Jr NTR – Kalyan Ram : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్ల వెనుకున్న టాప్ సీక్రెట్ ఇదే..
Jr NTR – Kalyan Ram : నందమూరి తారక రామారావు తన సంతానం అందరికీ ఒకరి పేరుతో మరొకరికి సంబంధం ఉండేలా నామకరణం చేశారు. కొడుకులకు ఏమో చివర్లో కృష్ణ అనే పేరు వస్తే.. కూతుర్లకు మాత్రం చివర్లో ఈశ్వరి అనే పేరు వచ్చేలా పెద్దాయన ఆలోచన చేశారు. కారణం వీరంతా ఒకే సంతానం , అంతా కలిసిమెలిసి ఉండాలని ఇలా పెట్టారని నందమూరి కుటుంబం సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్‌కు సెంటిమెంట్లను చాలా నమ్ముతారట.. వాటిని ఫాలో అవుతుంటారని కూడా టాక్ వినిపిస్తోంది.
అందుకే తన ఐదుగురు కుమారులకు రామకృష్ణ, జయకృష్ణ, మోహనకృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ అని నామకరణం చేశారు. ఇక నలుగురు కూతుర్లకు లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అని పేర్లు పెట్టారు. తండ్రి ఫాలో అయిన సెంటిమెంటునే నందమూరి హరికృష్ణ కూడా ఫాలో అయ్యారని తెలుస్తోంది. తన ఇద్దరు కొడుకులకు కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని పేరు పెట్టారట.. ఒకానొక టైంలో ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న టైంలో హరికృష్ణ తారక్‌ను తీసుకుని షూటింగ్ వెళ్లాడట.. ఆటైంలో యంగ్ టైగర్‌ను నీ పేరు ఎంటని అడుగగా.. తారక్ రామ్ అని చెప్పాడట..
ఆవెంటనే ఎన్టీఆర్ నీది నా అంశ అని చెప్పి నందమూరి తారకరామారావు అని మరల నామకరణం చేశారట. ఈ విషయాన్ని హరికృష్ణ నాన్నకు ప్రేమతో ఆడియో లాంచ్ టైంలో గుర్తుచేసుకుని గర్వంగా ఫీలయ్యారు.అప్పటి నుంచి ఎన్టీఆర్ తాత రక్తాన్ని పంచుకుని పుట్టడమే కాకుండా ఆయన వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు.ఇక జూనియర్ తన ఇద్దరు కొడుకులకు ఒకరికి అభయ్ రామ్, మరొకరికి భార్గవ్ రామ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.