Janaki Kalaganaledu : రామాను జానకి గుప్పిట్లో పెట్టుకుందని జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. జానకి దీనికి ఒప్పుకుంటుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : రామాను జానకి గుప్పిట్లో పెట్టుకుందని జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. జానకి దీనికి ఒప్పుకుంటుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :3 April 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 4 ఏప్రిల్ 2022, ఎపిసోడ్ 271 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన రామాతో కలిసి కష్టసుఖాలను అనుభవించడానికి సిద్ధపడిందని అనుకున్నా కానీ.. ఇంటి ముందు గుడిసె వేసుకోవడం నామూషీ అనిపించి ఉంటుంది. పైగా చదువు లేనివాడిని చేసుకున్నానన్న అవమానం ఇప్పటికీ జానకి మనసులో ఉంది కదా. ఇవన్నీ గుర్తుంచుకొనే జానకి మనసులో రామాకు విడాకులు ఇవ్వాలని ఉండొచ్చు అంటుంది జ్ఞానాంబ. కానీ.. గోవింద రాజు అలా కాదంటాడు. జానకి అటువంటిది కాదంటాడు. కానీ.. జ్ఞానాంబ మాత్రం మల్లిక మాయలోనే పడిపోతుంది. మల్లిక చెప్పినవే నిజం అని నమ్ముతుంది.

jnanamba feels bad about ramachandra hard work for earning money in janaki kalaganaledu

jnanamba feels bad about ramachandra hard work for earning money in janaki kalaganaledu

దీంతో గోవిందరాజుకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు జానకి దండం మీద బట్టలు ఆరేస్తూ ఉంటుంది. మా దండం మీద బట్టలు ఆరేయడం ఏంటి అని మల్లిక చిరాకు పడి ఆ బట్టలను తీసి కిందపడేస్తుంది. ఇది గమనించిన గోవిందరాజు. కొత్త దండం కట్టి ఇక్కడ ఆరేసుకో బట్టలు అంటాడు. ఆ తర్వాత కొంత డబ్బు ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమని చెబుతాడు గోవిందరాజు. జానకి వద్దు అంటుంది. అయినా కూడా వినకుండా తన చేతుల్లో డబ్బు పెడతాడు. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి రావడంతో జానకిని తిడుతున్నట్టు నటించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు ఖార్ఖానాలో పని ఒత్తిడి వల్ల మధ్యాహ్నం రామా అన్నం తినలేకపోతాడు. సాయంత్రం బాక్స్ ను అలాగే పట్టుకొని వస్తాడు. అన్నం తినలేదని తెలిస్తే జానకి బాధపడుతుందని అనుకొని ఆ బాక్స్ లో ఉన్న అన్నాన్ని అక్కడే కింద పడేస్తాడు రామా.

రామా.. భోజనాన్ని కింద పడేయడం చూసి జ్ఞానాంబ షాక్ అవుతుంది. చివరకు నా కొడుకు భోజనం కూడా తినలేనంతగా కష్టపడుతున్నాడా అని బాధపడుతుంది జ్ఞానాంబ. ఖార్ఖానాలో పని చాలా కష్టంగా ఉంటుంది. నా బిడ్డ భోజనం కూడా చేయకుండా కష్టపడుతున్నాడు అనుకుంటుంది.

ఈవిడ చేసిన వంట రామాకు నచ్చడం లేదా.. అందుకే తినలేకపోతున్నాడా. నిన్ను ఎంత అపురూపంగా పెంచుకున్నాను. నువ్వు తిండి తిప్పలు లేకుండా కష్టపడుతుంటే ఈ అమ్మ గుండె తరుక్కుపోతోందిరా అని అనుకుంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu : రామాతో చపాతీలు చేయించిన జానకి

ఆ తర్వాత లంచ్ బాక్స్ తీసుకొని రామా ఇంటికి వస్తాడు. ఆ బాక్స్ కూడా ఇలా ఇవ్వండి.. కడిగేస్తాను అంటుంది జానకి. జానకికి అనుమానం రాకుండా ఉండేందుకు భోజనం బాగుంది అని అంటాడు రామా. కనీసం తిన్నావా అని కూడా అడగట్లేదు భర్తను. తల్లి ప్రాణం కింద భార్య ప్రేమ ఎక్కడిది.. అనుకుంటుంది జ్ఞానాంబ.

నాకు ఇలా తల్లి పేగు తల్లడిల్లడానికి.. నీకు ఈ కష్టం రావడానికి అన్నింటికీ నీ భార్యే కారణం అనుకుంటుంది జ్ఞానాంబ. మన మధ్య ఉన్న జానకిని ఎలాగైనా అడ్డు తప్పించాలి అనుకుంటుంది జ్ఞానాంబ. మరోవైపు రాత్రి కాగానే.. ఆరుబయట కూర్చొని జానకి, రామా ఇద్దరూ చపాతీలు చేస్తుంటారు.

ఇంతలో రామాకు తన అమ్మ గుర్తొస్తుంది. రామా చపాతీలు చేయడం చూసి జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఉదయం నుంచి ఖార్ఖానాలో కష్టపడి నాకొడుకు పని చేసి వస్తే.. ఇప్పుడు వాడితోనే వంట వండిస్తోంది అంటూ జ్ఞానాంబకు కోపం వస్తుంది.

కట్ చేస్తే.. ఖార్ఖానాలో మధ్యాహ్నం భోజనం చేస్తూ జానకికి ఫోన్ చేస్తాడు రామా. భోజనం ఇవాళ అద్భుతంగా ఉందంటాడు. అచ్చం మా అమ్మ వండినట్టుగా ఉందంటాడు. దానికి జానకి సరే తినండి అంటుంది కానీ.. ఆ బాక్స్ నిజంగానే జ్ఞానాంబ పంపిస్తుంది.

తన కొడుకు అలా మురిసిపోయి తినడం అక్కడే ఉండి చూస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది