మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకండి. హాయిగా పడుకోండి అని చెబుతుంది జానకి. దీంతో రామా తన ఒడిలో అలాగే నిద్రపోతాడు. జానకి కూడా రామా, జ్ఞానాంబను ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే తెల్లారుతుంది. జ్ఞానాంబ గారు అంటూ పంతుళ్లు తన ఇంటికి వస్తారు. కూర్చోండి అంటుంది జ్ఞానాంబ. చెప్పండి పూజారి గారు ఏంటి ఇలా వచ్చారు అంటుంది. రేపటి శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తి చేశాం. తమరిని కుటుంబ సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం అంటారు.

janaki motivates rama not to lose hope in janaki kalaganaledu

janaki motivates rama not to lose hope in janaki kalaganaledu

మేము తప్పకుండా కుటుంబ సమేతంగా వస్తాం అంటాడు గోవిందరాజు. ఇంతలో మీ పెద్దబ్బాయి పెళ్లి అయ్యాక వస్తున్న తొలి శ్రీరామనవమి. అందుకని.. పెద్ద కొడుకు, పెద్ద కోడలు చేతుల మీద అన్నదానం.. చిన్న కొడుకు, చిన్న కోడలు పేరు మీ వస్త్రదానం చేస్తే మంచిది అంటాడు పూజారి. దీంతో మల్లికకు కోపం వస్తుంది. రెండు పనులు చిన్న కొడుకు, చిన్న కోడలు చేస్తే ఏమౌతుంది అంటుంది. ఇంతలో మల్లిక నువ్వు ఊరుకుంటావా అంటాడు గోవిందరాజు. మీ పెద్ద కొడుకు, పెద్ద కోడలు పేర్లు కూడా రామా, జానకి. వాళ్ల పేర్ల మీద జరిపిస్తే అంతా మంచే జరుగుతుంది అని చెబుతాడు పూజారి. దీంతో సరే అని అంటారు.

ఈ విషయంలో జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. పెద్ద కొడుకు, పెద్ద కోడలు మనతో కలిసి ఉండటం లేదని రేపు మనం వేరుగా వెళ్తే అందరికీ తెలిసిపోతుంది అంటాడు గోవిందరాజు. దీంతో మల్లిక మళ్లీ మధ్యలో కలుగజేసుకుంటుంది. అందరం కలిసి గుడికి వెళ్దాం అంటాడు గోవిందరాజు. కలిసి గుడికి వెళ్లడం అంటే జానకి వాళ్లు కలిసిపోయినట్టే కదా అంటాడు గోవిందరాజు.

కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు జరగడం చాలా సహజం అంటాడు గోవిందరాజు. మళ్లీ మధ్యలో మాట్లాడుతుంది మల్లిక. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అవమానాన్ని అత్తయ్య గారు అంత ఈజీగా ఎలా మరిచిపోతారు అంటుంది మల్లిక.

నువ్వు ఊరికే అవమానం.. అవమానం అంటూ పిచ్చి కూతులు కూయకు అంటాడు గోవిందరాజు. నేను ఎలా మరిచిపోతాను మామయ్య గారు. గుండెలు పగిలిపోయేలా కంటతడి పెట్టుకున్నదాన్ని. మరి మాట్లాడకుండా ఎలా ఉంటాను మామయ్య గారు అంటుంది.

Janaki Kalaganaledu : ఆలోచనలో పడ్డ జ్ఞానాంబ

ఆ సంఘటన గుర్తొస్తే చాలు.. ఏడుపు తన్నుకొచ్చేస్తుంది అంటుంది. నాకే ఇంత బాధగా ఉందంటే.. పాపం ఆ అవమానాన్ని భరించిన అత్తయ్య గారికి ఇంకెంత బాధగా ఉంటుంది అంటుంది మల్లిక. దయచేసి నువ్వు పుల్లలు పెట్టే కార్యక్రమం ఇక ఆపుతావా అంటాడు గోవిందరాజు.

నువ్వు నోరెత్తకు అంటాడు. జ్ఞానం.. ఏమంటావు. అందరం కలిసి గుడికి వెళ్దాం సరేనా అంటాడు గోవిందరాజు. దీంతో మల్లిక కొట్టుకెళ్లాలి వెళ్లి తాళాలు తీసుకురా అంటుంది. దీంతో మల్లిక సంతోషిస్తుంది. కొట్టుకు వెళ్లాక రామా గురించే ఆలోచిస్తూ ఉంటుంది జ్ఞానాంబ.

పరధ్యానంలో కస్టమర్లను కూడా సరిగ్గా పట్టించుకోదు. ఇంతలో నీలావతి అక్కడికి వస్తుంది. అప్పుడే బాక్స్ తీసుకొని మల్లిక వస్తుంది. మీ కోపం టిఫిన్ పట్టుకొచ్చాను తినండి అంటుంది. దీంతో అక్కడ పెట్టు అంటుంది జ్ఞానాంబ. ఆ పూజారి చెప్పిన మాటలకు కొంపదీసి ఈ పోలేరమ్మ ఆలోచనలో పడి ఉంటుంది అని అనుకుంటుంది.

పెద్ద కొడుకు, పెద్ద కోడలను శ్రీరామనవమికి తీసుకెళ్లాలని ఆలోచిస్తోందా ఏంటి అని మనసులో అనుకుంటుంది మల్లిక. ఈ పోలేరమ్మ మనసులో ఏముందో తెలుసుకోవాలి. టైమ్ కు నీలావతి కూడా ఇక్కడే ఉంది కదా.. టైమ్ కు కలిసివచ్చింది అని అనుకుంటుంది.

అవును పెద్దమ్మ.. నేను వస్తూ వస్తూ చూశాను. ఆ అరుగు దగ్గర ఆడంగులు ఏంటి.. మా అత్తయ్యకు జానకి అంటే తెగ ప్రేమ అని మాట్లాడుకుంటున్నారు అంటుంది. దీంతో ఇప్పుడు ఇంట్లో నుంచి గెంటేసినా.. రేపో మాపో తీసుకొచ్చి చూసుకోదా ఏంటి.. మళ్లీ పెద్ద కోడలును నెత్తిన పెట్టుకుంటుంది అంటుంది నీలావతి.

ఏయ్ మల్లిక ఆగు.. నోర్మూసుకొని ఉండు. ఇదిగో నీలావతి వెళ్లు అంటుంది. మధ్యలో మల్లిక నీలావతితో మాట్లాడించే ప్రయత్నం చేసినా.. నువ్వు వెళ్లు నీలావతి అంటుంది. ఆమె వెళ్లాక.. ఇంటి విషయాలు.. బయట మాట్లాడొద్దని నీకు తెలియదా అంటుంది జ్ఞానాంబ.

మన కుటుంబం అంటున్నారేంటి.. జానకి వాళ్లు వేరే కుటుంబం కదా. వాళ్లను కూడా మన కుటుంబంతో కలిసి మాట్లాడుతున్నారు ఏంటి అంటుంది. నీకు ముఖ్యంగా ఒక విషయం చెబుతున్నాను గుర్తుపెట్టుకో. జానకి గురించి వాళ్లతో వీళ్లతో అస్సలు మాట్లాడొద్దు అంటుంది. దీంతో సరే అంటుంది.

మన కుటుంబం అంటుంది.. జానకి గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటుంది. జానకి మీద పోలేరమ్మకు ఉన్న కోపం పాలపొంగులా ఏదో ఒకరోజు తగ్గిపోవచ్చు. వాళ్లను ఇంట్లోకి తీసుకొని రావచ్చు. అలాగే జరిగితే నీలావతి చెప్పినట్టే నాకు మళ్లీ పని మనిషి పోస్టే. చూస్తా.. ఏదో ఒకటి చేస్తా అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక.

కట్ చేస్తే.. జానకి, రామా ఇద్దరూ సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. ఇంతలో బుల్లెట్ మీద విష్ణు, మల్లిక ఇద్దరూ వెళ్తుంటారు. మరోవైపు జ్ఞానాంబ, గోవిందరాజు, అఖిల్, వెన్నెల అందరూ బైక్ ల మీద గుడికి వెళ్తుంటారు. రామా మాత్రం సైకిల్ మీద జానకిని తీసుకొని గుడికి వెళ్తుంటాడు.

ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందరితో కలిసి శ్రీరామనవమి వేడుకలకు వెళ్లిన విషయాలు రామాకు గుర్తొచ్చి సైకిల్ ఆపుతాడు. మీకు గుర్తుందా అండి. ఇదివరకు మనందరం కలిసి ఎలా శ్రీరామనవమి వేడుకలకు వెళ్లామో అంటాడు రామా.

ఆ తర్వాత అందరూ గుడికి వెళ్తారు. రామా, జానకిని చూసి కూడా జ్ఞానాంబ ఏం మాట్లాడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది