Anchor Suma : క్యాష్ షోకు సమీర్ రావడం వెనుకున్న రహస్యమిదే.. సుమ అంత పని చేసిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Suma : క్యాష్ షోకు సమీర్ రావడం వెనుకున్న రహస్యమిదే.. సుమ అంత పని చేసిందా?

Anchor Suma : క్యాష్ షోలో సుమ చేసే సందడి మామూలుగా ఉండదు. అలా సుమ క్యాష్ షోకు ప్రతీవారం మంచి రేటింగ్లే వస్తుంటాయి. అయితే సుమ క్యాష్ షోకు కొంత మంది గెస్టులు రెగ్యులర్‌గా వస్తుంటారు. అందులో నటుడు సమీర్ ముందుంటాడు. ఇప్పటికే దాదాపు డజను సార్లు వచ్చి ఉంటాడు. అలా రెగ్యులర్‌గా వచ్చే సమీర్ మీద, సుమ క్యాష్ షో మీద జోగి బ్రదర్స్ సెటైర్లు వేశారు.వచ్చే వారం క్యాష్ షోకు జోగి బ్రదర్స్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 May 2022,9:00 pm

Anchor Suma : క్యాష్ షోలో సుమ చేసే సందడి మామూలుగా ఉండదు. అలా సుమ క్యాష్ షోకు ప్రతీవారం మంచి రేటింగ్లే వస్తుంటాయి. అయితే సుమ క్యాష్ షోకు కొంత మంది గెస్టులు రెగ్యులర్‌గా వస్తుంటారు. అందులో నటుడు సమీర్ ముందుంటాడు. ఇప్పటికే దాదాపు డజను సార్లు వచ్చి ఉంటాడు. అలా రెగ్యులర్‌గా వచ్చే సమీర్ మీద, సుమ క్యాష్ షో మీద జోగి బ్రదర్స్ సెటైర్లు వేశారు.వచ్చే వారం క్యాష్ షోకు జోగి బ్రదర్స్ గెస్టులుగా రాబోతోన్నారు.

జోగి బ్రదర్స్ దెబ్బకు సుమకు దిమ్మతిరిగిపోయింది. జోగి బ్రదర్స్ సుమ గురించి, క్యాష్ షో గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. సుమ తెలుసు కదా? అని ఒకడు అంటే.. నాకెందుకు తెలియదు.. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా?.. యాంకరింగ్ చేస్తోందంటూ అనేస్తాడు.దీంతో సుమ తెగ నవ్వేస్తుంటుంది.సుమ పంచ్‌లు అలా ఎలా వేస్తుందంటావ్ రా అని అడిగితే.. రాత్రంతా పడుకోదు.. ప్రాక్టీస్ చేస్తుంది.. పొద్దున్నే వచ్చే పంచ్‌లు వేస్తుంది అని అంటాడు.

Jogi Brothers Satires on Sameer in Anchor Suma Cash Show

Jogi Brothers Satires on Sameer in Anchor Suma Cash Show

దీంతో సుమ పగలబడి నవ్వేస్తుంటారు. మనం ఏమైనా నేర్చుకుందామా? అన్నయ్య అని అంటే.. మనం నేర్చుకోలేం.. ఎందుకంటే మనకు మళయాలం అర్థం కాదు కదా? అంటాడు. దీంతో మళ్లీ సుమ నవ్వేస్తుంటుంది.సమీర్ రెగ్యులర్ కాంట్రాక్ట్ తీసుకున్నాడట తెలుసా? నఅని అంటే.. కాంట్రాక్ట్ కాదు.. వచ్చినప్పుడల్లా సుమ డబ్బులు ఇవ్వడం లేదట.. ఏదో ఒకనాడు ఇస్తుంది కదా? అని అలా వస్తుంటాడట అని సమీర్ గురించి, సుమ గురించి జోగి బ్రదర్స్ సెటైర్లు వేస్తారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది