Hyper Aadi : హైపర్ ఆదిపై చేయిజేసుకుంది.. జీవిత చేసిన పనికి అంతా షాక్
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆదికి తిరుగులేదు. అతని పంచ్‌లకు ఎదురులేదు. ఎవరు వచ్చినా సరే వారిపై తన స్టైల్లో కౌంటర్లు వేస్తుంటాడు ఆది. అయితే ఆది పంచ్‌లకు అప్పుడప్పుడు రోజా కూడా బలైపోతోంది. రోజా మేకప్పు, వయసు, భారీ కాయం గురించి ఆది పంచులు వేస్తుంటాడు. కానీ రోజా నవ్వడం తప్పా ఇంకేం చేయలేదు.
తాజాగా జీవిత అయితే హైపర్ ఆదిని కొట్టేసింది. తాజాగా జీవిత, రాజశేఖర్‌లు ఈటీవీ ఉగాది ఈవెంట్ అయిన అంగరంగ వైభవంగాలో కనిపించారు. దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో రోజా, జీవిత, రాజశేఖర్, హైపర్ ఆది కలిసి స్కిట్లు వేశారు. బతుకు జట్కా బండి టైపులో స్ఫూఫ్ చేశారు.

Jeevitha Slams Hyper Aadi In Angaranga Vaibhavanga
Hyper Aadi : జీవిత దెబ్బకు అంతా షాక్..
రోజా తమని కొడుతోందని హైపర్ ఆది తన గ్యాంగు జీవిత వద్దకు న్యాయం కోసం వస్తారు. ఎందుకు కొట్టారండి అని రోజాను అంటే.. నన్ను అన్నా పర్లేదు కానీ నా ప్రజలను తిట్టారు అని రోజా చెబుతుంది. దీంతో అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న జీవిత.. మీరు ప్రజలను అంటారా? అని హైపర్ ఆదిని కొట్టేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.
