Jr Ntr : ఎన్టీఆర్ బర్త్ డే.. మేకని బలిచ్చి రక్తాభిషేకం.. వైరల్ అవుతున్న వీడియో
ప్రధానాంశాలు:
Jr Ntr : ఎన్టీఆర్ బర్త్ డే.. మేకని బలిచ్చి రక్తాభిషేకం.. వైరల్ అవుతున్న వీడియో
Jr Ntr : ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే Happy Birthday కావడంతో సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ జపం చేస్తుంది. పలువురు సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్‌ని ముద్దుగా బావా అని పిలుస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. ”హ్యాపీ బర్త్ డే బావా.. ఎప్పుడూ నువ్వు ఆయురారోగ్యాలతో ఉండాలి” అని పేర్కొంటూ బన్నీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇది చూసి నందమూరి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు.

Jr Ntr : ఎన్టీఆర్ బర్త్ డే.. మేకని బలిచ్చి రక్తాభిషేకం.. వైరల్ అవుతున్న వీడియో
Jr Ntr ఏంటి.. ఈ మూర్ఖత్వం..
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వీరాభిమానులు కొందరు తమ అభిమాన హీరో ఇంటి ముందు ఈగల్లా వాలిపోయారు. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ ఇంటి చుట్టూ అభిమానులు కుప్పలు తెప్పలుగా పోగయ్యారు.తమ హీరోని చూసి బర్త్ డే విషెస్ చెప్పడానికి ఎగబడ్డారు. దీనికితోడు అక్కడ ఎన్టీఆర్ కటౌట్స్ కూడా మాస్ లుక్ లో దర్శనం ఇచ్చాయి. దీంతో అభిమానులు అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు ఎన్టీఆర్ జీవితంలో మరెన్నో విజయాలు అందుకోవాలి. అలాగే జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఫ్యాన్స్ లో కొందరు పూజలు కూడా చేస్తున్నారు. ఇంకొందరు అయితే మూగజీవాలని బలి ఇస్తున్నారు. మేకను బలిచ్చి ఆ రక్తంతో అభిషేకం చేస్తున్నారు. ఇలాంటివి చేయోద్దని చెబుతున్నా కూడా కొందరు ఇలా చేస్తుండడం ఎన్టీఆర్‌కి ఏ మాత్రం రుచించడం లేదు. శాంతియుతంగా చేస్తే బాగుంటుందని కొందరు సూచనలు చేస్తున్నారు.