Johnny Master : జానీ మాస్టర్ కేసు.. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందా..?
ప్రధానాంశాలు:
Johnny Master : జానీ మాస్టర్ కేసు.. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందా..?
Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడాడని ఒక మహిళ పోలీస్ కేసు వేసింది. కొంతకాలంగా తనని లంగికంగా వేధిస్తున్నాడని జానీ మాస్టర్ అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే ఎఫ్.ఐ.ఆర్ లో ఆమె సంచలన విషయాలను పొందుపరిచినట్టు తెలుస్తుంది.2017 ఢీ షో నుంచి జానీ మాస్టర్ తో ఆమె పరిచయం ఏర్పడినట్టు చెప్పింది. అక్కడ పరిచంతోనే 2019 లో తన టీం లో ఆమెను చేర్చుకున్నాడట జానీ మాస్టర్. అయితే చెన్నై, హైదరాబాద్, ముంబై లాంటి సిటీల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో రాసింది. మొదటి రోజు నుంచి జానీ మాస్టర్ నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది.
Johnny Master కోరికలు తీర్చకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తా..
కోరికలు తీర్చకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించే వాడని.. షూటింగ్ చేస్తున్న టైం లో కూడా కార్ వ్యాన్ లోకి వచ్చి తన బలవంతంగా చేశాడని ఆ యువతి ఫిర్యాధులో పేర్కొన్నది. తాను నో చెప్పడంతో తలను అద్దంకేసి కొట్టాడని.. మణికొండలో తన ఫ్లాట్ కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చాలని చాలాసార్లు దాడి చేశాడని ఐతే తను ఏ నాడు అతనికి లొంగలేదని యువతి చెప్పింది. మతం మార్చుని పెళ్లి చేసుకోవాలని తన మీద జానీ మాస్టర్ ప్రెజర్ చేశాడబ్ని.. శారీరకంగా మానసికంగా జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాధులో పేర్కొంది.

Johnny Master : జానీ మాస్టర్ కేసు.. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందా..?
ఐతే తనతో ఇలా ప్రవర్తించే విషయం జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసని.. ఆమె కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని ఆమె అన్నది. జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు జీరో అఫ్.ఐ.ఆర్ ను నమోదు చేశారు. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఐతే జానీ మాస్టర్ పై అత్యాచార కేసు రాగానే జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రకటన చేసింది.