Allu Arjun – JR NTR : అల్లు అర్జున్ ఎన్టీఆర్ ను ‘ బావ ‘ అని పిలవడానికి కారణం ఇదే ..?
Allu Arjun – JR NTR : టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయట చాలా క్లోజ్ గా ఉంటారు. సినిమా ఫీల్డ్ లో ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచిన వ్యక్తిగతంగా వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అయితే నిన్న అల్లు అర్జున్ తన 40 వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. తమకు ఇష్టమైన హీరో పుట్టినరోజు కావడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా బన్నీకి విషేస్ చెప్పారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హ్యాపీ బర్త్ డే బావ అంటూ చాలా ముద్దుగా, ప్రేమగా విషెస్ చెప్పాడు తారక్. తారక్ కి రిప్లై ఇస్తూ బన్నీ థాంక్స్ బావ వార్మ్ హగ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి తారక్ రిప్లై ఇస్తూ ఓన్లీ హగ్స్ నేనా, పార్టీ లేదా పుష్ప అని పుష్ప సినిమాలోని డైలాగును ట్వీట్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ మళ్లీ రిప్లై ఇస్తూ వస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నందమూరి అభిమానులు కన్వర్జేషన్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇంత ప్రేమగా, ఆప్యాయతగా పిలుచుకుంటున్న ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య గొడవలు పెట్టేవాళ్ళకి ఇది గట్టి కౌంటర్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి చూడాలి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే పూనకాలు లోడింగ్ అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.