Jr NTR : సీఎం ఎన్టీఆర్ నినాదాలతో దద్దరిల్లిన దుబాయ్.. కోపంతో ఊగిపోయిన ఎన్టీఆర్

Advertisement

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. గ్లోబల్ నటుడు ఆయన. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేంజ్ కి ఎదిగింది. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ కు పంట పండింది.

Advertisement

ఇక.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఎన్టీఆర్ కు సైమా అవార్డు వచ్చింది. తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు గెలుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో నటించిన కొమురం భీం పాత్రకు ఎన్టీఆర్ కు ఆ అవార్డు లభించింది. దీంతో దుబాయిలో సైమా అవార్డులు ప్రకటించారు. ఆ అవార్డులకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. అక్కడే ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది.అయితే.. సైమా అవార్డు వేడుకకు దుబాయికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకోవడం కోసం స్టేజీ మీదికి వస్తుండగా అక్కడున్న వాళ్లంతా సీఎం ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Jr ntr warning to his fans

Jr ntr warning to his fans

Jr NTR : సీఎం ఎన్టీఆర్ అని అన్నవాళ్లపై ఓ లుక్కేసిన జూనియర్ ఎన్టీఆర్

ఒకటే గోల చేయడం, నినాదాలు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి అలా ఫ్యాన్స్ వైపు చూశాడు. కోపంతో వాళ్ల వైపు ఓ లుక్కేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే.. అది వేడుక కాబట్టి అక్కడి వాళ్లను ఏం అనలేకపోయాడు కానీ.. సీఎం ఎన్టీఆర్ అనేసరికి ఎన్టీఆర్ కు మాత్రం కోపం వచ్చినట్టుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement