Samantha : ఎన్టీఆర్ మాటకు ఖంగుతిన్న సమంత.. వద్దంటూ వేడుకుంది!
Samantha సమంత ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద బాగానే వర్కవుట్ అయింది. దాదాపు మూడు నాలుగు చిత్రాలు కలిసి చేశారు. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు చేశారు. ఇందులో ఒక్క రామయ్య వస్తావయ్యా, రభస డిజాస్టర్లుగా మిగిలాయి. మిగిలిన రెండు కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి బుల్లితెర మీద సందడి చేశారు.

Jr NTR And Samantha Hosting EMK SHow
ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సమంత గెస్టుగా వచ్చింది. ఈ మేరకు ఆ షోలో ఈ ఇద్దరూ ముచ్చట్లు పెట్టిన సంగతలు, ఒకరినొకరు ఆట పట్టించుకున్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విడాకులకు సంబంధించిన అంశం గురించి ఏదైనా స్పందిస్తుందా? అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే ఈ షోకు హోస్ట్ అయ్యే చాన్స్ తనకు కూడా ఉందంటూ బాంబ్ పేల్చింది.
Samantha : షోకు సమంత హోస్ట్..

Samantha Akkineni on Drunken Man
తదుపరి సీజన్‌కు హోస్ట్ చేస్తావా? చానెల్ వాళ్లకు చెప్పాలా? నా అభిమానులకు చెప్పేయాలా? అని ఎన్టీఆర్ అనడంతో సమంత ఖంగుతింది. మీ అభిమానులా? వద్దని వేడుకుంది. నా అభిమానులు బంగారంలాంటి వారండి అని ఎన్టీఆర్ అనడం.. అవును మీ అభిమానులు బంగారం లాంటి వారు సమంత అనడంతో నవ్వులు పూశాయి.మొత్తానికి సమంత, ఎన్టీఆర్ ముచ్చట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.