Anasuya : కొత్త షోతో కొత్త అందాల ప్రదర్శన.. రెచ్చిపోయిన యాంకర్ అనసూయ
Anasuya : అనసూయ ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక ఇప్పుడు అనసూయ బుల్లితెరపై మరింతగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు కేవలం జబర్దస్త్ షోతో మాత్రమే కనువిందు చేసేది. కానీ ఇప్పుడు ఇతర చానెళ్లలో ఇతర షోలతోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఆల్రెడీ ఇప్పటికే స్టార్ మా చానెల్‌కు అనసూయ జంప్ అయిన సంగతి తెలిసిందే.అనసూయ, సుధీర్ కలిసి స్టార్ మాకు వెళ్లారు. స్టార్ మా చానెల్లో సూపర్ సింగర్ జూనియర్స్ అనే పాటల షో ప్రారంభమైంది. ఆ షోకు మనో, చిత్ర, ఉషా ఉత్తుప్ వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
ఆ షోలో యాంకర్ అనసూయ, సుధీర్‌లు సందడి చేస్తున్నారు. అయితే ఇప్పటికే మల్లెమాలకు ఈ ఇద్దరూ దూరమయ్యారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.తాజాగా మరో కొత్త షోకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ మాలో రాబోతోన్న కొత్త షోకు అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. అలా ఇప్పుడు అనసూయ మాత్రం ఈటీవీకి దూరంగా స్టార్ మాకు దగ్గరగా ఉంటోన్నట్టు కనిపిస్తోంది. ది నెక్స్ట్ సూపర్ స్టార్ అంటూ రాబోతోన్న ఈ కొత్త షోలో యాంకర్‌గా అనసూయ మెరుస్తోంది. ఈ కొత్త షో కోసం అనసూయ తన అందాలను మరింతగా ప్రదర్శిస్తోంది.

anchor anasuya in Star Maa Music The Next Super Star
తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ ఊర మాస్ స్టెప్పులు వేసేస్తోంది. మొత్తానికి అనసూయ మాత్రం బుల్లితెరపై తన పట్టును వదలకుండా చూసుకుంటోంది. మరో వైపు వెండితెరపై వచ్చిన ప్రాజెక్టులన్నీ చేసుకుంటూ పోతోంది. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలను చేస్తోంది. అలా పక్క భాషల్లోనూ అనసూయ ఇప్పుడు బిజీగా మారింది.