JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలో గుర్తు పట్టలేనంతగా కనిపించనున్నాడా.. వెయిట్‌లాస్ కోసం కసరత్తులు..!
JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా కోసం మూడేళ్ల సమయం కేటాయించిన ఎన్టీఆర్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా తన 30వ సినిమా మొదలు పెట్టే పనిలో పడ్డాడు. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన ఆచార్య మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొరటాల పూర్తి చేశాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు కొరటాల. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ఎన్టీఆర్ వెకేషన్‌కు ప్లాన్ చేశాడని వార్తలు రాగా.
.అలాందేమీ లేదని వీలైనంత త్వరగా కొరటాలతో చేయబోయే సినిమా షూట్‌లో పాల్గొంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనిని ప్రారంభిస్తానని ఎన్టీఆర్ చెప్పాడు. సినిమాకు సంబంధించిన లుక్స్ కోసం సమయం కేటాయిస్తానని వెల్లడించాడు. సినిమా కోసం ఎన్టీఆర్ తన బరువును తగ్గించుకోబోతున్నాడు. ఈ సినిమా లాంచ్ జూన్ లో ప్రారంభం కానుంది. చిత్రం కోసం దాదాపు ఏడెనిమిది కిలోల బరువు తగ్గనున్నాడట జూనియర్. అంటే మళ్లీ స్లిమ్ లుక్ లో జూనియర్‌ని చూడబోతున్నాం.

Jr ntr starts workouts for his 30 th movie
JR NTR : ఎన్టీఆర్ పనులు మొదలు…
ఎన్టీఆర్ 30వ సినిమా ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, అలియా భట్ కథానాయికగా నటిస్తుందని సమాచారం. అనిరుధ్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “జనతా గ్యారేజ్” తర్వాత ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది.ఇక ఇదిలా ఉంటే దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్చి 25న విడుదలైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ థియేటర్లలో అదరగొడుతోంది. కేవలం మూడు రోజల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి రికార్డుని తిరగరాసింది.