Jr NTR : 35 ఏళ్లుగా తమ రెండు కుటుంబాల మధ్య పోరు నడుస్తోందంటూ జూనియర్ ఎన్టీఆర్ ఊహించని వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : 35 ఏళ్లుగా తమ రెండు కుటుంబాల మధ్య పోరు నడుస్తోందంటూ జూనియర్ ఎన్టీఆర్ ఊహించని వ్యాఖ్యలు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :26 December 2021,4:20 pm

Jr NTR : తెలుగు భాషతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. జూ. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపతున్నారు. ఓ మీడియాకు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో హీరో తారక్ కు ఎదురైన ప్రశ్నకు ఆయన నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

యంగ్ టైగర్ తారక్ కు ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు వచ్చే అవకాశాలున్నాయా అనే ప్రశ్నపై ఎన్టీఆర్‌ ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చొ లేదో తెలియదు కానీ తమ 2 కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోందంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికి రామ్ చరణ్, తాను మంచి స్నేహితులుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. తమ రెండు ఫ్యామిలీల మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుందన్న తారక్.. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తర్వాత దేశంలోని స్టార్లంతా ఒకే తాటి పైకి వస్తారని అన్నారు. తమ చిత్రం రిలీజ్ అనంతరం…

Jr NTR comments on disputes between nandamuri and mega family

Jr NTR comments on disputes between nandamuri and mega family

Jr NTR : 35 ఏళ్లుగా తమ మధ్య పోరు నడుస్తోంది..:

ముందు ముందు భారీ మల్టీస్టారర్‌ సినిమాలు వస్తాయనే నమ్మకం తమకు ఉందని అన్నారు.గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వనున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను రాజమౌళి తనదైన శైలిలో జరుపుతున్నారు. టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న రామ్ చరణ్, తారక్ లు నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ ఉంటే రాను రాను మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ పెరుగుతూ పోయేలా కనిపిస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది