Jr Soundarya : దయచేసి అలా చేయొద్దు.. నెటిజన్లను వేడుకుంటున్న జూనియర్ సౌందర్య..
Jr Soundarya : సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది అతి తక్కువ కాలంలో సెలబ్రిటీలు అయిపోతున్నారు. అయితే, టాలెంట్ ఉంటే చాలు.. సోషల్ మీడియా వారిని తప్పకుండా సెలబ్రిటీలను చేస్తుందని సోషల్ మీడియా నిపుణులు అంటున్నారు. కాగా, దివంగత హీరోయిన్ సౌందర్య మాదిరిగా ఉన్న చిత్ర అనే అమ్మాయి అనతికాలంలోనే పాపులర్ అయిపోయింది. సౌందర్య నటించిన సినిమాల్లోని పాటలను పాడి వాటిని సోషల్ మీడియా వేదికగా అప్‌లోడ్ చేయగా, అవి నెటిజన్లకు విపరీతంగా నచ్చేస్తున్నాయి. అచ్చం సౌందర్య మాదిరిగా ముఖ కవళికలు చూసి నెటిజన్లు జూనియర్ సౌందర్య అని తెగ పొగిడేస్తున్నారు.

Jr soundarya request to netizens
చిత్ర అనే అమ్మాయి ఫొటోలు, ఆమె అప్‌లోడ్ చేసిన వీడియోలు చూసి నెటిజన్లు, ప్రజలు సౌందర్య మళ్లీ పుట్టిందని పోస్టులు పెడుతున్నారు. సౌందర్య మళ్లీ పుట్టింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తున్నారు. కాగా, కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.సౌందర్య ఎక్కడ.. నువ్వెక్కడ.. నువ్వ ఏలియన్‌లా ఉన్నావ్..అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దాంతో తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పైన జూనియర్ సౌందర్య స్పందించింది. తాను సౌందర్య వీరాభిమానినని, నెటిజన్ల కోరిక మేరకే తాను సౌందర్యను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేశానని, అంతే తప్ప తాను సౌందర్యని ఫీల్ కాలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే తనను సపోర్ట్ చేసిన నెటిజన్లకు స్పెషల్ థాంక్స్ చెప్పిన జూనియర్ సౌందర్య అలియాస్ చిత్ర..నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారిని, దయచేసి అలా చేయొద్దని రిక్వెస్ట్ చేసింది.
Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందంటూ పోస్టులు..

Jr soundarya request to netizens
కొందరు నెటిజన్లు తన కలర్, రూపురేఖల గురించి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని వివరించింది. తాను సౌందర్య అంత గొప్పదానని కాదని, కేవలం ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేశానని, వాటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపింది. తన ఫాలోవర్స్ రిక్వెస్ట్ చేసినందువల్లే తాను సౌందర్యను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేశానని జూనియర్ సౌందర్య చెప్పింది.