KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్రధాన పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో..!
ప్రధానాంశాలు:
KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్రధాన పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో..!
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి, ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కాంతార 3’ కోసం భారీ స్థాయిలో ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తుండగా, ఈ సినిమాలో ఒక పెద్ద తెలుగు స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్రధాన పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో..!
KAntara 3 ఇదే నిజమైతే..
ఆ అవకాశం ఎవరికంటే… యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కే దక్కినట్టు సమాచారం. ఆయన ‘కాంతార 3’లో ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్‌లోఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ఇదే నిజమైతే, రిషబ్ శెట్టి – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే విజువల్ ఎక్స్‌పీరియెన్స్ అభిమానులకు మజా అందిస్తుంది. ‘కాంతార’లో అడవి, దేవతల తత్వం, భక్తి, మానవ అహంకారాల మేళవింపు ఆకట్టుకుంది. ఇప్పుడు అదే నేపథ్యాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నంలో రిషబ్ ఉన్నాడట. ఈసారి స్కేలు, టెక్నికల్ వ్యాల్యూస్ అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయి.
ఎన్టీఆర్ ఎంట్రీ వలన తెలుగు మార్కెట్‌లో హైప్ మరింత పెరిగిపోతుందని, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు దద్దరిల్లడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ డ్రాగన్’ సినిమా పనుల్లో బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత ‘కాంతార 3’ షూటింగ్ చేస్తాడా అన్న చర్చ నడుస్తుంది. మరిన్ని అధికారిక వివరాల కోసం ‘హోంబలే ఫిలిమ్స్’ ప్రకటన కోసం వేచి చూడాల్సిందే!